For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యూచర్ గ్రూప్ ఐపీవో ధ‌ర రూ.660- రూ.664

ఇష్యూ నేడు(6న) ప్రారంభమై శుక్రవారం(8న) ముగియనుంది. ఇష్యూకి రూ. 660-664 ధరల శ్రేణికాగా.. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.

|

కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. లాజిస్టిక్స్‌ రంగంలో కార్యకలాపాలు కలిగిన ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇష్యూ నేడు(6న) ప్రారంభమై శుక్రవారం(8న) ముగియనుంది. ఇష్యూకి రూ. 660-664 ధరల శ్రేణికాగా.. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్‌లో భాగంగా దాదాపు 95 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది.

 ఫ్యూచ‌ర్ స‌ప్లై చైన్స్ ఐపీవో

యాంకర్‌ నిధులు
ఐపీవోలో భాగంగా ఫ్యూచర్‌ సప్లై చైన్‌ మంగళవారం 16 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థల నుంచి రూ. 195 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 664 ధరలో 2.93 మిలియన్‌ షేర్లను విక్రయించింది. కాగా.. ఇష్యూకి కనీస లాట్‌ 22 షేర్లుకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 2 లక్షల మొత్తం మించకుండా దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. కంపెనీ ఐటీ ఆధారిత వేర్‌హౌసింగ్‌, పంపిణీ, తదితర లాజిస్టక్‌ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో ఇటీవలే మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్‌ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయ్యింది. కాగా.. ఐపీవోలో కంపెనీ ఆశిస్తున్న ధర అధికంగా ఉన్నట్లు పలు బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

Read more about: future group ipo
English summary

ఫ్యూచర్ గ్రూప్ ఐపీవో ధ‌ర రూ.660- రూ.664 | Future Supply Chain Solutions' IPO today

The initial public offering (IPO) Future Supply Chain Solutions kicked off on Wednesday, a day after the Future Group's logistics arm raised Rs 195 crore from 16 anchor investors.
Story first published: Wednesday, December 6, 2017, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X