For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ వృద్ది 7% : ఆసియా అభివృద్ది బ్యాంకు

ఆసియాతో పాటు భార‌త వృద్ది రేటు అంచ‌నాల‌ను ఆసియా అభివృద్ది బ్యాంకు త‌గ్గించింది. 2017 ఏడాదికి 7%, 2018లో 7.4% వృద్ది రేట్ల‌ను మాత్ర‌మే భార‌త‌దేశం సాధించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా వేసింది.

|

వివిధ దేశాల వృద్ది రేట్ల అంచ‌నాల‌ను ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడీబీ) స‌వ‌రించింది. 2017,2018 సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా ఆసియా ప్రాంత వృద్ది రేట్లు 5.9%; 5.8% గా న‌మోదు కాగ‌ల‌వ‌ని అంచ‌నా వేసింది. అదే స‌మ‌యంలో భార‌త‌దేశ వృద్ది రేటు 2017లో 7% మాత్ర‌మే ఉండ‌గ‌ల‌ద‌ని చెప్పింది. ఇంత‌కుముందు జులైలో ఉన్న 7.4% నుంచి ఇప్పుడు త‌గ్గించింది. స్వ‌ల్ప కాల అడ్డంకులు అయిన గ‌తేడాది నోట్ల మార్పిడి, ఇప్పుడు అమ‌లు చేస్తున్న జీఎస్టీ వంటివి దీనికి కార‌ణాలుగా నిలిచాయ‌ని ఏడీబీ పేర్కొంది. ఆసియా వ్యాప్తంగా సైతం చైనా అనుకున్న దాని క‌న్నా మంచి సామ‌ర్థ్యం క‌న‌బరుస్తున్న‌ప్ప‌టికీ మ‌రో వైపు అమెరికా ద్ర‌వ్య పాల‌సీలో క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌లు తీసుకోవ‌డం అన్ని ప్రాంతాల వృద్ది పుంజుకునే దానిపై ప్ర‌భావం చూపుతుంది అని ఏడీబీ విశ్లేషించింది.

భార‌త వృద్ది రేటు

భార‌త‌దేశ విష‌యానికి వ‌స్తే జీఎస్టీ వ‌ల్ల మ‌ధ్య‌కాలంలో స్వ‌ల్ప ప్ర‌యోజ‌నాలు క‌లిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఏడీబీ అంచ‌నా వేసింది. కాబ‌ట్టి వ‌చ్చే ఏడాది భార‌త వృద్ది రేటు 7.4% దాకా న‌మోదు కావొచ్చ‌ని తెలిపింది. సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి గురించి ప్ర‌క‌టించారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ వృద్ది రేటు మూడేళ్ల క‌నిష్ట స్థాయి 5.7శాతానికి ప‌డిపోయింది. ప్ర‌యివేటు పెట్టుబ‌డులు క్షీణించ‌డం, మంద‌కొడిగా కొన‌సాగుతుండ‌టం ఇందుకు ఒక కార‌ణంగా భావిస్తున్నారు.

Read more about: adb growth rate gdp gst
English summary

దేశ వృద్ది 7% : ఆసియా అభివృద్ది బ్యాంకు | ADB lower the forecast of India growth rate to 7 percent

ADB lowers India’s growth from its July estimate of 7.4%, reflecting ‘short term disruptions’ such as last year’s demonetisation and this year’s implementation of GST
Story first published: Tuesday, September 26, 2017, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X