For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజురోజుకు ముదురుతున్న యుద్ధం అమెరికా- చైనా ఇలా చేస్తున్నాయి ఏంటి?

By Sabari
|

అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనా దిగుమతులకు 'సుంకం' వాత పెట్టారు.

సుంకాలు

సుంకాలు

చైనా నుంచి దిగుమతి అయ్యే మరో 200 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే 34 బిల్లియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలను అమెరికా గత వారం 25 శాతానికి పెంచకావాటికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది.

కౌంటర్

కౌంటర్

చైనా నిర్ణయానికి కౌంటర్ అన్నట్లుగా సెప్టెంబరు ప్రారంభం నుంచి అదనంగా 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై అగ్ర రాజ్యం సుంకాలను పెంచింది.

ట్రేడ్ వార్‌

ట్రేడ్ వార్‌

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు ఇలా పోటాపోటీగా దిగుమతి సుంకాలు పెంచుతూ ట్రేడ్ వార్‌ను ఉధృతం చేస్తున్నాయి.

ట్రంప్ తీసుకున్న

ట్రంప్ తీసుకున్న

ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే వేలాది ఉత్పత్తుల ధరలు అమెరికాలో మరింత ప్రియంకానున్నాయి. చేపలు, రసాయనాలు మొదలుకొని టైర్ల వరకు పలు ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి.

ఆర్థిక వ్యవస్థకు

ఆర్థిక వ్యవస్థకు

చైనా అనారోగ్యకరమైన వాణిజ్య విధానాలను అవలంభిస్తున్నందున దీని ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలు పెంచడమే సరైన మార్గమంటూ తన నిర్ణయాన్ని అమెరికా సమర్థించుకుంటోంది.

విదేశీ ఉత్పత్తుల

విదేశీ ఉత్పత్తుల

దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా విదేశీ ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపడం, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని అమెరికా భావిస్తోంది. అలాగే తమ ఉత్పత్తులకు అధిక దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్న చైనా, భారత్ వంటి దేశాలను దారిలోకి తెచ్చుకోవాలన్నది అమెరికా యోచనగా తెలుస్తోంది.

తీవ్రస్థాయిలో

తీవ్రస్థాయిలో

తమ ఉత్పత్తులపై చైనా, భారత్ తదితర దేశాలు అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నాయంటూ గతంలోనే ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అదే సమయంలో తమ దేశంలో మాత్రం అవి తక్కువ సుంకాలకు తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

ఉద్యోగులు భయపడుతున్నారు

ఉద్యోగులు భయపడుతున్నారు

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ఎ క్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచ పారిశ్రామికవర్గాల్లో వ్యక్తమవుతోంది.మళ్ళీ రెసిషన్ వస్తుందా? అని చాలా మంది భయపడుతున్నారు. దీని వల్ల నష్టపోయేది చివరికి ఉద్యోగులు మాత్రమే!

Read more about: trump us china
English summary

రోజురోజుకు ముదురుతున్న యుద్ధం అమెరికా- చైనా ఇలా చేస్తున్నాయి ఏంటి? | America and China Trade War Becoming Serious Day by Day

The ongoing trade war between America and China is getting worse. US President Donald Trump has once again shaved the tariff for China imports.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X