For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రూ. 1600 కోట్లు 'ఓయో'లోకి

దేశ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల ఆతిథ్య రంగంలో అద్దె రూముల‌ను నిర్వ‌హిస్తున్న ఓయో సాఫ్ట్‌బ్యాంక్ నుంచి కొత్త‌గా రూ. 1600 కోట్ల‌ను రాబ‌ట్టింది. సిరీస్ డీ నిధుల సేక‌ర‌ణ‌లో భాగంగా 4 సంస్థ‌ల నుంచి ఓయో పెట్టుబ‌డు

|

దేశ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల ఆతిథ్య రంగంలో అద్దె రూముల‌ను నిర్వ‌హిస్తున్న ఓయో సాఫ్ట్‌బ్యాంక్ నుంచి కొత్త‌గా రూ. 1600 కోట్ల‌ను రాబ‌ట్టింది. సిరీస్ డీ నిధుల సేక‌ర‌ణ‌లో భాగంగా 4 సంస్థ‌ల నుంచి ఓయో పెట్టుబ‌డుల‌ను త‌మ సంస్థ‌లోకి తీసుకుంది. సికొయా ఇండియా, లైట్ స్పీడ్ వెంచ‌ర్ పార్ట్‌న‌ర్స్‌, గ్రీనోక్స్ క్యాపిట‌ల్ వంటివి సిరీస్ డీ ఫండింగ్‌లో భాగంగా ఉన్నాయి. వీటితో పాటు ఈసారి కొత్త‌గా హీరో ఎంట‌ర్‌ప్రైజెస్ సైతం ప్ర‌వేశించింది. ప్ర‌తి నెలా కొత్త‌గా 10,000 రూముల‌ను(గ‌దుల‌ను) త‌మ నెట్వ‌ర్క్‌లో భాగం చేసేందుకు ఓయో ల‌క్ష్యంగా నిర్దేశించుకుంద‌ని ఓయో వ్య‌వ‌స్థాప‌క సీఈవో రితేష్ అగ‌ర్వాల్ చెప్పారు.

 సాఫ్ట్‌బ్యాంక్

''మా సొంత చాన‌ళ్ల ద్వారానే ఓయో గ‌దుల‌కు డిమాండ్ వ‌స్తోంది, వీటికి ఎటువంటి క‌మీష‌న్ చెల్లించ‌న‌క్క‌ర్లేదు. వ్యాపారం వృద్ది ఆశాజ‌న‌కంగా ఉంది. భార‌త్‌లోనూ, విదేశాల్లోనూ సంస్థ విస్త‌ర‌ణ కోసం కొత్తగా వచ్చిన నిధుల‌ను వినియోగిస్తాం. టెక్నాల‌జీ వినియోగం బ‌ల‌ప‌ర‌చ‌డం, వినియోగ‌దారుకు మ‌రింత అనుకూల వాతావ‌ర‌ణాన్ని పెంచ‌డంలో అధిక వ‌న‌రుల‌ను ఉప‌యోగించ‌డం చేస్తాం.'' అని రితేష్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు.

 సాఫ్ట్‌బ్యాంక్

ఎదుగుతున్న కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా సాఫ్ట్‌బ్యాంక్ ముందుకెళుతోంది. జ‌పాన్ టెలికాం కంపెనీ అయిన ఈ సంస్థ‌ త‌మ విజ‌న్ ఫండ్‌లో భాగంగా 100 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ల‌క్ష్యంగా పెట్టుకోగా అందులో కొంత శాతాన్ని ఇప్పుడు అది ఓయోలో పెట్టింది.ఈ సంస్థ గ‌తంలో ఆగ‌స్టు నెల‌లో ఫ్లిప్‌కార్ట్లో 2.5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబడిగా పెట్టింది.

Read more about: flipkart soft bank oyo
English summary

సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రూ. 1600 కోట్లు 'ఓయో'లోకి | oyo rises 1600 crore from softbank

Hospitality company OYO has raised $250 million (₹1,600 crore) in a fresh financing round led by SoftBank.Existing investors Sequoia India, Lightspeed Venture Partners and Greenoaks Capital also participated in the Series D funding, which also saw the entry of Hero Enterprise.
Story first published: Friday, September 8, 2017, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X