For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ఫోన్ రీఫండ్‌-10 ముఖ్య విష‌యాలు

దేశ‌వ్యాప్తంగా ప‌లు స్టోర్ల‌కు జియో ఫీచ‌ర్ ఫోన్ల రాక ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో రిల‌య‌న్స్ జియో 4జీ ఫోన్ పై నూత‌న నిబంధ‌న‌ల‌ను రిల‌య‌న్స్ జియో వెల్ల‌డించింది.

|

దేశ‌వ్యాప్తంగా ప‌లు స్టోర్ల‌కు జియో ఫీచ‌ర్ ఫోన్ల రాక ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో రిల‌య‌న్స్ జియో 4జీ ఫోన్ పై నూత‌న నిబంధ‌న‌ల‌ను రిల‌య‌న్స్ జియో వెల్ల‌డించింది. జియో అధికారిక వెబ్‌సైట్‌లో జియో ఫోన్ రీఫండ్‌కు సంబంధించిన, జియో ఫోన్ ప్రాథ‌మిక వాడ‌కానికి చెందిన ప్రాథ‌మిక నియ‌మ నిబంధ‌న‌ల‌ను పొందుప‌రిచారు. ఆయా ష‌ర‌తుల‌ను సంతృప్తి ప‌రిస్తేనే మీరు జియో ఫోనుకు సంబంధించిన రీఫండ్‌ను మూడేళ్ల త‌ర్వాత పొందుతారు. అవేంటో మీ కోసం...

1. 36 నెల‌ల త‌ర్వాత‌

1. 36 నెల‌ల త‌ర్వాత‌

ఫోన్ ప‌నిచేసే కండీష‌న్లో 36 నెల‌ల పాటు ఉండాలి. కేవ‌లం రీఫండ్ కోసం మూడేళ్ల త‌ర్వాత 3 నెల‌ల స‌మ‌యాన్ని మాత్ర‌మే ఇస్తారు. ఫోన్ 3 సంవ‌త్స‌రాలు వాడిన త‌ర్వాత ఆ మూడు నెల‌ల్లోనే ఫోన్ తిరిగి ఇచ్చేయాలి. వెబ్‌సైట్ ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్లో ఇచ్చిన దాని క‌ప్ర‌కారం ఫోన్ కొన్న 36 నెల‌ల త‌ర్వాత రిట‌ర్ను ఇవ్వ‌డం మొద‌ల‌వుతుంది, అదే విధంగా ఫోన్ మ‌న చేతికి అందిన 39 నెలల్లోపు ఫోన్ వెన‌క్కి ఇచ్చి డ‌బ్బు తిరిగి పొందాలి.

2. జియో సిమ్ మాత్ర‌మే

2. జియో సిమ్ మాత్ర‌మే

జియో రూ.1500 కే ఇస్తున్న ఫోన్ సిమ్ లాక్‌డ్‌. కాబ‌ట్టి ముందే నిర్ణ‌యించిన ఒక ఫిక్స్‌డ్ నంబ‌రుతో ఇచ్చిన ఇందులో జియో నెట్‌వ‌ర్క్ త‌ప్ప వేరే ఇత‌ర నెట్‌వ‌ర్క్ సిమ్‌లు ప‌నిచేయ‌వు. అయితే కంపెనీ ఇస్టాన్ని స‌మయానుసారంగా వేరే సిమ్లు ప‌నిచేసేలా జియో కంపెనీనికి అనుమ‌తి ఇచ్చే హ‌క్కుంది.

3. రూ.1500 రీఫండ్

3. రూ.1500 రీఫండ్

కంపెనీ ఇచ్చిన కాల‌ప‌రిమితిలో మాత్ర‌మే రిట‌ర్న్ చేయాలి. అప్పుడే రీఫండ్ సొమ్ము మీకు ఇస్తారు. ఒక‌వేళ 3 ఏళ్ల త‌ర్వాత కంపెనీ అనుమ‌తించిన మూడు నెలల్లోపు వెనక్కు ఇవ్వ‌న‌ట్ల‌యితే మీ సొమ్ము వెన‌క్కు రాదు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు అక్టోబ‌ర్1న ఫోన్ కొని మీ చేతికి వ‌చ్చిన‌ట్ల‌యితే జ‌న‌వ‌రి 2020 లోపు రీఫండ్ కోసం ఫోన్ వెన‌క్కు ఇవ్వాలి.

4. సిమ్‌ను తొల‌గించాల్సిందే

4. సిమ్‌ను తొల‌గించాల్సిందే

సిమ్ వాడుతుంటారు. అయితే జియో ఫీచ‌ర్ ఫోన్ వెన‌క్కు ఇచ్చి రీఫండ్ పొందాలంటే ఈ సిమ్‌ను తీసేయాలి. అయితే ఫోన్‌ను తిరిగి ఇచ్చినంత మాత్రాన జియోతో స‌ర్వీస్ కాంట్రాక్ట్ మగియ‌ద‌ని వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

5. ఏడాది వారెంటీ

5. ఏడాది వారెంటీ

జియో ఫోన్ హ్యాండ్‌సెట్‌కు ఏడాది కాలం పాటు త‌యారీ వారెంటీ ఉంటుంది. చార్జ‌ర్‌కు 6 నెల‌ల వారెంటీ. హ్యాండ్ సెట్ సీల్‌, దాని పైన ఉండే నంబ‌రు, డేట్ కోడ్ వంటివి తొల‌గించినా లేదా చెరిగిపోయినా లేదా మార్చినా లేదా ఫోన్‌లో రివ‌ర్స్ ఇంజినీరింగ్‌, అన్‌లాక్ చేయ‌డం వంటి సొంత ప్ర‌యోగాలు చేసినా వారెంటీ వ‌ర్తించ‌దు.

6. రిల‌య‌న్స్ రిటైల్‌కు లొకేష‌న్ ట్రాక్ చేసే వీలు

6. రిల‌య‌న్స్ రిటైల్‌కు లొకేష‌న్ ట్రాక్ చేసే వీలు

జియో ఫోన్ల‌ను అమ్మే రిల‌య‌న్స్ రిటైల్‌కు ఆ ఫోన్‌కు సంబంధించి లోకేష‌న్‌ను ట్రాక్ చేసే అనుమ‌తి ఉంటుంది. ఇది బ్లూటూత్, వైఫై సిగ్న‌ల్స్ ఆధారంగా జ‌రుగుతుంది. ముఖ్యంగా కాలెండ‌ర్ ఎంట్రీలు, టెక్నాల‌జీ, స‌మాచారం వంటివి. ఈ స‌మాచారాన్ని ఆయా ప్రాంతాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను అందించేందుకు ఉప‌యోగిస్తారని కంపెనీ తెలిపింది. సాధార‌ణంగా చాలా ఫోన్ త‌యారీ కంపెనీలు ఈ ష‌ర‌తు విధిస్తాయి. గూగుల్ సైతం దాదాపు ఇలాంటి నియ‌మ నిబంధ‌న‌ల‌నే దాని సేవ‌ల‌ను వాడుకునేందుకు విధిస్తుంది.

7. వాయిస్ రికార్డింగ్‌

7. వాయిస్ రికార్డింగ్‌

ఇందులో వాయిస్ ఆధారంగా ప‌నిచేసే సాంకేతిక‌త ఉంది. ప‌రిక‌రాన్ని ఆపరేట్ చేసేందుకు వాడే ప‌దాలు, ఉచ్చార‌ణకు సంబంధించి మీ వాయిస్ రికార్డింగ్‌ల‌ను సేక‌రించే హ‌క్కు రిల‌య‌న్స్ రిటైల్‌కు ఉంటుంది. ఈ రికార్డింగుల‌ను స్పీచ్ టు టెక్ట్స్‌(వాయిస్‌ను ప‌దాలుగా మార్చి) క‌న్వ‌ర్ట్ చేసి ఇత‌రుల‌తో జియో పంచుకోవ‌చ్చు.

8. మీరు ఫోన్ కొని ఎవ‌రికిచ్చినా రీఫండ్ రాక‌పోవ‌చ్చు

8. మీరు ఫోన్ కొని ఎవ‌రికిచ్చినా రీఫండ్ రాక‌పోవ‌చ్చు

జియో ఫోన్ కొన్న సొంత‌దారు మాత్ర‌మే దాన్ని ఉప‌యోగించాలి. దాన్ని ఇత‌రుల‌కు అమ్మ‌డం, లీజ్‌కు ఇవ్వ‌డం, బ‌దిలీ చేయ‌డం వంటివి చేయ‌కూడ‌దని కంపెనీ తెలిపింది. ఎందుకంటే రీపండ్ పొందే స‌మ‌యంలో సొంత‌దారు వెన‌క్కు ఇస్తేనే రీఫండ్ సంబంధించిన ష‌ర‌తులు అంగీకారానికి వ‌స్తాయి.

9. అది వ్య‌క్తిగ‌తం గానీ వ్య‌క్తిగ‌తం కాదు కంపెనీకి

9. అది వ్య‌క్తిగ‌తం గానీ వ్య‌క్తిగ‌తం కాదు కంపెనీకి

రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌, లైసెన్సు దారులు, ఏజెంట్లు ఫోన్ వినియోగ‌దారును గుర్తించేలా లొకేష‌న్ డేటా, వ్య‌క్తిగ‌త గుర్తింపు సమాచారాన్ని సేక‌రిస్తాయి. ఈ త‌ర‌హా స‌మాచారాన్ని ప్రాంతానికి సంబంధించిన ఉత్ప‌త్తుల‌ను, సేవ‌ల‌ను అందించేందుకు కంపెనీ ఉప‌యోగించుకోవ‌చ్చు. కుకీస్ ద్వారా కంపెనీ సేక‌రించిన స‌మాచారాన్ని వ్య‌క్తిగ‌త స‌మాచారం కాద‌ని జియో వెల్ల‌డించింది.

 10. క‌నీస రీచార్జీ

10. క‌నీస రీచార్జీ

జియో ఫోన్ నిరంతంర ప‌ని చేయాలంటే ప్ర‌తి సంవ‌త్స‌రం మొత్తం మీద క‌నీసం రూ.1500 చొప్పున రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంద‌ని కంపెనీ వివ‌రించింది. అంతే కాకుండా నెల‌వారీ చూస్తే రూ.153 రీచార్జీ చేసుకోవాల్సి వ‌స్తుంది. అది సంవ‌త్స‌రానికి లెక్కిస్తే రూ.1836 అవుతుంది. దాన్నే మూడేళ్ల పాటు లెక్కించి చూస్తే మొత్తం రూ.5508గా ఉంటుంది. ఇందులో ఫోన్ రీఫండ‌బుల్ సొమ్ము రూ.1500 లెక్క‌లోకి రాదు.

Read more about: jio jio phone reliance jio
English summary

జియో ఫోన్ రీఫండ్‌-10 ముఖ్య విష‌యాలు | Know terms and conditions to get Jio phone deposit refund

Simply by using location-based services on the handset, the user gives the “consent to transmission, collection, maintenance, processing and use of your location data and queries to provide and improve such products and services.
Story first published: Thursday, September 28, 2017, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X