For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10వేల కోట్ల స‌మీక‌ర‌ణ‌కు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఐపీవో

ఇండియాలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూఇండియా అష్యూరెన్స్‌ (ఎన్‌ఐఏ) రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు నవంబర్‌ మొదటి వారంలో తొలి పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మ‌ధ్యే మరో సాధారణ బీమా కంపెనీ జీఐసీ రూ.

|

* న‌వంబ‌రులో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవో
ఇండియాలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూఇండియా అష్యూరెన్స్‌ (ఎన్‌ఐఏ) రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు నవంబర్‌ మొదటి వారంలో తొలి పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మ‌ధ్యే మరో సాధారణ బీమా కంపెనీ జీఐసీ రూ. 11,370 కోట్ల ఐపీఓ 1.35 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత ఒకటిన్నర నెలల్లో మ‌రో రెండు బీమా కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్‌బీఐ లైఫ్‌లు కూడా ఐపీఓలు జారీచేసిన సంగతి విదితమే.

న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవో

ఈ నేపథ్యం లో ప్రభుత్వ రంగ ఎన్‌ఐఏ భారీ పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయ‌నుండటం విశేషం. భార‌త‌దేశంతో పాటు 28 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూ ఇండి యా అష్యూరెన్స్‌ ఐపీఓ నవంబర్‌ మొదటివారంలోనే పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క‌చ్చితంగా ఎంత మొత్తానికి ఐపీఓ జారీచేయబోయేదీ, ఇష్యూ దర ఎంతనేది ఈ వారం లో ప్రకటించనున్నట్లు సంబంధిత‌ వర్గాలు తెలిపాయి.

త్వరలో శత వార్షికోత్సవం(వందేళ్ల పండుగ‌) జరుపుకోనున్న న్యూఇండియా అష్యూరెన్స్‌కు ప్రస్తుతం సాధారణ బీమా మార్కెట్లో 16 శాతం వాటా వుంది. 31 పోటీ కంపెనీలున్నప్పటికీ, గత ఐదేళ్లుగా మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 26,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనావేస్తున్న ఈ కంపెనీకి రూ. 69,000 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 2017 జూన్‌ క్వార్టర్‌ ముగింపునాటికి ఈ కంపెనీ పెట్టుబడుల మార్కెట్‌ విలువ రూ. 63,100 కోట్లు వుంది. అత్యధిక టాప్‌ కార్పొరేట్లు ఈ కంపెనీకి దీర్ఘకాలిక వినియోగ‌దారులుగా ఉన్నాయి.

Read more about: india insurance ipo
English summary

రూ.10వేల కోట్ల స‌మీక‌ర‌ణ‌కు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఐపీవో | New India Assurance Rs 10,000 crore IPO: Things To Know

New India Assurance (NIA), the largest general insurance company in the country, is set to hit the capital markets with around Rs 10,000 crore IPO in the first week of November. The offer comes soon after the Rs 11,370 crore IPO of GIC Re, which will be listed on October 25. It has already been oversubscribed by over 1.35 times.
Story first published: Tuesday, October 24, 2017, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X