For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018లో మ‌నం తెలుసుకోవాల్సిన అతి ముఖ్య‌మైన మార్కెట్ విశేషాలు

రాజకీయాలకు, ప్రముఖ వ్యాపారాల మెరుపులు తగ్గిపోవడానికి మధ్య, వచ్చే 12 నెలలు కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అనంతమైన రిస్కులు సిద్ధంగా వున్నాయి. మీరు ఈ ఏడాది ప్రారంభించేలోగా వాటిలో అతి ముఖ్యమైన మార్కెట్

|

నడిరాత్రి ట్వీటే అమెరికా ప్రెసిడెంట్, రికార్డు స్థాయిలో నమోదైన షేర్ల ధరలు, బిట్ కాయిన్ హడావిడితో మనం బతికేయడం నేర్చుకున్నంతలో ఈ ఏడాది అలా ముగిసిపోయింది. మనం 2018లోకి అడుగు పెడుతుంటే పెరుగుతున్న ఆస్తుల ధరలు, తగ్గుతున్న అస్థిరత సాధారణం అయిపోతుంటే, ప్రపంచ వృద్ది బలంగా వుండి అన్నిరకాల ఆస్తుల ధరలు ఆశాజనకంగా వున్నాయి. అయినప్పటికీ ఇది నిర్లిప్తంగా వుండే సమయం కాదు. రాజకీయాలకు, ప్రముఖ వ్యాపారాల మెరుపులు తగ్గిపోవడానికి మధ్య, వచ్చే 12 నెలలు కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అనంతమైన రిస్కులు సిద్ధంగా వున్నాయి. మీరు ఈ ఏడాది ప్రారంభించేలోగా వాటిలో అతి ముఖ్యమైన మార్కెట్ థీం లు ఇవిగో

1. కూలింగ్ క్రెడిట్ రాలీ.

1. కూలింగ్ క్రెడిట్ రాలీ.

జంక్ బా౦డ్లు పుట్టి ముంచుతాయన్న భయాలు ఊహాజనితమని తేలినా, ఎక్కువ రాబడి ఇచ్చే, పెట్టుబడి శ్రేణి బాండ్లు మదుపర్లకు ఈ ఏడాది రాబడి ఇచ్చినప్పటికీ 2018 లో బయటకు వచ్చే చాలా రిస్కులు సిద్ధంగా వున్నాయి. ఫెడరల్ రిజర్వ్ తన బాలన్స్ షీట్ ను శుభ్రం చేసుకుంటుండగా - యూరోపియన్ కేంద్ర బ్యాంకు తన కొనుగోళ్ళు తగ్గిస్తుండగా - అంచనాలు మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే చెప్తున్నాయి. డిసెంబర్ లో ప్రచురించిన ఒక సర్వే కోసం బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ ఒక పోల్ నిర్వహించగా అందులో పాల్గొన్న మదుపర్లు ఆస్తి శ్రేణికి ఒక బబుల్ వల్ల ప్రమాదం వుందని, దాని వెనుకే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రాబడుల భయాలు వున్నాయని పేర్కొన్నారు. నిధుల వెల్లువ కూడా అలాంటి భయాన్నే ప్రతిబింబిస్తోంది. బ్లూమ్ బెర్గ్ సమాచారం ప్రకారం కంపెనీల పరపతిని పర్యవేక్షించే ఎక్స్ చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి మదుపర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.

2. వయసు మళ్ళుతున్న వ్యాపార చక్రం

2. వయసు మళ్ళుతున్న వ్యాపార చక్రం

నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అండ్ బ్లూమ్ బెర్గ్ ఇంటలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం అమెరికా ఆర్ధిక వ్యవస్థ 2018 మొదటి త్రైమాసికంలో ఇలాగే కొనసాగితే, ఇది ఆధునిక చరిత్రలో రెండో సుదీర్ఘమైన విస్తరణ కాలాన్ని సూచిస్తుంది. దీనివల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు అన్నీ ఊపందుకుని మార్కెట్లన్నిటా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విశ్లేషకుల అంచనాలు తల్లక్రిందులు చేస్తూ - సిటీ గ్రూప్ రూపొందించిన ప్రధాన ఆర్ధిక వ్యవస్థల ఎకనామిక్ సర్ప్రైజ్ ఇండెక్స్ 2010 నుంచి పోలిస్తే అత్యధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఏడాదిలో మదుపర్లు ఆర్ధిక ఉష్ణోగ్రతలు, అమెరికన్ కంపెనీల స్థిరపడ్డ బాలన్స్ షీట్ ల రిస్కుల మధ్య ఈ వ్యాపార చక్రం ఎంతకాలం కొనసాగుతుందో మదింపు చేయగలగాలి.

3. ఎన్నికలను మర్చిపోకండి

3. ఎన్నికలను మర్చిపోకండి

పెరుగుతున్న ప్రపంచ వృద్ది రేటు, ద్రవ్య నియంత్రణపై ఫెడరల్ రిజర్వ్ వేచి చూసే ధోరణి, బలహీనపడుతున్న డాలర్ ఇవన్నీ వర్ధమాన మార్కెట్ల కరెన్సీలు, షేర్లు 2017 లో తమ అత్యధిక స్థాయికి వెళ్ళడానికి దోహదం చేశాయి. అయితే వాల్ స్ట్రీట్ అంచనా వేస్తున్నట్టు ప్రపంచంలో అన్నిటికన్నా అభివృద్ది చెందిన ఆర్ధిక వ్యవస్థలో దశాబ్ద కాలంలో లేనంతగా ద్రవ్య నియంత్రణ గట్టిగా చేస్తే ఆ సమతౌల్యం దెబ్బతినడానికి ఎంతో సేపు పట్టదు. బ్లూమ్ బెర్గ్ బార్క్లేస్ తయారుచేసే వర్ధమాన దేశాల స్థానిక బాండ్ ఇండెక్స్ లో సగం కన్నా ఎక్కువ ప్రాముఖ్యం వున్న ఆయా దేశాల ఎన్నికలను కూడా మదుపర్లు బేరీజు వేసుకుంటూ వుండాలి. రష్యా లాంటి దేశాల్లో వోట్లను ముందుగానే ఊహించవచ్చు కానీ బ్రెజిల్, మెక్సికో లాంటి ఇతర భారీ దేశాల్లో కఠినమైన పోటీలు వుండే అవకాశం వుంది.

4. యూరో రాలీ కొనసాగుతుంది.

4. యూరో రాలీ కొనసాగుతుంది.

గడచిన 14 ఏళ్ళలో డాలర్ కన్నా అత్యుత్తమ రాబడి ఇస్తూ యూరో దూసుకుపోతుండగా - ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగే ఈ కరెన్సీల జోడీ ధరలపై అంచనాలు వేసే ఆప్షన్స్ మార్కెట్ లు మాత్రం ఈ రాలీ 2018 లో కూడా కొనసాగుతుందని తెలియచేస్తున్నాయి. ఇది ఈ ఏడాదిలో 1.229 డాలర్లకు పెరిగే అవకాశం రెండింట మూడొంతులు వుండగా ఇది 1.256 డాలర్లకు తగ్గే అవకాశాలు కూడా సమంగా వున్నాయి.

5. రాజకీయ అద్భుతాలు

5. రాజకీయ అద్భుతాలు

అమెరికా స్టాక్ మార్కెట్ లోని ఇటీవలి పోకడలను ప్రోత్సహిస్తున్న టాక్స్ బిల్ చివరి అంకానికి చేరుకుంటోంది. ఈ ఏడాది చివరిలోగా దాన్ని ఆమోదించాలని రాజకీయనాయకులు హడావిడి పడుతుండగా, ఖర్చుకు సంబంధించిన బిల్లులు, బడ్జెట్ డీల్స్, రుణ పరిమితులపై పట్టుదలలు కూడా నేపథ్యంలో తారాడుతున్నాయి. టాక్స్ బిల్ ఆమోదించక పొతే S&P 500 - 2450 కంటే క్రింది పడిపోయే అవకాశం వుందని గోల్డ్ మాన్ సాక్స్ అంచనాలు తెలియచేస్తుండగా - బై బాక్స్, కాష్ రి పాట్రిఏషన్ బుల్ వర్గానికి ఆయుధాలు అందిస్తున్నాయి. ఇలా వుండగా - ఇటలీ ఎన్నికలను, బ్రేక్జిట్ ను, కొరియన్ ద్వీపకల్పాల్లో నెలకొన్న ఉద్రిక్తలను కూడా మదుపర్లు తమ రిస్కుల జాబితాకు చేర్చుకోవచ్చు.

6. ‘నార్మల్' స్వాప్స్

6. ‘నార్మల్' స్వాప్స్

సంక్షోభానంతర నియంత్రణ వల్ల ఏర్పడిన వింత వక్రీకరణలకు కూడా తెర పడే అవకాశం ఉంది. కంపెనీలు చలన వడ్డీ రేట్ చెల్లింపులకు బదులుగా స్థిర వడ్డీ చెల్లింపులను మార్పిడి చేసుకునే స్వాప్ రేట్లు - 2014 తరువాత మొదటి సారిగా అన్ని మెచ్యూరిటీ శ్రేణుల్లోను ట్రెజరీ రాబడుల కంటే పెరిగే అవకాశం కూడా వుంది. రిపబ్లికన్లు సంక్షోభానంతర నియంత్రణ భారాలను వెనక్కు తీసుకునే అవకాశం ఉందనీ, ఇందువల్ల ట్రెజరీ లను హోల్డ్ చేయడం వల్ల రాబడులు స్వాప్ రేట్ ల కన్నా తగ్గుతాయని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. తాకట్టు ఆధారంగాను, ఆటో లోన్ ఆస్తుల నుంచి అరువు తెచ్చుకున్న నిధులతో కొనే వివిధ డెట్ పెట్టుబడులకు స్వాప్ రేట్లు కొలమానంగా వుంటాయి కనుక ఈ మార్పు కూడా ముఖ్యమైనదే.

7. అస్థిరత పునర్దర్శనం

7. అస్థిరత పునర్దర్శనం

2017 లో అస్థిరత దాదాపు శూన్యంగా ఉండడంతో మదుపర్లు నిర్లక్ష్యం వహించారు. 2018 లో ధరల వ్యత్యాసాలు చెలరేగి వారిని మత్తు నుంచి బయటకు తేవచ్చు. అర్టేమిస్ కాపిటల్ కు చెందిన క్రిస్టోఫర్ కోల్ అక్టోబర్ లో వేసిన అంచనాల ప్రకారం వ్యూహాల్లో వున్న రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రాబడుల కోసం మార్కెట్ స్థిరత్వాన్ని నమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో చివరికి అస్థిరత తిరిగి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్, బాండ్ మార్కెట్లలో భారీ నష్టాల ప్రమాదాన్ని తీసుకు వస్తుంది.

8. ఫెడ్ లో కొత్త ముఖాలు

8. ఫెడ్ లో కొత్త ముఖాలు

వచ్చే ఏడాది అమెరికా సెంట్రల్ బ్యాంకు లో జెరోం పొవెల్ మాత్రమె కొత్త ముఖం కాదు. ఫిబ్రవరిలో జానెట్ ఎల్లెన్ పదవీ కాలం అయిపోయాక, ఏడాది మధ్యలో న్యూ యార్క్ ఫెడ్ అధిపతి పదవీ విరమణ చేశాక - పెద్ద వాళ్ళు ముగ్గురూ (అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇంకా న్యూ యార్క్ ఫెడ్ అధ్యక్షుడు) పూర్తీగా కొత్త వాళ్ళే వుంటారు. వాళ్ళు స్తబ్ధుగా ఉన్న వినియోగ ధరల నేఅప్త్యంలో కఠినమైన లేబర్ మార్కెట్ ను, ప్రధానమైన ఆర్ధిక సమాచారాన్ని విశ్లేషించాల్సి వుంటుంది. ద్రవ్యోల్బణం తిరిగి పెరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు? అది బాగా బలహీనంగా వుంటే ఏం చేస్తారు?

9. రాబడి రేఖ

9. రాబడి రేఖ

దీర్ఘ కాల, స్వల్ప కాల ట్రెజరీ ల మధ్య తగ్గిపోతున్న తేడా వాల్ స్ట్రీట్ ద్రుశిత్ని ఆకర్షిస్తూనే వుంటుంది. పూర్తిగా చదునుగా వున్న లేదా తిరగబడిన రేఖ బాండ్ వ్యాపారాన్ని పాడు చేసి, ఫెడ్ నియంత్రణ మార్గాన్ని సవాల్ చేయడమే కాక వ్యాపార చక్రం పతనం అయ్యే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. డిసెంబర్ మొదట్లో బ్లూమ్ బెర్గ్ సర్వే చేసిన పదకొండు మంది విశ్లేషకుల్లో ఆరుగురు ట్రెజరీ రాబడి రేఖ వచ్చే 24 నెలల్లో కనీసం కొద్ది కాలమైనా తిరగబడుతుందని చెప్పగా - వారిలో నలుగురు ఇది 2018లోనే జరుగుతుందని తేల్చి చెప్పారు.

10. చైనా ను మరచిపోకండి.

10. చైనా ను మరచిపోకండి.

స్థిర కొలమానం కన్నా వేరే దారిలో వెళ్ళే ధరల సరళిని లెక్కించే స్టాండర్డ్ డీవియేషన్ అంచనా ప్రకారం పెరుగుతున్న అమెరికా షేర్ల ధరలు, పడిపోతున్న చైనీస్ ప్రభుత్వ బాండ్ల ధరలు 2017 లో చెప్పుకోదగ్గ రెండు విశేషాలు. S&P 500 ను విరామం లేకుండా విశ్లేషిస్తుండగా ప్రపంచంలోని వర్ధమాన డెట్ మార్కెట్ లలో అతిపెద్ద మార్కెట్ అంచనా ఇప్పటికీ తక్కువగానే అర్ధం అయి౦ది. స్టాండర్డ్ ఛార్టర్డ్ పీ ఎల్ సీ లో చైనా స్థూల వ్యూహం విభాగం అధిపతి బెకీ లియు అంచనా ప్రకారం సెంట్రల్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని నియంత్రించడం, ప్రభుత్వం ఆర్ధిక నిబంధనలను కఠినతరం చేయడం వల్ల 2018 ప్రథమార్ధంలో చైనీస్ బాండ్లు ఒత్తిడికి గురవుతాయి. రాబడుల్లో పెరుగుదల ఏడాది ద్వితీయార్ధంలో దేశ విదేశీ మడుపర్లను ఆకర్షిస్తుందని ఆమె అంటారు.

11. క్రిప్టో క్రేజ్

11. క్రిప్టో క్రేజ్

బిట్ కాయిన్ పరావలయ పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుంది? ఇది మీరు ఎవరిని అడిగారు అనే దాని మీద ఆధారపడి వుంటుంది. మొదటి త్రైమాసికం చివరికి ఇది 40వేల డాలర్లకు చేరుకుంటుందని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైకేల్ నోవోగ్రాత్జ్ భావిస్తున్నారు. ఇటీవలే ఏర్పాటు చేసిన బిట్ కాయిన్ ఫ్యూచర్లు ఈ క్రిప్టో ద్రవ్యం యాజమాన్యాన్ని పెంచుతుందని ఎందుకంటే ETF లు, మరింత లిక్విడ్ ఆస్తులకు డెరివేటివ్స్ ఏర్పాటు తొలి మెట్టని బుల్స్ భావిస్తున్నారు. అయితే సంశాయవాదులు మాత్రం నియంత్రణాధికారులు త్వరలో దీన్ని నిలిపివేస్తారని నమ్ముతున్నారు. లండన్ లోని ADM ఇన్వెస్టర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ లో ప్రపంచ వ్యూహకర్త మార్క్ ఓస్ట్వాల్డ్ మాత్రం అధికారులు వీటికి మనీ లాండరింగ్ చట్టాలను అమలు చేస్తే క్రిప్టో కరెన్సీల మార్గం నిరోధిస్తారని అంటున్నారు.

ఇవ‌న్నీ అంశాలు మార్కెట్‌ను- కుదుట పరచేవి, కలవర పెట్టేవీ రెండూను.

Read more about: stock market share market
English summary

2018లో మ‌నం తెలుసుకోవాల్సిన అతి ముఖ్య‌మైన మార్కెట్ విశేషాలు | Important stock market themes in 2018 we have to observe

11 most important market themes you need to know about in 2018stock market themes
Story first published: Monday, January 15, 2018, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X