For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 దేశాలు-ఆ వృత్తుల‌కు చెల్లించే వేత‌నాలు అత్య‌ధికం

ల‌క్సంబ‌ర్గ్ దేశం ఉపాధ్యాయుల‌కు, న‌ర్సుల‌కు ఎక్కువ వేత‌నాలు చెల్లిస్తోంది. అలా ఒక 10 వృత్తుల‌కు సంబంధించి మంచి వేత‌నాలు చెల్లిస్తున్న 10 దేశాల గురించి తెలుసుకుందాం.

|

కొన్ని వృత్తుల‌కు కొన్ని దేశాలు చాలా ప్రాముఖ్య‌త‌ ఇస్తుంటాయి. అంటే దీన‌ర్థం ఆ వృత్తిని ప్ర‌జ‌లు గౌర‌విస్తార‌ని కాదు. ప్ర‌భుత్వాలు త‌మ ప్రాధాన్యాల్లో, కంపెనీలు ఉద్యోగుల‌కు వేత‌నం చెల్లించ‌డంలో బాగా చేస్తున్నాయ‌ని. ఉదాహ‌ర‌ణ‌కు ల‌క్సంబ‌ర్గ్ దేశం ఉపాధ్యాయుల‌కు, న‌ర్సుల‌కు ఎక్కువ వేత‌నాలు చెల్లిస్తోంది. అలా ఒక 10 వృత్తుల‌కు సంబంధించి మంచి వేత‌నాలు చెల్లిస్తున్న 10 దేశాల గురించి తెలుసుకుందాం.

1. డాక్ట‌ర్ల‌కు ఉత్తమ వేత‌నాలు చెల్లించే దేశం

1. డాక్ట‌ర్ల‌కు ఉత్తమ వేత‌నాలు చెల్లించే దేశం

నెద‌ర్లాండ్ దేశంలో స్పెష‌లైజేష‌న్ క‌లిగిన ఫిజిషీయ‌న్‌కు రూ. 16 కోట్లు చెల్లిస్తారు. మెడిసిన్ ప్రాక్టీస్ చేయ‌డానికి ఇది ఉత్త‌మ దేశంగా ప‌రిగ‌ణింప‌బ‌డుతోంది.

2. ఉపాధ్యాయ వృత్తికి త‌గిన గౌర‌వం

2. ఉపాధ్యాయ వృత్తికి త‌గిన గౌర‌వం

మ‌న దేశంలో ఉపాధ్యాయుల‌కు త‌గినంత క‌ష్టానికి వేత‌నాలు స‌రిప‌డా చెల్లించ‌లేద‌నే అభిప్రాయం ఉంది. ల‌క్సంబ‌ర్గ్ దేశంలో అర్హ‌త క‌లిగిన ఉపాధ్యాయులు ఏడాదికి రూ.84 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్ట‌గానే చెల్లించే వేత‌నాలు చూస్తే మ‌రే దేశంలో క‌న్నా ఇక్క‌డ చెల్లించే వేత‌నం గ‌రిష్టం.

 3. ఫాస్ట్ ఫుడ్ త‌యారుచేసే వారు ఇక్క‌డ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు

3. ఫాస్ట్ ఫుడ్ త‌యారుచేసే వారు ఇక్క‌డ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు

ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్ల విష‌యంలో డెన్మార్క్ త‌యారీదారుల‌కు, అక్క‌డ ప‌నిచేసే వారికి ఎక్కువ వేత‌నాలు చెల్లిస్తుంద‌ట‌. కేవ‌లం బ‌ర్గ‌ర్లు స‌ర్వ్ చేసే వారికి రూ.29 ల‌క్ష‌ల వార్షిక వేత‌నం అందిస్తున్నార‌ట‌. అదే మ‌న దేశంలో ఇలాంటి వారికి చాలా త‌క్కువ జీతం ఇస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

4. కెనడాలో పోలీసుల‌కు పండ‌గే

4. కెనడాలో పోలీసుల‌కు పండ‌గే

నేర‌స్థుల‌ను డీల్ చేసేవారికి కెన‌డాలో మంచి గౌర‌వ‌మే ద‌క్కుతోంది. స‌గ‌టు కెన‌డా పోలీసు ఏడాదికి రూ.45 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా 50 ఏళ్ల‌కే రిటైర్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. న‌ర్సుల‌కు సంబంధించి

5. న‌ర్సుల‌కు సంబంధించి

భార‌త‌దేశంలో న‌ర్సుల‌కు చెల్లించే వేత‌నాలు చాలా త‌క్కువ అనే చెప్పాలి. దేశం మంచి ధ‌న‌వంత‌మైన దేశ‌మైన‌ప్ప‌టికీ ల‌క్సంబ‌ర్గ్‌లో న‌ర్సింగ్ వృత్తి నిపుణుల‌కు ఏమంత ఎక్కువ చెల్లించ‌డం లేదు. అయితే చాలా దేశాల‌తో పోలిస్తే నర్సుల‌కు ఎక్కువ డ‌బ్బిచ్చే దేశాల్లో ఇది ముందు ఉంటుంది. న‌ర్సుల కెరీర్‌లో మొద‌టి 8 సంవ‌త్స‌రాల్లో 60 వేల డాల‌ర్లు, గ‌రిష్టంగా అనుభ‌వం కొద్దీ 125000 డాల‌ర్లు సంపాదించుకునేందుకు అవ‌కాశం ఉంది. అయితే చిన్న దేశం కావ‌డం వ‌ల్ల ఇక్క‌డ ఉద్యోగం రావ‌డం క‌ష్టం.

6. నైపుణ్యం క‌లిగిన కార్మికుల‌కు

6. నైపుణ్యం క‌లిగిన కార్మికుల‌కు

నైపుణ్యం క‌లిగిన కార్మికుల‌కు నార్వే త‌గిన గౌర‌వం ఇస్తుంది. ప్ర‌పంచంలో ఏ దేశంతో పోల్చి చూసినా ఇక్క‌డ ఎక్కువ వేత‌నాలు ఇస్తారు. స‌గ‌టున నైపుణ్యం క‌లిగిన కార్మికుడు ఏడాదికి 1,68,000 డాల‌ర్లు ఆర్జిస్తాడు. అదే అనుభ‌వం కలిగిన మ‌నేజిరియ‌ల్ స్టాఫ్ ఇంకా ఎక్కువ సంపాదిస్తారు.

7. సివిల్ స‌ర్వెంట్ల‌కు త‌గిన గౌర‌వం

7. సివిల్ స‌ర్వెంట్ల‌కు త‌గిన గౌర‌వం

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కెన‌డా బాగానే స‌రిపోతుంది. నిజానికి ఈ దేశంలోనే ప్ర‌పంచంలోనే ఎక్కువ వేత‌నం ప్ర‌భుత్వోద్యోగులు అందుకుంటారు. మీరు స‌రైన ప‌నిలో నియ‌మితులైతే ఈ దేశంలో స‌గ‌టు వేత‌నం ఏడాదికి 90,600 డాల‌ర్లుగా ఉంటుంది.

8. పారిశుద్ద్య కార్మికులకు

8. పారిశుద్ద్య కార్మికులకు

పారిశుధ్ద్య కార్మికుల‌కు చాలా దేశాలు త‌క్కువ వేత‌నాలు చెల్లిస్తున్నాయి. అయితే లక్సంబ‌ర్గ్ మాత్రం వారికి త‌గినంత‌గా సొమ్ము చెల్లిస్తోంది. గంట‌కు 13 డాల‌ర్లు, ఏడాదికి 27152 డాల‌ర్లు చొప్పున పారిశుద్ద్య కార్మికుల‌కు చెల్లించే పారితోషకం ఉంటోంది.

9. నిర్మాణ కార్మికులు

9. నిర్మాణ కార్మికులు

నిర్మాణ కార్మికుల విష‌యంలో అగ్ర రాజ్యం అమెరికా కాస్త ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. బిల్డ‌ర్లు, నిర్మాణ కార్మికుల‌కు అత్య‌ధిక వేత‌నాలు చెల్లిస్తున్న దేశం అమెరికా కాగా, న్యూయార్క్ న‌గ‌రం అందులో అన్నింటి కంటే ముందున్న న‌గ‌రంగా నిలిచింది. వారు అందుకునే వేత‌నం ఏడాదికి 69,300 డాల‌ర్లుగా ఉంటున్న‌ది. ఎక్కువ సేపు ప‌నిచేస్తే ఎక్కువ జీతం ఇస్తారు. ఖ‌తార్లో వ‌ల‌స వ‌చ్చిన నిర్మాణ కార్మికుల‌కు చాలా త‌క్కువ వేత‌నాలు చెల్లిస్తార‌ట‌.

10. విమానంలో ప‌నిచేసేవారికి(విమాన‌యాన సిబ్బందికి)

10. విమానంలో ప‌నిచేసేవారికి(విమాన‌యాన సిబ్బందికి)

పేస్కేల్ నుంచి ఉన్న స‌మాచారం మేర‌కు విమాన‌యాన సిబ్బందికి అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ 60వేల డాల‌ర్ల వార్షిక వేత‌నాన్ని అందిస్తుంది. ప్ర‌పంచంలోనే విమానంలో ప‌నిచేసేవారికి ఇచ్చే జీతాల్లో ఇదే ఎక్కువ‌. అదే విమాన‌యాన సిబ్బందికి త‌క్కువ జీతం ఇచ్చే దేశాల్లో మ‌న‌దేశంలోని చాలా ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా మాత్రం ఎక్కువ వేత‌నాలు చెల్లించే జాబితాలో ఉంది.

11. సెక్ర‌ట‌రీ/ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు ఆ దేశంలో హ్యాపీ

11. సెక్ర‌ట‌రీ/ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు ఆ దేశంలో హ్యాపీ

సెక్ర‌ట‌రీ/ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగం చేయ‌డానికి ఇష్ట‌ప‌డే వారు స్విట్జ‌ర్లాండ్ వెళ్ల‌డం మంచిది. అక్క‌డ ఈ ప‌నికి ఏడాది కాలానికి రూ.56 ల‌క్ష‌లు చెల్లిస్తారు.

English summary

10 దేశాలు-ఆ వృత్తుల‌కు చెల్లించే వేత‌నాలు అత్య‌ధికం | Top 10 countries paying highest salaries for these professions

10 countries paying high salaries for these professions
Story first published: Monday, September 18, 2017, 14:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X