For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు డిపాజిట్లు vs పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) బ్యాంకు డిపాజిట్లతో పోల్చిచూస్తే పబ్లిక్ ప్రావిడ

By Sabari
|

మీరు కనుక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) లేక బ్యాంక్ డిపాజిట్లలలో చూస్తే, ఎందులో మదుపు పెడదామా అని ఆలోచిస్తున్నట్లైతే మేము మాత్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టమని సిఫార్సు చేస్తాం. ఇలా చెప్పడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

1. వడ్డీ రేట్లు:

1. వడ్డీ రేట్లు:

ప్రతి త్రైమాసికంలో రివైస్ చేయబడినప్పటికి, బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఎప్పుడు మెరుగ్గా ఉంటాయి.

ప్రస్తుతానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.6% వడ్డీ రేట్ ఉంటే

ప్రభుత్వ రంగ బ్యాంకులలో 6-6.5% ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు డిపాజిట్ల పై అత్యధికంగా 6.5% వడ్డీ ఇస్తున్నాయి. దీనినిబట్టి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై ఒక శాతం అధిక వడ్డీ లభిస్తుందని తెలుస్తుంది.

2. రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి:

2. రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి:

బ్యాంకులు డిపాజిట్లతో పోల్చిచూస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎక్కువ సురక్షితమైనది. బ్యాంకులు డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తం మీద పన్ను కట్టవలసి ఉంది. ఒక వ్యక్తికి బ్యాంక్ డిపాజిట్ల పై వచ్చే వడ్డీని అతని ఆదాయానికి కలుపుకుని మొత్తంపై పన్ను విధిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ మీద ఎటువంటి పన్ను కట్టనవసరం లేదు.

మీరు కనుక అధిక పన్ను చెల్లించే వారి బ్రాకెట్ లో ఉన్నట్లయితే, మీ బ్యాంక్ వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాన్ని 30% తగ్గించుకోవాలి . ఇలా చేసినట్లయితే మీ పోస్ట్ టాక్స్ రిటర్నులు తగ్గుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షలకు మించి సొమ్ము పెట్టలేకపోయినప్పటికి, దీని వడ్డీల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించనవసరంలేదు.

3. సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు:

3. సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు:

సెక్షన్ 80 సి ప్రకారం, మీరు సంవత్సరానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో గరిష్టంగా మదుపుచేసిన 1.5 లక్షల వరకు సొమ్ముపై పన్ను మినహాయింపు లభిస్తుంది. చాలా వరకు బ్యాంకులు ఈ సదుపాయాన్ని కల్పించవు. కనుక ఈ పధకం ద్వారా అధిక పన్ను బ్రాకెట్ లో ఉన్నవారు 50,000 రూపాయలు, 20% పన్ను బ్రాకెట్ లో ఉన్నవారు 30,000 రూపాయలు మరియు10% పన్ను బ్రాకెట్ లో ఉన్నవారు 15,000 రూపాయలు ఆదాచేసుకోవచ్చు.

4. మీ ఉద్యోగ విరమణ మూలనిధి క్రింద పనికొస్తుంది:

4. మీ ఉద్యోగ విరమణ మూలనిధి క్రింద పనికొస్తుంది:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 15 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడి కనుక ఇది మీ విరమణ కార్పస్ క్రింద పనికొస్తుంది. ఏడేళ్లవరకు మీ డబ్బును వెనక్కి తీసుకునే సదుపాయం లేదు మీ డబ్బు ఆదా అవుతుంది. మీరు దీనిని సులభంగా ఉపసంహరించుకోలేరు. ఒక విధంగా బలవంతపు పెట్టుబడిగా పనికొస్తుంది. బ్యాంకుల్లో ఈ పరిస్థితి లేదు. మీరిప్పుడు కావాలంటే అప్పుడు మీ పెట్టుబడిని సులువుగా ఉపసంహరించుకునే సదుపాయం ఉండటం మూలాన భవిష్యత్తు కై ఆదా చేసి ఉంచుకోగలమనే నమ్మకం లేదు.

5. సేవలు:

5. సేవలు:

మీరు కనుక ఉద్యోగ విరమణానంతరం కొరకు మూలనిధి నిర్మాణం పన్ను లేని వడ్డీ రాబడితో చేద్దామనుకుంటే బ్యాంక్ డిపాజిట్ కన్నా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మిన్న. ఒక్క దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనే షరతు తప్పితే మిగిలినవన్నీ మనకు అనుకూలమే. ఎక్కడ ఈ సేవలు పొందాలనేది పెద్ద సమస్య కాదు.ఈ రోజుల్లో బ్యాంకులు కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ తెరవడానికి సహకారం అందిస్తున్నాయి. కనుక తపాలా కార్యాలయం వెతుక్కుంటూ పరిగెత్తనవసరం లేదు. ఆన్లైన్లో చెల్లింపులు ,బదిలీల వీలు ఉంది.

6. సునాయాసంగా లిక్విడిటీ:

6. సునాయాసంగా లిక్విడిటీ:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద బాంక్ డిపాజిట్లలో ఉన్న సదుపాయం ఏమిటంటే అవి సులువుగా కాలపరిమితి కన్నా ముందే ధనరూపంలో మార్చుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ను ఏడు సంవత్సరాల తరువాత పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఇది మీకు ప్రయోజనమా లేదా ప్రతికూలమా అనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. మొత్తంగా, బ్యాంకులు డిపాజిట్లతో పోల్చిచూస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నట్లు అనిపిస్తుంది.

Read more about: ppf bank deposit
English summary

బ్యాంకు డిపాజిట్లు vs పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) బ్యాంకు డిపాజిట్లతో పోల్చిచూస్తే పబ్లిక్ ప్రావిడ | PPF Vs Bank Deposits: Why PPF Is Better?

If you have to decide on an investment between the Public Provident Fund (PPF) and bank.
Story first published: Monday, April 23, 2018, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X