For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే ప్రయాణికులకు శుభవార్త 1 రూపాయి కడితే రూ.10 లక్షల భీమా!

By girish
|

రైల్వే శాఖ ఖర్చులు తగ్గించుకొనే క్రమంలో ప్రయాణికులు నుంచి అదనంగా వసూల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2016 లో ఫ్లెక్సీ ఫెయిర్ సిస్టమ్ అని ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్దగా లాభం లేకపోయినా రైల్వే శాఖకి మాత్రం ఆదాయం సమకూరుతుంది.

ప్రయాణికులకు

ప్రయాణికులకు

తాజాగా ఈ టికెట్ తీసుకొనే ప్రయాణికులకు భీమా ఒక ఆప్షన్ గా మార్చింది. ఇక పై ఎవరన్నా ఆన్ లైన్లో IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకొనే ప్రయాణికులకు భీమా కావాలా వద్ద అని వారికే ఆప్షన్ వదిలేసింది. టికెట్ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్ కూడా ఒక ఆప్షన్ గా ఇస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కావలసిన వారికీ ఒక రూపాయి అదనంగా వసూల్ చేస్తారు.

 టికెట్ బుకింగ్

టికెట్ బుకింగ్

ఆన్ లైన్ విధానంలో టికెట్ బుకింగ్ ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్ లో ప్రయాణికులకు ఉచిత భీమా రైల్వే శాఖ అమలు చేసింది. ఈ విధానం ఈ నెల 2 వ తేదీ వరకు కొనసాగింది. దాదాపు 9 నెలనెలా పాటు ఉచిత భీమా సదుపాయం కలిపించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది.

శ్రీరామ్ ఫైనాన్స్

శ్రీరామ్ ఫైనాన్స్

స్లీపర్, ఏసి, చైర్ కార్ సీట్ల కోసం టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణికులు భీమా కావాలా? వద్ద?అని ఇకపై ప్రయాణికులకు వదిలేసింది. దీనికోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి సంస్థలతో రైల్వే శాఖ అగ్రిమెంట్ చేసుకొంది.

ప్రయాణికుడి క్షేమాన్ని

ప్రయాణికుడి క్షేమాన్ని

భీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.50 లక్షలు మరియు గాయపడిన వారికీ రూ.2.50 లక్షలు పరిహారం వస్తుంది. ఈ టికెట్ పై భిమాను పెట్టడం పై ప్రయాణికులు వ్యతరేకిస్తున్నారు. ప్రయాణికుడి క్షేమాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు.

 భీమా విషయంలో

భీమా విషయంలో

అదనంగా భీమా వాసల్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ కంపెనీలకు కాకుండా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ఏంటి అని మండిపడుతున్నారు. భీమా విషయంలో సాధారణ టికెట్ ప్రయాణికులు ఆందోళన పడనవసరం లేదు అని రైల్వే అధికారులు హామీ ఇస్తున్నారు. ప్రయాణికులు ఏదన్నా జరిగితే వారికీ నష్టపరిహారం రైల్వే శాఖ చెల్లిస్తుంది అని చెప్పారు.ఈ-టికెట్ లేదా IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకొనే వారికీ ఈ భీమా అదనం అని అంటున్నారు.

Read more about: insurance
English summary

రైల్వే ప్రయాణికులకు శుభవార్త 1 రూపాయి కడితే రూ.10 లక్షల భీమా! | Good News For People Who Are Travelling Through Railways

The railway ministry is going to collect extra from passengers in order to reduce costs
Story first published: Tuesday, September 25, 2018, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X