For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ట‌ప్‌ల ద్వారా 30 లక్ష‌ల ఉద్యోగాలు: పాయ్

"2025 నాటికి దేశంలో ల‌క్ష స్టార‌ప్‌లు ప్రారంభ‌మ‌వుతాయి. త‌ద్వారా 500 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ విలువ జోడింపు జ‌రుగుతుంది. త‌ద్వారా 32.5 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు స‌మ‌కూరే వీలుంది అని" పాయ్ అన్న

|

భార‌త‌దేశం గ‌త కొన్నేళ్ల నుంచి స్టార్ట‌ప్‌ల‌కు స్వ‌ర్గ‌ధామంలా త‌యార‌యింది. వీటిలో విజ‌యం సాధిస్తున్న‌వి ఎన్ని, విఫ‌ల‌మ‌వుతున్నవి ఎన్ని అనే విష‌యాన్ని ప‌క్క‌న బెడితే ఎంతో మంది యువ‌కులు వ్య‌వ‌స్థాప‌క‌త‌ను నిరూపించుకోవ‌డానికి స్టార్ట‌ప్‌లు ఒక నూత‌న వేదిక‌గా నిలిచాయి. అదే విష‌యం గ‌త రెండు, మూడేళ్ల నుంచి నిరూపితం అవుతోంది. ముఖ్యంగా సిలికాన్ సిటీగా పిల‌వ‌బ‌డే బెంగుళూరు న‌గ‌రం స్టార్ట‌ప్ సంస్థ‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. ఇప్పుడిప్పుడే మ‌న భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్ సైతం ఎంతో మంది స్టార్ట‌ప్ స్థాప‌కుల‌ను అక్కున చేర్చుకుంటోంది. దీనికి సంబంధించి అప్పుడ‌ప్పుడు ఆస‌క్తిక‌ర గ‌ణాంకాలు వెలువడుతుంటాయి. ఇప్పుడు ఇలాంటిదే మ‌రో అంచ‌నా వెల‌వ‌డింది. భార‌తదేశంలో స్టార్ట‌ప్‌ల‌కు డిమాండ్ ఏర్ప‌డుతోంద‌ని రానున్న 7-8 ఏళ్ల కాలంలో 1 ల‌క్ష స్టార్ట‌ప్లు ప్రారంభ‌మ‌వుతాయని రాజ‌స్థాన్ డిజీ ఫెస్ట్లో మోహ‌న్ దాస్ పాయ్ వెల్ల‌డించారు.మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ ఛైర్మ‌న్ టీవీ మోహ‌న్ దాస్ స్టార్ట‌ప్ విజృంభ‌ణ గురించి చెప్పారు. "2025 నాటికి దేశంలో ల‌క్ష స్టార‌ప్‌లు ప్రారంభ‌మ‌వుతాయి. త‌ద్వారా 500 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ విలువ జోడింపు జ‌రుగుతుంది. త‌ద్వారా 32.5 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు స‌మ‌కూరే వీలుంది అని" పాయ్ అన్నారు.

30 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా అవ‌కాశాలు

ప్ర‌భుత్వం ఒక మార్గ సూచితో వెలుతున్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా దేశంలో 32వేల స్టార్ట‌ప్లు ప్రారంభ‌మ‌వ‌గా ఏటా క‌నీసం 7000 కొత్త కంపెనీలు మొద‌ల‌వుతున్నాయి. "యువ‌కులు టెక్నాల‌జీని ఉప‌యోగించి దేశంలో ఎన్నో క్లిష్ట‌మైన సమ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు క‌నుగొంటున్నారు. సృజ‌నాత్మ‌క‌త విష‌యంలో నాకు మ‌న యువ‌కుల‌పైన న‌మ్మ‌కం ఉంది. వీరంతా దేశాన్ని మారుస్తార‌"ని పాయ్ వివ‌రించారు.

Read more about: startup jobs
English summary

స్టార్ట‌ప్‌ల ద్వారా 30 లక్ష‌ల ఉద్యోగాలు: పాయ్ | India to have 100,000 start-ups valued at $500 bn in 7-8 yrs: Mohandas Pai

"By 2025, I believe that we will have 1,00,000 startups all over the country. They will create USD 500 billion of value and lot of money for investors. They will employ 3.25 million people," Pai told PTI on the sidelines of Rajasthan Digifest here.
Story first published: Monday, December 4, 2017, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X