For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

ప్రపంచవ్యాప్తంగా బంగారపు ధరలను - 'డబ్బు ప్రామాణిక' ప్రమాణంగా ఉపయోగిస్తారు. బంగారం అనేది డబ్బు మారకపు విలువగా ఉంటూ, తరచుగా యూఎస్(U.S) డాలర్లకు మరియు బంగారపు మార్కెట్ పరిస్థితులలో హెచ్చుతగ్గులకు గురవుతు

|

ప్రపంచవ్యాప్తంగా బంగారపు ధరలను - 'డబ్బు ప్రామాణిక' ప్రమాణంగా ఉపయోగిస్తారు. బంగారం అనేది డబ్బు మారకపు విలువగా ఉంటూ, తరచుగా యూఎస్(U.S) డాలర్లకు మరియు బంగారపు మార్కెట్ పరిస్థితులలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరను ఏఏ విషయాలు ప్రభావితం చేస్తున్నాయి ? బంగారు వ్యాపారంలో ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని కలిగి ఉన్నారో, బంగారపు ధర ఒడిదుడుకులను గ‌మ‌నిచాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ‌మైన 10 అంశాలు గణనీయమైన ప్రభావాలను ఎలా చూపిస్తాయో దిగువ పేర్కొనబడిన విధంగా అర్థం చేసుకోవచ్చు.

1. ప్రపంచ సంక్షోభం :

1. ప్రపంచ సంక్షోభం :

ప్రభుత్వాలు లేదా ఆర్థిక విఫణుల్లో ప్రజలకు విశ్వాసం లేనప్పుడు బంగారు ధరలు పెరుగుతుండటం వలన, అది తరచూ 'వస్తు సంక్షోభమని' పిలువబడుతుంది. ప్రపంచ సంఘటనలు తరచూ బంగారం ధరపై ప్రభావాన్ని చూపుతాయి ఎందుకంటే బంగారం అనేది, ఆర్థిక (లేదా) ప్రాంతీయ రాజకీయ సువిశాలతకు భద్రతకు మూలంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకి : రష్యన్ల ప్రజలను యుక్రేన్ (ukraine) వైపుకు తరలించబడిన తర్వాత, ప్రాంతీయ అస్థిరత్వానికి తెలీకుండానే అక్కడ బంగారపు ధరలు వెనక్కి దిగి వచ్చాయి. ఇతర సందర్భాల్లో, సైనిక చర్య కారణంగా ప్రాంతీయ రాజకీయ పరిస్థితులతో అభయమిచ్చేందుకు పెరుగుతుంది. ఉదాహరణకు : మొదటి గల్ఫ్ యుద్ధం ప్రారంభంలో బంగారం ధర అనుకూలంగా ఉండేది, ఆ యుద్ధం అంతిమదశలో రాజకీయ గందరగోళంతో బంగారం మరింత సురక్షితమైనదిగా(స్వర్గధామంగా) ఉన్నది.

2. ద్రవ్యోల్బణం :

2. ద్రవ్యోల్బణం :

'ద్రవ్యోల్బణం' మరియు 'డబ్బు విలువ తగ్గింపుకు' వ్యతిరేకంగా బంగారాన్ని నిలుపు చేయటం ఒక కంచెగా భావించబడేదిగా కారణం కావచ్చు. కరెన్సీ విలువలు హెచ్చుతగ్గులకు గురవుతాయి, కానీ బంగారు విలువలు బంగారు ఔన్సు కొనగలిగినట్లయితే, దీర్ఘకాలంలో మరింత స్థిరంగా ఉంటాయి. బంగారం - ప్రాంతీయ రాజకీయాల్లో వెలుపల స్థిరమైన విలువ కలిగి ఉన్న కారణంగా-ప్రపంచ వ్యాప్తంగా బంగారం విలువ అనేది తక్కువ ప్రమాదకారిగా ఉంటూ, ఖరీదైన కరెన్సీల విలువల మధ్య ఘనమైన పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షణీయంగా ఉంది. పెట్టుబడిదారులు వారి నోట్ల రూపంలో ఉన్న 'కాగితపు విలువను' (paper money) తగ్గిస్తారని వారు నమ్మితే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తారు.

3. యు.ఎస్. (US) డాలర్ యొక్క విలువ. :

3. యు.ఎస్. (US) డాలర్ యొక్క విలువ. :

యు.ఎస్. (US) డాలర్ ఇప్పటికీ ప్రపంచ ఆధిపత్య కరెన్సీ రిజర్వ్ గా ఉంటూ, ఇది అంతర్జాతీయ వర్తకం కోసం వేర్వేరు దేశాలని కలిగి ఉన్న ప్రధాన కరెన్సీలలో ఒకటిగా ఉంది. బంగారం ధర మరియు డాలర్ ధరకు స్పష్టమైన విలోమ(వ్యతిరేక) సంబంధాన్ని కలిగి ఉంటుంది; డాలర్ బలంగా ఉన్నప్పుడు, బంగారం బలహీనంగా ఉంటుంది, అదే డాల‌రు బ‌ల‌హీనంగా ఉన్న సంద‌ర్భంలో బంగారం డిమాండ్ అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, సెప్టెంబరు 1 - సెప్టెంబర్ 10, 2014 మధ్యకాలంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 2 పాయింట్లు పెరిగింది, ఇది బంగారం అమ్మకం కోసం మార్కెట్ను అనుకూలంగా చేసింది. మరొక వైపు, బంగారం కొనుగోలుకు - ప్రజలు ఒక డాలర్ ను ఒక బలమైన కొనుగోలు అవకాశంగా చూడవచ్చు మరియు అది కొన్ని ధరల మద్దతుగా కూడా ఉంటుంది.

4. సెంట్రల్ బ్యాంక్(కేంద్ర బ్యాంకు) అస్థిరత :

4. సెంట్రల్ బ్యాంక్(కేంద్ర బ్యాంకు) అస్థిరత :

U.S. లో ఫెడరల్ రిజర్వు అనేది ముఖ్యమైన కేంద్ర బ్యాంకు. చాలా దేశాలలో కేంద్ర బ్యాంకులు ఉన్నాయి, అలాగే ఇతర ఆధిపత్యాలలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, స్విస్ నేషనల్ బ్యాంక్లు ఉన్నాయి. బ్యాంక్ వైఫల్యాలు, ఆర్థిక విధానాల వైఫల్యాల కారణంగా బంగారాన్ని కొనుగోలు చెయ్యడం సురక్షితంగా, పెట్టుబడి పెట్టడానికి స్వర్గధామంగా కనిపిస్తుంది. మరోసారి, ప్రస్తుత నోట్ల రూపంలో ఉన్న 'కాగితపు విలువ' (డబ్బు) వ్యవస్థ అస్థిరత్వం గా ఉన్నప్పుడు ప్రజలు బంగారం వైపుకు మొగ్గు చూపుతారు. కొంతమంది పెట్టుబడిదారులు వారి సంపదకు భౌతిక మరియు ప్రత్యక్ష భద్రతకు కోసం రక్షణగా సెంట్రల్ బ్యాంకులు లోటుని కలిగి ఉన్నప్పుడు బంగారాన్ని అందిపుచ్చుకోవడానికి (కలిగి ఉండటాన్ని) ఇష్టపడతారు. క్రమంగా, డిమాండ్ పెరగటం వల్ల బంగారం విలువను మరింతగా పెంచుతుంది.

5. వడ్డీ రేట్లు

5. వడ్డీ రేట్లు

ట్రెజరీ బాండ్లు లేదా పొదుపు ఖాతాలలో ఉన్న బంగారానికి ఎలాంటి వడ్డీని చెల్లించదు, కాని ప్రస్తుత బంగారం ధరలు వడ్డీ రేట్లలో పెరుగుదలను, తగ్గుదలను తరచుగా ప్రతిబింబిస్తాయి. అలా వడ్డీరేట్లు పెరగడంతో, ఇతర పెట్టుబడుల అవకాశాల కోసం నిధులను స్వేచ్ఛగా బంగారాన్ని అమ్మడం మూలంగా బంగారం ధరలు తగ్గుతాయి. అలాగే వడ్డీ రేట్లు తగ్గడంతో, బంగారం ధర మళ్లీ పెరగవచ్చు ఎందుకంటే ఇతర పెట్టుబడులతో పోల్చితే బంగారాన్ని తక్కువ పెట్టుబడులతో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి. తక్కువ వడ్డీ రేట్లు, బంగారాన్ని ఎక్కువ ఆకర్షించడానికి సమానంగా ఉంటాయి.

ఆధార్ కార్డులో త‌ప్పులుంటే స‌రిదిద్దుకోవ‌డం ఎలా?ఆధార్ కార్డులో త‌ప్పులుంటే స‌రిదిద్దుకోవ‌డం ఎలా?

6. పరిమాణ సడలింపు : (Quantitative Easing)

6. పరిమాణ సడలింపు : (Quantitative Easing)

పరిమాణ సడలింపు లేదా QE, ద్రవ్య సరఫరా పెంచడానికి సెక్యూరిటీలను కొనటం కేంద్ర బ్యాంకు యొక్క వ్యూహంగా సూచిస్తుంది. ఆర్థిక సంస్థలను, కేంద్ర బ్యాంకు వంటి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులలో ద్రవ్యంతో నింపడం ద్వారా మరింత డబ్బుని రుణాన్ని అందించేందుకు మరియు డబ్బు సరఫరాను పెంచడానికి ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ వ్యూహంలో పనిచేసే ఇతర కేంద్ర బ్యాంకులుగా - బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లు ఉన్నాయి.

ఎక్కువ మొత్తంలో ద్రవ్యం(డబ్బు) సరఫరా ఉండటంవల్ల వడ్డీ రేట్లు బాగా తగ్గుతున్నాయి, ధ‌ర త‌క్కువ ఉండి ప్రోత్సాహ‌కరంగా ఉంటూ వలన పెట్టుబడిదారులకు బంగారం కొనుగోలు చెయ్యడానికి ఇలాంటి సంద‌ర్భాల్లో వీలు క‌లుగుతుంది. ఇది మరింత ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ వ్యూహం ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది, ఇది బంగారం ధర పెరుగుదలకు మరొక సంకేతం. 2014 అక్టోబర్ 29 న QE ను నిలిపివేసినట్లు ఫెడ్ (Fed) వాస్తవానికి ప్రకటించింది, వడ్డీ రేట్లు పెరిగి - ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల బంగారం ధరలపై ఒత్తిడిని తీసుకువచ్చి వచ్చింది. ఇంకా ఇది తక్కువ బంగారం ధరల ప్రయోజనాన్ని పొందడానికి సమర్థవంతమైన సమయం కావచ్చు.

7. ప్రభుత్వ రిజర్వ్స్

7. ప్రభుత్వ రిజర్వ్స్

సెంట్రల్ బ్యాంకుల వంటి U.S. ఫెడరల్ రిజర్వు, బంగారు మరియు కాగితపు కరెన్సీని పట్టుకొని తన రిజర్వ్లో ఉంచుతోంది. వాస్తవానికి, యునైటెడ్ స్టేట్స్ మరియు అనేక ఐరోపా దేశాలు బంగారు నిల్వలను చాలా ఎక్కువగా కలిగివున్నాయి, ఇటీవల బంగారం కొనుగోలుతో ఈ నిల్వలు మరింత ఎక్కువగా అయ్యాయి .

బంగారం కలిగి ఉన్న ఇతర దేశాలలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, గ్రీస్, మరియు పోర్చుగల్ ఉన్నాయి. ఈ సెంట్రల్ బ్యాంకుల వారు బంగారాన్ని అమ్మడం కన్నా ఇంకా ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించినప్పుడు, అది బంగారు ధరలను ఇంకా పెంచుతుంది. ఎందుకంటే కరెన్సీ పెరుగుదల ఎక్కువగా ఉండి, అందుబాటులో ఉన్న బంగారం సరఫరా అనేది చాలా ఉన్నందు వల్ల.

8. బంగారు ఆభరణాలు మరియు పరిశ్రమలు :

8. బంగారు ఆభరణాలు మరియు పరిశ్రమలు :

బంగారం అనేది రిస్కుతో కూడుకున్న వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టడం భద్రతపరంగా సరైన నిర్ణయం కాదు. ప్రపంచంలో సగానికిపైగా బంగారాన్ని ఆభరణాల రూపంలో చైనా భారతదేశం మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారీ డిమాండ్ కలిగిన దేశాలుగా ఉన్నాయి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, బంగారం ఒకరకమైన ద్రవ్యముగా, ఐశ్వర్యానికి ప్రదర్శనగా, ముఖ్యమైన బహుమతిగా మరియు చెడు కాలం నుండి కాపాడే ఒక హెడ్జ్ (కంచెగా) పరిగణించబడుతుంది. ఈ డిమాండ్‌యే భారతదేశంలో బంగారం ధరను పెంచుతుంది. బంగారం ఒక విలువైన లోహముగా(మెటల్) చైనాలో ఐశ్వర్యతకు చిహ్నంగా ఉంది, మరియు అభివృద్ధి చెందుతున్న 'చైనా ఆర్థిక వ్యవస్థ' అంటే చైనా ప్రజలకు బంగారం కోసం ఎక్కవ మంది డబ్బును ఖర్చు చేయ్యడం.

నగలతో రూపంతో పాటు, పారిశ్రామిక అనువర్తనాలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం మరొక 12 శాతం బంగారానికి డిమాండ్ ఉంది.

తయారీదారులు, కంప్యూటర్ల నుండి GPS వ్యవస్థల వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలలో, మరియు హృదయ స్పిన్టుల వంటి వైద్య పరికరాలలోనూ బంగారాన్ని ఉపయోగిస్తారు.

9. గోల్డ్ ప్రొడక్షన్ :

9. గోల్డ్ ప్రొడక్షన్ :

ప్రపంచ మొత్తం మీద 165,000 మెట్రిక్ టన్నుల బంగారం అవసరం కాబడిన అంచనాలతో పోలిస్తే, ప్రతి సంవత్సరం 2,500 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఊహించినట్లైతే, ప్రపంచంలోని మొత్తం బంగారాన్ని మూడున్నర పరిమాణం గల ఒలింపిక్ ఈత కొలనులను పూరించవచ్చు. కానీ ఈ ఏడాది ఉత్పత్తి మాత్రం సుమారుగా ఒక క్యూబ్ లోని 16 చదరపు అడుగుల పొడవును మాత్రమే పూరించగలదు.

కొత్త ఉత్పత్తి చేసిన బంగారాన్ని, మొత్తం సరఫరాతో పోల్చి చూసినట్లయితే, ఉత్పత్తి ఖర్చులు ప్రపంచంలోని మొత్తం బంగారాన్ని ప్రభావితం చేయగలవు. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో, మైన్ సొంత‌దార్లు తమ లాభాలను కాపాడుకోవడానికి మరింత ఎక్కువ డబ్బుకు బంగారాన్ని విక్రయిస్తారు. అలాగే నిన్నటి లేదా, క్రిందటి సంవత్సరం / వేలాది సంవత్సరాల క్రితం తవ్విన బంగారం నుండి నాణేలను ముద్రించినట్లయితే అలాంటి నాణేలను విక్రయించడానికి వచ్చినప్పుడు అధిక ధరలు కూడా ప్రతిబింబిస్తాయి.

10. సరఫరా వర్సెస్ డిమాండ్ :

10. సరఫరా వర్సెస్ డిమాండ్ :

కనీసం 5,000 సంవత్సరాల నుండి బంగారం గనులు మరియు బంగారు వస్తువులను మనం చూస్తున్నట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటి ధరలు చాలా తరచుగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ ఈ లోహం అంతే విలువైనదిగా ఉంటూ వ‌స్తున్న‌ది. హైద‌రాబాద్ న‌గ‌రంలో బంగారం ధ‌ర‌

మీరు బంగారం కొనుక్కుంటే, దాని ఉత్పత్తి ఖర్చులు, ద్రవ్య సరఫరా, ఆర్థిక సౌలభ్యం లేదా అసౌకర్యలతో లేదా ప్రాంతీయ రాజకీయాల్లో స్థిరత్వం, నగల మరియు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన డిమాండ్, మరియు సెంట్రల్ బ్యాంకులచే తీసుకున్న చర్యల ద్వారా ధర ప్రభావితం అవుతుందని అర్థం చేసుకోవాలి.

మరో మాటలో చెప్పాలంటే, బంగారం అనేది ఒక పరిమిత వనరు మరియు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులకు బంగారం మరింత ఆకర్షణీయమైనప్పుడు, బంగారం డిమాండ్ పెరగడంతో, బంగారం ధర పెరగడం జరుగుతుంది. కానీ బంగారం ప్రస్తుత విలువ - దీర్ఘకాలంలో చాలా స్థిరంగా ఉంటుంది, మరియు ధర కేవలం తాత్కాలిక అనిశ్చితి వల్ల (లేదా) సరళమైన 'ద్రవ్య విలువల' హెచ్చుతగ్గులను బట్టి ప్రతిబింబిస్తుంది.

దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Read more about: బంగారం gold
English summary

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు | 10 major factors affecting gold price

Gold is used as a standard of value for currencies all over the world. The price of gold gets stated as a currency value, often in U.S. dollars, and the price of gold can fluctuate with market conditions. What influences the price of gold in the current marketplace? Below are ten significant influences on gold price fluctuations that any investor with an interest in gold trading should understand.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X