For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 ఎక్కువ జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఇవే ఇందులో మీరు ఉన్నారా?

By girish
|

వాడికేంటిరా పుట్ట‌డమే డ‌బ్బులో పుట్టాడు. డ‌బ్బు విలువ ఏం తెలుస్తుంది అని మ‌న గ్రూప్‌లో ఉన్న రిచ్ ఫ్రెండ్‌ను ఉద్దేశించి అంటుంటాం. ధ‌న‌వంతుల‌వ్వాలంటే ఎవ‌రో ధ‌న‌వంతుడికే పుట్టాలా? మ‌నకు మ‌నం రిచ్ కాలేమా అంటే ఎందుకు కాలేము.. బాగా చ‌దువుకొని ఈ ఉద్యోగాలు సంపాదిస్తే తొంద‌ర్లోనే మ‌న‌మూ సంప‌న్నుల‌వ్వ‌గ‌లం. మ‌రి అంతంత ఎక్కువ‌ వేత‌నాలు పొందాలంటే క‌చ్చితంగా ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలంటారు. అక్క‌ర్లేదు... మ‌న దేశంలోనే అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయి. వీటిల్లో ప్రారంభ వేత‌న‌మే ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. అనుభ‌వం పెరిగే కొద్దీ ల‌క్ష‌ల్లోనే జీతాలుంటాయి. మ‌రి అత్య‌ధిక పారితోషికాలిచ్చే ఒక 10 ఉన్న‌త‌స్థాయి ఉద్యోగాల గురించి తెలుసుకుందామా

1. మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌:

1. మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌:

ఏ సంస్థ‌కైనా ప్ర‌ధాన ఆయువు ప‌ట్టు మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌. మేనేజ‌ర్ స్థాయి వ్య‌క్తుల‌కు సంస్థ‌లో చాలా ప‌నులు ఉంటాయి. ఎంట్రీ లెవ‌ల్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వస్తుంది. ఒక లెవ‌ల్ దాటాక వృత్తి విష‌యంలో ఇక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అధిక స్థాయిలో వృత్తిలో ఉన్న మేనేజ‌ర్లు ఎక్కువ వేత‌నాన్ని డిమాండ్ చేసేందుకు అవ‌కాశాలున్నాయి. వారికి బ్ర‌హ్మ‌ర‌థాన్ని కూడా అలాగే ప‌డ‌తారు మ‌రి. మీరు ఏదైనా సంస్థ‌లో మేనేజ‌ర్‌గా స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా? ప్రారంభం వేత‌నం... రూ.3ల‌క్ష‌లు కెరీర్ మ‌ధ్య‌లో.. రూ.25ల‌క్ష‌లు అనుభవజ్ఞులకు .. రూ.80ల‌క్ష‌లు గ‌మ‌నికః ఇక్క‌డ పేర్కొన్న వేత‌న శ్రేణి ఏడాదికి లెక్క వేసిన‌ది.

2. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు:

2. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు:

సంస్థ‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్ట‌డంలోనూ, మూల‌ధ‌న పెట్టుబ‌డుల‌ను సేక‌రించ‌డంలోను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక‌ర్ల‌ది కీల‌క పాత్ర‌. సంస్థ‌కు ఆర్థిక స‌ల‌హాల‌ను అందించేది కూడా వీరే. మ‌నీ మ్యాన్‌గా వీరిని పొట్టి పేరుతో పిలుస్తారు. ప్రారంభం వేత‌నం... రూ.12ల‌క్ష‌లు కెరీర్ మ‌ధ్య‌లో.. రూ.30ల‌క్ష‌లు అనుభవజ్ఞులకు .. రూ.50ల‌క్ష‌లు

3. చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు:

3. చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు:

వ్యాపార ద‌క్ష‌త‌లోనూ, అకౌంటింగ్‌లోనూ మంచి ప‌ట్టు ఉన్న‌వారు చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు. ఆదాయపు ప‌న్నుకు సంబంధించి చాలా స‌మ‌స్య‌ల‌కు సీఏల ద‌గ్గ‌ర ప‌రిష్కార‌ముంటుంది. అంతేకాదు మ‌న దేశంలో ఈ వృత్తిలోని వారికి ఎంతో గౌర‌వం ఉంది. ప్రారంభ వేత‌నం... రూ.5.5ల‌క్ష‌లు కెరీర్ మ‌ధ్య‌లో.. రూ.12.8ల‌క్ష‌లు అనుభవజ్ఞులకు .. రూ.25.7ల‌క్ష‌లు

4. చ‌మురు, స‌హ‌జ‌వాయువు రంగ నిపుణులు:

4. చ‌మురు, స‌హ‌జ‌వాయువు రంగ నిపుణులు:

ఈ రంగంలో భారీ లాభాలే వ‌స్తాయి. మ‌న దేశంలో చ‌మురుకు ఉన్న డిమాండ్ ఏమిటో తెలిసిందే. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాం. ముడి చ‌మురు పెట్రోల్‌, డీజిల్‌గా మారేందుకు ఎన్నో ప్ర‌హ‌స‌నాల‌ను దాటుకుంటూ వెళ్లాలి. మ‌రి ఈ రంగంలో ప‌నిచేసేవాళ్లు ఎంత నిష్ణాతులై ఉండాలో ఆలోచించండి. జియాల‌జిస్టులు, మెరైన్ ఇంజ‌నీర్లు లాంటి వృత్తులు ఉంటాయి. వారికి వేత‌నాలు కూడా బాగానే ఉంటాయి. మీరు బాగా చ‌దువుకొని ఇలాంటి రంగాల్లో స్థిర‌ప‌డితే జీవితం సంప‌న్న‌మ‌య‌మ‌వుతుంది. అనుభవజ్ఞులకు .. రూ.15-20 ల‌క్ష‌ల మ‌ధ్య‌లో... దీంతో పాటు అద‌నంగా అనేక ప్రోత్సాహాకాలు ఉంటాయి.

5. వ్యాపార విశ్లేష‌కుడు(బిజినెస్ అన‌లిస్ట్‌):

5. వ్యాపార విశ్లేష‌కుడు(బిజినెస్ అన‌లిస్ట్‌):

మ‌న దేశంలో వ్యాపారాల మ‌ధ్య పోటీ నానాటికీ పెరిగిపోతుంది. మార్కెట్‌లో సంస్థల మ‌ధ్య పోటీత‌త్వాన్ని విశ్లేషించేందుకు వ్యాపార విశ్లేష‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ రంగంలో ఎక్కువ ఐక్యూ ఉన్న‌వారిని, లాజిక‌ల్‌గా ఆలోచించేవారికి ప్రాధాన్య‌త‌నిస్తారు. ఈ ఉద్యోగం చేసేవారికి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద మంచి ప‌ట్టు ఉండాలి. కొత్త కొత్త టెక్నాల‌జీలు నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపించాలి. వారి తెలివితో, మేధ‌స్సుతో వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఎదిగించేందుకు కృషి చేయ‌గ‌ల‌గాలి. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే వీళ్ల పాత్రా ఉండాల్సిందే. వీరికి ప్రారంభంలో అందే వేతనం ర‌మార‌మిగా ఏటా రూ.6ల‌క్ష‌ల నుంచి మొద‌ల‌వుతుంది

6. వైద్య వృత్తి నిపుణులు:

6. వైద్య వృత్తి నిపుణులు:

ఇలాంటి వృత్తికి మాంద్యం దెబ్బ త‌గిలే అవ‌కాశ‌మే లేదు. ఎందుకంటే ఇంత మంది జ‌నాభాలో డాక్ట‌ర్ల‌కు కొర‌త ఉంటుందే త‌ప్ప రోగుల‌కు ఎప్పుడూ ఉండ‌దు. ప‌విత్ర‌మైన వైద్య వృత్తిలో సంతృప్తితో పాటు డ‌బ్బు బాగానే చేతికొస్తుంది. ప్రారంభంలో కాస్త క‌ష్టంగా ఉన్నా.. డాక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదిస్తే చాలు నాడీ ప‌ట్టుకుంటేనే రూ.200 ఫీజు వ‌సూలు చేయ‌వ‌చ్చు. అంటే ఇక్క‌డ ఉద్దేశం అది కాదు. బాగా సంపాదించ‌వ‌చ్చు అని. స‌రాస‌రి సంపాద‌న... సాధార‌ణ ప్రాక్టీస్‌కు ... రూ.4.8లక్ష‌లు జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ కు .... రూ.8.10ల‌క్ష‌లు మెడిక‌ల్ డాక్ట‌ర్‌.... రూ.17ల‌క్ష‌లు

7. విమానయాన‌ రంగ వృత్తి:

7. విమానయాన‌ రంగ వృత్తి:

ఆకాశ‌మే హ‌ద్దుగా వీరి వృత్తి జీవ‌నముంటుంది. వీరి వేత‌నాలు ఏకంగా రూ.20ల‌క్ష‌ల దాకా ఉంటాయి. ఎన్నో దేశాల‌ను చుట్టి వ‌చ్చే సౌల‌భ్యంతో పాటు స‌మాజంలో మంచి గౌర‌వం ఉంటుంది. ఎంతో మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోకుండా భ‌ద్రంగా చేర్చ‌గ‌ల నిపుణులు వీరు. స‌రాస‌రి వేత‌నం క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్‌కు... రూ.20లక్ష‌లు హెలికాప్ట‌ర్ పైల‌ట్‌కు... రూ.18లక్ష‌లు ఎయిర్ క్రాఫ్ట్ నిర్వ‌హ‌ణ నిపుణుడికి.. రూ.9.8లక్ష‌లు

8. న్యాయ వృత్తిలోనివారు

8. న్యాయ వృత్తిలోనివారు

ప్ర‌ముఖులైన న్యాయ‌వాదులంతా న్యాయ‌స్థానాల్లో న్యాయ‌మూర్తులుగా అవ‌కాశాలు ఇస్తామంటే కాద‌న్నారు. న్యాయ‌వాదులుగా వ‌చ్చే ఆదాయం, సంతృప్తి కోర్టులో కూర్చొని వాద‌న వినే జ‌డ్జికి ఉండ‌ద‌ని కొంద‌రి అభిప్రాయం. అన‌ర్గ‌ళమైన వాక్చాతుర్యం, ఓపిక‌, స‌హ‌నం, బాగా చ‌దువుకున్న‌వారు ఈ వృత్తిలో కొన‌సాగేవారి ల‌క్ష‌ణాలుగా ఉండాలి. టాప్ లాయ‌ర్లు ఒక్కో కేసును వాదించేందుకు భారీగానే డిమాండ్ చేస్తారు. స‌రాస‌రి ఆదాయం కార్పొరేట్ లాయ‌ర్‌.... రూ.6.1ల‌క్ష‌లు సీనియ‌ర్ అటార్నీ... రూ. 9.5లక్ష‌లు

9. మార్కెటింగ్ జాబ్స్‌:

9. మార్కెటింగ్ జాబ్స్‌:

మార్కెటింగ్ ఒక క‌ళ‌. ఎవ‌రైనా ఈ క‌ళ‌ను సాధ‌న చేసి ప‌ట్టు సాధిస్తే మ‌న దేశంలో ఉన్న టాప్ కంపెనీల్లో స్థానం సంపాదించుకోవ‌చ్చు. మార్కెటింగ్‌లో బాగా నైపుణ్యం ఉన్న వ్య‌క్తి ఓ కంపెనీకి ఏకంగా సీఈఓ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. స‌రాస‌రి ఆదాయం లేదా వేత‌నం ప్రారంభ వేత‌నం.. రూ.1.5ల‌క్ష‌లు కెరీర్ మ‌ధ్య‌లో... రూ.5ల‌క్ష‌లు అనుభవజ్ఞులకు .. రూ.10లక్ష‌లు మొద‌లుకొని..

10. ఐటీ, సాఫ్ట్‌వేర్ నిపుణులు:

10. ఐటీ, సాఫ్ట్‌వేర్ నిపుణులు:

అధిక వేత‌నాలిచ్చే వాటిలో ఇదో ఎవ‌ర్‌గ్రీన్ వృత్తిగా భావించ‌వ‌చ్చు. కంప్యూట‌ర్లు, కంప్యూట‌ర్ లాంగ్వేజ్‌ల‌లో మంచి క‌మాండింగ్ ఉండాలి. వెబ్‌సైట్ల‌ డిజైనింగ్‌, ఆచ‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌లో ఈ వృత్తివారు కీల‌క పాత్ర పోషిస్తారు. సాఫ్ట్‌వేర్ కొలువుల‌కు ఈ మ‌ధ్య కాస్త డిమాండ్ త‌గ్గిన‌ట్టు క‌నిపించినా ఎప్పటికైనా వీరిది ఎక్కువ వేత‌నమిచ్చే ఉద్యోగ‌మే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బాగా వీకెండ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు అని మంచి టాక్‌. స‌రాస‌రి వేత‌నం ప్రారంభంలో.. రూ.3.5ల‌క్ష‌లు కెరీర్ మ‌ధ్య‌లో... రూ. 8.3ల‌క్ష‌లు అనుభవం ఉన్న‌వారికి... రూ.15.5లక్ష‌లు

Read more about: jobs
English summary

టాప్ 10 ఎక్కువ జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఇవే ఇందులో మీరు ఉన్నారా? | Top 10 Best Salary Jobs in India

best jobs in india has been listed in these article please go throw it
Story first published: Saturday, November 24, 2018, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X