For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీనికి కారణం నా కూతురే...ముకేశ్ అంబానీ?

By Sabari
|

భారతదేశంలో జియో సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.మార్కెట్ లోకి వచ్చిన క్షణం నుంచే భారత్ ను ప్రపంచంలోనే అతి పెద్ద డేటా వినియోగ దేశంగా నింపింది.

తన కుమార్తె ఇషా అంబానీ

తన కుమార్తె ఇషా అంబానీ

అలాంటి jio పుట్టుకకు అసలు కారణం తన కుమార్తె ఇషా అంబానీ అని అంటున్నాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.ఈ మధ్య డ్రైవర్స్ అఫ్ చేంజ్ అనే అవార్డు అందుకున్న సంధర్బంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అయన మాటలతో చెప్పాలి అంటే నిజానికి జియో ఆలోచన 2011 లో నా కుమార్తె ద్వారా వచ్చింది.

సెలవులకి ఇంటికి

సెలవులకి ఇంటికి

అప్పుడు తాను చదువుకుంటూ సెలవులకి అని ఇంటికి వచ్చింది.తనకు సంభందించిన ప్రాజెక్ట్ వర్క్ ఏదో పూర్తి చేయాలనీ చూస్తోంది. అయితే ఇంటర్నెట్ సహకరించడం లేదు.దింతో నాన్న మన ఇంట్లో ఇంటర్నెట్ వేగం అసలు లేదు అని నాతో చెప్పింది. పక్కనే ఉన్న ఆకాష్ మాట్లాడుతూ మనం ఇంకా పాత ప్రపంచం లోనే ఉన్నాం. వాయిస్ కాల్స్ కు డబ్బులు కడుతునం. కొత్త ప్రపంచంలో ప్రతిదీ డిజిటల్ నాన్న అని ఆకాష్ నాతో అన్నాడు. అప్పుడే JIO ఆవిర్భావానికి అడుగు పడింది.

ఇషా -ఆకాష్ లు

ఇషా -ఆకాష్ లు

ఇషా ఆకాష్ లు భారత యువతరానికి చెందినవారు చాల సృజన ఉన్న వాళ్లు విజయకాంశాలు ఉన్నవారు. ప్రపంచంలోకి కల్లా బాగా ఎదగడానికి ఆతృతగా ఉన్న వాళ్ళు వీరు ఇద్దరు నాకు బ్రాడ్ బ్యాండ్ గురించి చెప్పి ఒప్పించారు. అప్పుడే మన భారత్ సాంకేతిక విషయం లో వెనకపడి ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను.

నెట్ అనుసంధానం

నెట్ అనుసంధానం

ఆ సమయం లో భారత్ లో నెట్ అనుసంధానం చాల తక్కువగా ఉండేది.డేటా కొరత ఉండడమే కాదు ధర కూడా చాల ఎక్కువ చాలమందికి అది అందనంత ఎత్తులో ఉండేది. కానీ జియో వచ్చాకా డేటా ని మరియు కాల్స్ ని ప్రతి ఒకరికి అందుబాటులో తీసుకోని వచ్చాం.

జియో ప్రారంభం

జియో ప్రారంభం

సెప్టెంబర్ 2016 లో జియోని ప్రారంభించాం ఇప్పటికే భారత్ లో ఒక గొప్ప మార్పుగ అవతరించింది.అమెరికా 1G మొబైల్ నెట్ వర్క్ ,ఆరోఫ 2G , చైనా 3G తో ముందు అడుగు వేయగా JIO 4G ప్రపంచంలోనే అతి పెద్దగా మారింది.2019 కల్లా 4G ని భారత్ లో అగ్రగామిగా నిలపెడతాం.

జియో 5G

జియో 5G

భారత వ్యాప్తంగా 2G నెట్వర్క్ తీసుకురావడానికి 25 ఏళ్ళు పట్టింది.కానీ JIO కేవలం 3 ఏళ్ళు పట్టింది. 5G కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది అని JIO ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చిందో వివరించాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.

కృతజ్ఞతలు

కృతజ్ఞతలు

ఇదిఅంతా చదివాకా మనం ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి.ఎందుకు అంటే ఆ రోజు ఆమెకి నెట్ సమస్య రాకపోయిఉంటే ఈ రోజు జియో 4G మన దగ్గరకి వచ్చేది కాదు

English summary

దీనికి కారణం నా కూతురే...ముకేశ్ అంబానీ? | My daughter inspired Jio: Mukesh Ambani

Many have wondered how Jio gained such prominence, managed to capture such a large part of the Indian telecom industry, and made India the world’s largest mobile data-consuming market in such a short span of time.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X