For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్టులు ఏవో మీకు తెలుసా?

By girish
|

మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి కావలసింది పాస్‌పోర్ట్ ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటుంది కానీ వీసా మాత్రం దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది.. ఎన్ని దేశాలు తిరిగితే అన్ని దేశాలు మనకు వీసా మంజూరు చేయాలి.. ఆయా దేశాల కాన్సులేట్ కార్యాలయాల్లో డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ. ఆపై ప్రాసెసింగ్ పూర్తయితేనే వీసా వస్తుంది.

జపాన్‌

జపాన్‌

అయితే వీసా అవసరమే లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తోనే విదేశాలకు వెళ్లొచ్చు ఇలాంటి వాటిలో మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు జపాన్‌ది. పాస్‌పోర్ట్‌కు పవరేంటి అనుకుంటున్నారా..? ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం ఉండదో దానిని మోస్ట్ పవర్ ఫుల్‌గా పరిగణిస్తారు

ప్రపంచంలోని 190

ప్రపంచంలోని 190

ప్రస్తుతం జపాన్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ దేశం యొక్క పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు.. ఇటీవలే మయన్మార్‌కు కూడా వీసా లేకుండా వెళ్ళే గుర్తింపు లభించింది.

సింగపూర్

సింగపూర్

జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలో వీసా పొందే అవకాశం ఉంది.. మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ రెండోస్థానంలో, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు మూడో స్థానంలో, అమెరికా, బ్రిటన్‌లు ఐదవ స్థానంలో ఉన్నాయి.

భారత్

భారత్

ఇక భారత్ విషయానికి వస్తే వీసా లేకుండా మనం 59 దేశాలకు వెళ్లొచ్చు. ర్యాంకింగ్ పరంగా మన స్థానం 76. ఒక దేశం మరో దేశంతో కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వీసా లేకుండానే ఆయా దేశాల్లో పర్యటించవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇవ్వబడ్డాయి.

సుష్మాస్వరాజ్‌

సుష్మాస్వరాజ్‌

ఇక కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ఇటీవల ప్రారంభించిన పాస్‌పోర్ట్‌ సేవా మొబైల్‌ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ యాప్‌ ప్రారంభించిన రెండు రోజుల్లోనే లక్ష మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని సుష్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

పాస్‌పోర్టు కార్యాలయం

పాస్‌పోర్టు కార్యాలయం

ఈ యాప్‌ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుష్మ తెలిపారు. జూన్ 26న ఆరో 'పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌'ను పురస్కరించుకుని సుష్మ ఈ యాప్‌ను ప్రారంభించారు.ఈ యాప్‌ ద్వారా వలసదారులు తమ స్వస్థలాల నుంచే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంతంలో గువాహటిలో మాత్రమే పాస్‌పోర్టు కార్యాలయం ఉంది.

పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్

పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్

ఇప్పుడు కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు ఈ ప్రాంతంలో పనిచేయనున్నాయని సుష్మ వెల్లడించారు. గత రెండు దశల్లో 251 పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రకటించాం.వాటిలో 212 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మూడో దశలో మరో 38 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆమె తెలిపారు.

 ఈ విధానం

ఈ విధానం

ఇప్పటివరకు 260 వర్కింగ్ పాస్‌పోర్టు కేంద్రాలు ఉండగా, లోక్‌సభ నియోజవర్గ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలో అధికారులు, విదేశాంగ శాఖ జాబితా తయారు చేస్తోందని తెలిపారు. ఈ విధానం కింద పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం(ఆర్‌పీఓ), పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఎస్‌కే) లేదా పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

దరఖాస్తు ఫారం

దరఖాస్తు ఫారం

ఎంచుకున్న ఆర్‌పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్‌ పంపొచ్చు.దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది

Read more about: passport
English summary

ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్టులు ఏవో మీకు తెలుసా? | Most Powerful Passport in World

Passport is necessary if We need to go from one country to another. The passport is the same as the number of countries passport is the same, but visa will vary from country to country
Story first published: Thursday, October 11, 2018, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X