For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌జ‌ల వెనుక‌డుగుతో ఇబ్బందులో స్థిరాస్తి రంగం లావాదేవీలు

ఎన్నో ఆశలతో పెద్దపెద్ద ప్రాజెక్టులకు ప్రారంభించిన సంస్థలు ఇప్పుడు అవి అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నాయి. దీని గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం.

|

దేశంలోని స్థిరాస్తి సంస్థలు క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి గ‌త ప‌దేళ్ల‌లో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్దత, బ్యాంకులు ఆచితూచి రుణాలను అందిస్తుండడం తదితర ప్రతికూల అంశాలతో ప్రజలు ధైర్యం చేసి పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో స్థిరాస్తి రంగంలో సప్లయి పెరిగినంత వేగంగా డిమాండ్‌ పెరగక పోగా.. అమ్మకాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. దీంతో ఎన్నో ఆశలతో పెద్దపెద్ద ప్రాజెక్టులకు ప్రారంభించిన సంస్థలు ఇప్పుడు అవి అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నాయి. దీని గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం.

 1. 1.16 లక్షల కోట్ల విలువైన గృహాలకు గిరాకీ లేదు..

1. 1.16 లక్షల కోట్ల విలువైన గృహాలకు గిరాకీ లేదు..

దేశ వ్యాప్తంగా గృహాల కొనుగోళ్లు తగ్గడంతో గత మార్చి నాటికి దేశంలోని ప్రముఖ స్థిరాస్తి సంస్థల వద్ద దాదాపు రూ.99,000 కోట్ల విలువైన నిర్మాణాలు కొనుగోలుదారులు లేక నిరుపయోగంగా పడిఉన్నాయి. అంటే స్థిరాస్తి రంగ సంస్థలు ఈ మేరకు పెట్టుబడులు పెట్టి రిటర్న్స్‌ నిలిచిపోయి ఉన్నాయన్న మాట. దాదాపు అంతే మొత్తంలో అసంఘటిత రంగంలోని స్థిరాస్తి సంస్థల వద్ద నిర్మాణాలు కూడా కలుపు కుంటే ఇది దాదారు రూ. 1.50 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇవి కొనేవారు లేక వెలవెలబోతున్నట్టుగా ఒక ఆంగ్ల పత్రిక అధ్యయనంలో తేలింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, బీఎస్‌ఈ 500లో నమోదైన దాదాపు 23 ప్రముఖ స్థిరాస్తి సంస్థల వార్షిక ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి చూస్తే స్థిరాస్తి రంగం ఎంత సంక్షోభ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందో తెలుస్తోంది.

2. అమ్ముడుపోని చాలా ఆస్తులు

2. అమ్ముడుపోని చాలా ఆస్తులు

దీనికి తోడు పాక్షిక కొనుగోళ్లు సంస్థలకు మరింత భారంగా మారాయి. అడ్వాన్సులు ఇచ్చి మిగతా సొమ్మును కట్టని పాక్షిక కొనుగోళ్లు జరిపిన వారి నుంచికూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రముఖ స్థిరాస్తి సంస్థలకు వీరి నుంచి రావాల్సిన బకాయిలు విలువ గణించి చూస్తే దాదాపు రూ.1.16 లక్షల కోట్లకు పైచిలుకుగానే ఉంటుందని విశ్లేషణ చేబు తున్నాయి. అమ్ముడవకుండా స్థిరాస్తి సంస్థల వద్ద ఉండిపోయిన గృహాల విలువను బట్టి విశ్లేషించి చూస్తే ఇది 26 నెలల అమ్మకాలకు సమానం. ఇది ఏడేండ్ల గరిష్టం కావడం విశేషం. స్థిరాస్తి రంగంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న సంస్థలో ప్రముఖంగా డీఎల్‌ఎఫ్‌, ఇండియన్‌బుల్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, శోభ డెవలపర్స్‌, ఒబేరారు రియాల్టీ డెవలపర్స్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, ఫినిక్స్‌ మిల్స్‌, హెచ్‌డీఐఎల్‌, పెనుస్యులా ల్యాండ్‌, ఎన్‌బీసీసీ, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్టీ పాటిల్‌ డెవలపర్స్‌ తదితర సంస్థలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మకాలు జరిగిన తీరును బట్టి చూస్తే ఆయా ప్రముఖ సంస్థల వద్ద నిర్మాణంలో ఉండి కొనేవాళ్లు లేక మిగిలిపోయిన గృహాలు, చేతిలో ఉన్న ప్రాజెక్టుల అమ్మకాలు పూర్తిగా అమ్ముడయ్యేందుకు దాదాపు నాలుగేండ్ల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ స్థిరాస్తి సంస్థ అధినేత ఒకరు వాపోతున్నారు.

 3. ఎక్కువ రేటు పెట్టి కొనేందుకు వెనుకంజ‌

3. ఎక్కువ రేటు పెట్టి కొనేందుకు వెనుకంజ‌

ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోందంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంతో స్థిరాస్తి సంస్థలు భవిష్యత్తుపై బంగారపు ఆశలతో కోట్లకు కోట్లు బ్యాంకుల నుంచి ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చి స్థిరాస్తి ప్రాజెక్టులను మొదలుపెట్టాయి. ట్రంప్‌ దెబ్బకు ఐటీ రంగం లోను, జియో దెబ్బకు టెలికాం రంగంలోను, ఆర్థిక రంగంలో మందగమనం, బ్యాంకుల ఏకీకరణ, ఎన్‌పీఏల వల్ల బ్యాంకింగ్‌ రంగాలల్లో ఉద్యోగాలు కొండెక్కుతుండడం ప్రజలు భవిష్య త్తుపై భయంతో ఎక్కువగా మొత్తంలో స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టేందుకు జంకు తున్నారు. దీనికి తోడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్సీ, ఆటోమేషన్‌లు కొలువులను మంగేస్తున్నాయి. దీంతో స్థిరాస్తి కొనుగోళ్లు మందగిం చాయి. ఫలితంగా కొనే వాళ్లు లేక చాలా ప్రాజెక్టుల్లో 50 నుంచి 60 అక్యుపెన్సీ కూడా లభించడం లేదు. దీంతో నిర్వహణ వ్యయం దొరక్క ప్రాజెక్టులను కంపెనీలు సకాలంలో పూర్తిచేయలేకపోతున్నారు. కొనుగోలు దారులు స్థిరాస్తి సంస్థలను కోర్టుకీడ్చుతున్నాయి. లాభాల సంగతి అటుంచి పెట్టిన పెట్టుబడివస్తే చాలన్న రీతిలో ఎక్కువ ప్రాజెక్టులను విక్రయిస్తున్నారు.

 4. భ‌య‌పెడుతోన్న వ‌డ్డీ భారం

4. భ‌య‌పెడుతోన్న వ‌డ్డీ భారం

స్థిరాస్తి రంగంలో గతంలో నిర్మాణ వ్యయపు భారం దాదాపు 12 నుంచి 15 శాతంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇది దాదాపు 40 శాతానికి చేరుకు న్నాయి. ఫలితంగా అధిక మొత్తంలో నిధులను ఇతర సంస్థల నుంచి రుణాలుగా తీసుకు రావాల్సిన పరిస్థితి. వార్షిక స‌మ్మిళిత వృద్ది రేటు(సీఏజీఆర్‌) ప్రకారం గడిచిన మూడేండ్ల కాలంలో స్థిరాస్తి సంస్థల మొత్తం రుణ భారం గత మార్చినాటికి రూ.81,000 కోట్లము పైబడే ఉంటుందని ఈ రంగపు నిపుణులు చెబుతున్నారు. వీటిపై వడ్డీ భారం లెక్కించి చూస్తే మొత్తం అమ్మకాలలో ఇది 16 శాతం మేర ఉండనున్న ట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అంటే రూ.100 అమ్మకాలు జరిపితే అందులో రూ.16 వడ్డీయే చెల్లించేల్సినపరిస్థితి నెలకొంది. 2011 ఆర్థిక సంవత్సరంలో ఈ చెల్లింపులు కేవలం 11.2 శాతంగా ఉండేవి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగు ణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తుండడంంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్థ భాగంలో కొంత పురోగతి కనిపిస్తోంది. చేతిలో ఉన్న నిర్మాణాలు, అమ్మకాల నిష్పత్తి దృష్ట్యా చూస్తే నిర్మాణాల వృద్ధి 5.2 శాతంగా నమోదు అయితే నికర అమ్మకాలలో ఏడాది ప్రాతిపాదికన 5.4 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.

Read more about: real estate housing
English summary

ప్ర‌జ‌ల వెనుక‌డుగుతో ఇబ్బందులో స్థిరాస్తి రంగం లావాదేవీలు | Real estate in doldrums in India as far as buyers is concerned

Vacancy levels remained largely unchanged through 2017, hovering at around 14% pan India. Select markets saw lower vacancy levels and are expected to see a further decline in 2018.
Story first published: Monday, December 11, 2017, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X