For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబ‌ర్‌లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి రూ.51 వేల కోట్లు

అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) త‌న త‌గ్గ‌ర ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్ నిధుల స‌మాచారాన్ని వెల్ల‌డించింది. దాని ప్ర‌కారం అక్టోబ‌ర్ నెల‌లో పెట్టుబ‌డిదారులు రూ. 51 వేల కోట్ల మేర కొత్త‌గా

|

అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) త‌న త‌గ్గ‌ర ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్ నిధుల స‌మాచారాన్ని వెల్ల‌డించింది. దాని ప్ర‌కారం అక్టోబ‌ర్ నెల‌లో పెట్టుబ‌డిదారులు రూ. 51 వేల కోట్ల మేర కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టారు. అదే విధంగా అంత‌కుముందు సెప్టెంబ‌రు నెల‌లో దాదాపు రూ.16 వేల కోట్ల‌ను ఇన్వెస్ట‌ర్లు త‌మ ఫండ్ల‌లోనుంచి వెన‌క్కు తీసుకున్నారు. ఇప్పుడు సెప్టెంబ‌రు నెల‌లో త‌గ్గిన దాన్ని తీసివేసి, కొత్త‌గా అక్టోబ‌ర్ నెల‌లో జ‌మ అయిన మ్యూచువ‌ల్ ఫండ్ సొమ్మును క‌లిపి లెక్కిస్తే మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల్లో ఉన్న డ‌బ్బు విలువ రూ. 2.5 లక్ష‌ల కోట్ల‌ను దాటింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి 7నెలల్లో(ఏప్రిల్-అక్టోబ‌ర్) మ‌ధ్య కాలంలో ప్ర‌వ‌హించిన నిధుల ఇద‌ని యాంఫీ పేర్కొంది.

 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి భారీగా నిధులు

"నోట్ల ర‌ద్దు కార‌ణంగా అత్య‌ధికంగా లాభ‌ప‌డిన ప‌రిశ్ర‌మ‌ల్లో మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ ఒక‌టి. దీని కార‌ణంగా బ్యాంకులు డిపాజిట్ల‌పైన వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. దీంతో పెట్టుబ‌డిదారులు డిపాజిట్ల నుంచి, స్థిరాస్తుల నుంచి దీర్ఘ‌కాల ఆర్థిక రాబ‌డుల‌నిచ్చే ప‌థ‌కాల కోసం చూస్తున్నారు. దేశంలో ప్ర‌జ‌ల పెట్టుబ‌డి అలవాట్లు మారిన సంవ‌త్స‌రంగా ఈ ఏడాది చరిత్ర‌కు ఎక్కుతుంది. ,"అని బ‌జాజ్ క్యాపిట‌ల్ సీఈవో రాహుల్ ప‌రీఖ్ అన్నారు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు

సెప్టెంబ‌రులో పెట్టుబ‌డిదారులు రూ.16,604 కోట్ల‌ను వెన‌క్కు తీసుకోగా, కేవ‌లం అక్టోబ‌ర్ నెల‌లోనే రూ. 51.148 కోట్ల‌ను మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల్లోకి కుమ్మ‌రించారు. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు, ఇన్‌క‌మ్ స్కీమ్‌లు వంటి వాటిల్లో బాగా నిధుల ప్ర‌వాహం జ‌ర‌గ‌డంతో ఈ విధంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి వ‌చ్చే సొమ్ము గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లోకి వ‌చ్చిన సొమ్ము విలువ రూ16వేల కోట్లు కాగా, ఇన్‌క‌మ్ ఫండ్(ఆదాయ ఫండ్ల‌)లోకి వ‌చ్చిన నిధుల విలువ రూ.40,845 కోట్లుగా ఉంది.

Read more about: amfi mutual funds
English summary

అక్టోబ‌ర్‌లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి రూ.51 వేల కోట్లు | Mutual funds log Rs51,000 crore inflow in October

Investors have pumped over Rs51,000 into various mutual fund (MF) schemes in October after pulling out more than Rs16,000 crore in the preceding month, latest data with industry body the Association of Mutual Funds in India (AMFI) showed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X