For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సాంకేతిక‌త నేర్చుకునే విద్యార్థుల‌కు గూగుల్ స్కాల‌ర్‌షిప్‌లు

కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 1.30 ల‌క్ష‌ల మంది డెవలపర్లకు, విద్యార్థుల‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫ

|

ఎప్పుడూ కొత్త విష‌యాల గురించి ప‌రిశోధ‌న‌ల్లో మునిగి తేలే సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ ఇప్పుడు విద్యార్థుల‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భ‌విష్య‌త్ త‌రం సాంకేతిక‌త‌కు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇందుకోసం టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీతో కలిసి ఓ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 1.30 ల‌క్ష‌ల మంది డెవలపర్లకు, విద్యార్థుల‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్ ఉప‌కార‌వేత‌నాలను అందించనుంది.

ఆండ్రాయిడ్ నేర్చుకునే విద్యార్థుల‌కు గూగుల్ స్కాల‌ర్‌షిప్‌లు(ఉప‌కార వేత‌నాలు)

ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా భారతీయ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వర్చ్యూవల్‌ రియాల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది. ఈ కొత్త స్కాలర్‌షిప్‌ ప్రొగ్రామ్‌‌తో భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్‌ ముందుకు వచ్చింది. ప్ర‌పంచంలో భార‌త‌దేశం రెండో అతిపెద్ద శిక్ష‌ణా కేంద్రంగా అభివృద్ది చేయాల‌ని గూగుల్ త‌లంపుగా ఉంది. 2021 నాటికి ఇక్క‌డ ఉండే శిక్ష‌ణా కేంద్రం అమెరికాను అధిగ‌మించ‌నుంద‌ని గూగుల్ డెవ‌ల‌ప‌ర్ ప్రాడ‌క్ట్స్ గ్రూప్ అండ్ స్కిల్లింగ్ లీడ్ ఫ‌ర్ ఇండియా విలియ‌మ్ ఫ్లోరెన్స్ తెలిపారు. రానున్న మూడు సంవ‌త్స‌రాల్లో కొత్త‌గా 20 లక్ష‌ల మంది ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ల‌కు గూగుల్ శిక్ష‌ణ ఇస్తుంద‌ని సీఈవో సుంద‌ర్ పిచాయ్ 2015లోనే ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే.

English summary

కొత్త సాంకేతిక‌త నేర్చుకునే విద్యార్థుల‌కు గూగుల్ స్కాల‌ర్‌షిప్‌లు | Google is going to give 130000 scholarships for Indian Developers

In this joint effort, Google will sponsor 100,000 scholarships on the Pluralsight technology learning platform and 30,000 Scholarships on Udacity to help developers gain access to advanced learning curriculum and further their employability in emerging technologies.
Story first published: Wednesday, November 29, 2017, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X