For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న మొత్తాల ఖాతాదారులకు శుభ‌వార్త‌

By Sabari
|

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలైన పీపీఎఫ్‌, జాతీయ పొదుపు ప‌త్రాలు, ఐదేళ్ల ఎఫ్‌డీలు వంటి వాటికి సంబంధించి పెట్టుబ‌డిదారుల‌కు సంతోషం క‌లిగించే నిర్ణ‌యాన్ని కేంద్రం తీసుకుంది. ఆయా మార్గాల్లో పొదుపు చేసేవారికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు వారి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డాన్ని సులువుగా ఉండేలా కేంద్రం అవ‌స‌ర‌మైన మార్పులకు క‌స‌ర‌త్తు చేస్తోంది.

Quick Withdraw for Small Schemes

మామూలుగా అయితే పీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల‌ను సాధార‌ణ ప‌రిస్థితుల్లో 15 ఏళ్ల వ‌ర‌కూ వెన‌క్కు తీసుకోవ‌డానికి వీల్లేదు. 2016 సంవ‌త్స‌రంలో దీనికి సంబంధించి స్వ‌ల్ప మార్పులు చేశారు. అప్ప‌టి నుంచి వైద్య అత్య‌వ‌స‌రాల కోసం, ఉన్న‌త చ‌దువుల‌కు సంబంధించి 1% పెనాల్టీతో ప్రీమెచ్యూర్ క్లోజ‌ర్‌కు వీలు క‌ల్పిస్తున్నారు.
Quick Withdraw for Small Schemes
అదే విధంగా పెట్టుబ‌డి ప్రారంభించిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశ‌మిచ్చారు.

చిన్న మొత్తాల పొదుపు చట్టాల‌కు కొత్త‌గా వ‌చ్చే స‌వ‌ర‌ణ ద్వారా సంర‌క్ష‌కులు అన్ని ప‌థ‌కాల్లో మైన‌ర్ల పేరిట డిపాజిట్లు చేయ‌డానికి వీలు క‌ల్పిస్తారు.

Quick Withdraw for Small Schemes
ఇప్ప‌టికైతే కేవ‌లం కొన్నింటిలో మాత్ర‌మే ఈ స‌దుపాయం అందుబాటులో ఉంది. మైన‌ర్లు సైతం త‌మ డ‌బ్బును త‌ద‌నంత‌రం ఎవ‌రికి చెందాలో నిర్ణ‌యించే వీలును క‌ల్పిస్తారు.
చిన్న మొత్తాల పొదుపు సంబంధించి చేసే స‌వ‌ర‌ణ‌లు నామీని హ‌క్కుల‌ను సైతం కాపాడే విధంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇంకా ఖాతా నిర్వ‌హ‌ణ సైతం భ‌విష్య‌త్తులో సులువు కానుంది.
Quick Withdraw for Small Schemes
మొత్తానికి చిన్న మొత్తాల పొదుపుకు సంబంధించి చట్టాల‌కు చేసే స‌వ‌ర‌ణ‌లు ప్ర‌జ‌లు మ‌రింతగా ఈ ప‌థ‌కాల్లో పొదుపు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉండ‌నున్న‌ట్లు ఎక‌న‌మిక్ టైమ్స్ క‌థ‌నం వెల్ల‌డించింది.

English summary

చిన్న మొత్తాల ఖాతాదారులకు శుభ‌వార్త‌ | Quick Withdraw for Small Schemes

In what could make small savings schemes like public provident fund (PPF) more attractive for investors, the government may be planning to provide greater flexibility by allowing early withdrawal in case of financial emergencies.
Story first published: Wednesday, February 14, 2018, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X