బంగారం కొనుగోళ్లకు ఇదే సమయమా...
స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం రేట్లు బాగా తగ్గాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు బంగారం ధరలు తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 వద్ద చలామణీ అవుతోంది.
స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం రేట్లు బాగా తగ్గాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు బంగారం ధరలు తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 వద్ద చలామణీ అవుతోంది. మొత్తానికి బుధవారానికి వస్తే వారం రోజుల్లో బంగారం రూ.1000 వరకూ తగ్గినట్లైంది. అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లో ధరలు తగ్గడం కూడా పసిడి రేట్లు క్షీణించడానికి మరో కారణంగా కనిపిస్తోంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే ఔన్సుకు 0.54% తగ్గుదలతో 1241.40 డాలర్ల వద్ద ఉంది. వెండి సైతం ఔన్సుకు 0.95% క్షీణతతో 15.67 డాలర్ల వద్ద కదలాడుతోంది.
భారతదేశ రాజధాని ఢిల్లీలో 99.9% స్వచ్చత గల బంగారం రూ.180 తగ్గి రూ.29,400గా పలుకుతుండగా, 99.5% స్వచ్చత గల బంగారం రూ.29,250గా ఉంది. ఆగస్టు 5 తర్వాత బంగారం ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బంగారం దారిలో వెండి సైతం తగ్గుదలను చూపిస్తోంది. వెండి కేజీ రూ.25 తగ్గి రూ.37,775 వద్ద కొనుగోళ్ల డిమాండ్ అందుకుంటోంది.
వారం వారీ డెలివరీకి సంబంధించిన వెండి మాత్రం రూ.215 తగ్గి కేజీకి రూ.36,900గా పలుకుతోంది. వెండి నాణేలు 100కి రూ.1000 తగ్గుదలతో రూ.70,000 కొనుగోలు ధర వద్ద, రూ.71 వేల అమ్మకం ధర వద్ద ఉన్నాయి. బంగారం ధర మారేందుకు కారణమయ్యే 10 అంశాలు


Click it and Unblock the Notifications