For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! -రిల‌య‌న్స్ మీడియా రంగంలో సైతం ఇంతలా ఉందా!

వివిధ పేర్ల‌తో మీడియాలో ఉన్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు రిల‌య‌న్స్ అని తెలియ‌కుండా మీడియాపై ఒక విధ‌మైన గుత్తాధిప‌త్యాన్ని రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ క‌లిగి ఉంది. దేశ మొత్తం మీడియా రంగంలో రిల‌య‌న్స్ ముకేశ్ అంబానీకి

|

నెట్వ‌ర్క్ 18 అనేది నోయిడా కేంద్రంగా పనిచేసే మాస్ మీడియా కంపెనీ. దీన్ని సొంత‌దారు, నిర్వ‌హ‌ణ దారు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌. రిల‌య‌న్స్ మీడియా సామ్రాజ్యంలో టెలివిజ‌న్‌, ఇంట‌ర్నెట్‌, సినిమా, మొబైల్ కంటెంట్ వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. వివిధ పేర్ల‌తో మీడియాలో ఉన్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు రిల‌య‌న్స్ అని తెలియ‌కుండా మీడియాపై ఒక విధ‌మైన గుత్తాధిప‌త్యాన్ని రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ క‌లిగి ఉంది. దేశ మొత్తం మీడియా రంగంలో రిల‌య‌న్స్ ముకేశ్ అంబానీకి చెందిన విస్త‌ర‌ణ ఎలా ఉందో తెలుసుకుందాం.

నెట్‌వ‌ర్క్‌ 18 స్థాప‌న

నెట్‌వ‌ర్క్‌ 18 స్థాప‌న

1996లో నెట్‌వ‌ర్క్ 18 సంస్థ ప్రారంభ‌మైంది. అయితే మొద‌ట్లో ఆ పేరు లేదు. మొద‌ట ఎస్‌జీఏ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ పేరిట ప్రారంభ‌మైన ఈ సంస్థ 2006 ఏప్రిల్ నెల‌లో నెట్వ‌ర్క్ 18 ఫిన్‌క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు మార్చుకుంది. త‌ర్వాత ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. తదనంత‌ర ప‌రిణామాల రీత్యా నెట్‌వ‌ర్క్ 18, టీవీ18గా విడిపోయింది. అప్ప‌టి నుంచి నెట్వ‌ర్క్ 18 డిజిట‌ల్‌, ప‌బ్లిషింగ్ వ్యాపారాన్ని టీవీ 18 టెలివిజ‌న్ వ్యాపారాన్ని చూస్తూ వ‌చ్చింది.

బిజినెస్ న్యూస్ చాన‌ళ్లు

బిజినెస్ న్యూస్ చాన‌ళ్లు

రిల‌య‌న్స్ మొత్తం త‌న ప్ర‌స్థానాన్ని ప్రాంతీయ చాన‌ళ్ల‌తో ప్రారంభించింది. త‌ర్వాత బిజినెస్ న్యూస్ చాన‌ళ్ల‌కు సైతం విస్త‌రించింది.

సీఎన్‌బీసీ టీవీ18 -ఆంగ్లం

సీఎన్‌బీసీ టీవీ18 ప్రైమ్ హెచ్‌డీ - ఆంగ్లం

సీఎన్‌బీసీ ఆవాజ్ - హిందీ

సీఎన్‌బీసీ బ‌జార్‌- గుజ‌రాతీ

జ‌న‌ర‌ల్ న్యూస్ చాన‌ళ్లు

జ‌న‌ర‌ల్ న్యూస్ చాన‌ళ్లు

సీఎన్ఎన్ న్యూస్ 18- ఆంగ్లం

న్యూస్ 18 ఇండియా- హిందీ

న్యూస్ 18- ఆంగ్లం

ప్రాంతీయ న్యూస్ చాన‌ళ్లు

ప్రాంతీయ న్యూస్ చాన‌ళ్లు

ఐబీఎన్‌-లోక్‌మ‌త్‌(మ‌రాఠి), ఈటీవీ ఉర్దూ(ఉర్దూ), న్యూస్ 18(పంజాబి, హిందీ), ఈటీవీ రాజ‌స్తాన్‌(రాజ‌స్తానీ,హిందీ), ఈటీవీ న్యూస్ గుజ‌రాతీ(గుజ‌రాతి), ఈటీవీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(హిందీ), ఈటీవీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(హిందీ), ఈటీవీ బీహార్‌-జార్ఖండ్‌(బోజ్‌పూరి), ఈటీవీ బంగ్లా(బెంగాలీ), ఈటీవీ న్యూస్ ఒడియా(ఓడియా), ఈటీవీ న్యూస్ క‌న్న‌డ‌(క‌న్న‌డ‌), న్యూస్‌18 కేర‌ళ‌(మ‌ళ‌యాళం), న్యూస్ 18 త‌మిళ‌నాడు(త‌మిళం), న్యూస్ 18 అస్సాం-నార్త్ ఈస్ట్(అస్సామీస్) వంటి ప‌లు భాష‌ల్లో 14 ప్రాంతీయ న్యూస్ చాన‌ళ్ల‌లో రిల‌య‌న్స్ విస్త‌రించింది.

ఇంకా న్యూస్ 18 గోవా(ఇంగ్లీష్‌,కొంక‌ణి), న్యూస్ 18 పంజాబి(పంజాబి), న్యూస్ 18 జ‌మ్మూ అండ్ కాశ్మీర్(కాశ్మీరీ, హిందీ) భాష్ల‌లో కొత్త చాన‌ళ్లు తెరిచేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి.

 వినోద ప‌రంగా

వినోద ప‌రంగా

హిందీ వినోదం - జ‌న‌ర‌ల్ చాన‌ళ్లు

  • క‌ల‌ర్స్-హిందీ
  • క‌ల‌ర్స్ హెచ్‌డీ- హిందీ
  • రిష్టీ-హిందీ

## హెచ్‌డీ-హై డెఫినెష‌న్‌

హిందీ భాష‌లో రిష్టీ సినీప్లెక్స్‌, రిష్టీ సినీప్లెక్స్ హెచ్‌డీ చాన‌ళ్లు ఉన్నాయి.

యూత్ ప‌రంగా చూస్తే ఎంటీవీ ఇండియా, ఎంటీవీ హెచ్‌డీ చానళ్లు ఉన్నాయి.

మ్యూజిక్ చాన‌ళ్ల‌లో ఎంటీవీ బీట్స్‌, ఎంటీవీ బీట్స్ హెచ్డీ, ఎంటీవీ ఇండీస్, వీహెచ్‌1, ఎక్స్ జోన్ వంటివి ఉన్నాయి.

ఆంగ్లంలో ప్ర‌త్యేకంగా కామెడి సెంట్ర‌ల్, కామెడి సెంట్ర‌ల్ హెచ్‌డీ, క‌ల‌ర్స్ ఇన్ఫినిటీ, క‌ల‌ర్స్ ఇన్ఫినిటీ హెచ్‌డీ వంట‌వి ఉన్నాయి.

 ప్ర‌త్యేకత సంత‌రించిన‌వి, వినోద‌, ఇత‌ర చాన‌ళ్లు

ప్ర‌త్యేకత సంత‌రించిన‌వి, వినోద‌, ఇత‌ర చాన‌ళ్లు

కిడ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

నిక్ హెచ్‌డీ ప్ల‌స్, నికెలోడియాన్‌, నిక్ జూనియ‌ర్‌, సోనిక్ వంటివి పిల్ల‌ల వినోదం కోసం ఉన్నాయి.

ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న వాటిలో ఆంగ్లంలో హిస్ట‌రీ టీవీ18, హిస్ట‌రీ టీవీ 18 హెచ్‌డీ, ఎఫ్‌వైఐటీవీ18 ; హిందీ భాష‌లో ఎపిక్‌, ఎపిక్ హెచ్డీ వంటివి ఉన్నాయి.

షాపింగ్ చాన‌ళ్ల‌లో హోం షాప్ 18 ప్ర‌త్యేకంగా రిల‌య‌న్స్ చేత ఆంగ్ల‌,హిందీ భాష‌ల్లో న‌డుస్తున్న‌ది.

ప్రాంతీయ ఎంట‌ర్‌టైన్మెంట్ సంబంధించి

ప్రాంతీయ ఎంట‌ర్‌టైన్మెంట్ సంబంధించి

ప్రాంతాల వారీగా క‌ల‌ర్స్ పేరుతో వివిధ భాష‌ల్లో రిల‌య‌న్స్ వినోద చాన‌ళ్ల‌ను న‌డుపుతోంది.

క‌ల‌ర్స్ మ‌రాఠి హెచ్‌డీ, క‌ల‌ర్స్ మ‌రాఠి, క‌ల‌ర్స్ క‌న్న‌డ‌, క‌ల‌ర్స్ క‌న్న‌డ హెచ్‌డీ, క‌ల‌ర్స్ సూప‌ర్‌, క‌ల‌ర్స్ బంగ్లా, క‌ల‌ర్స్ బంగ్లా హెచ్‌డీ, క‌ల‌ర్స్ ఒడియా, క‌ల‌ర్స్ గుజ‌రాతి పేర్ల‌తో 9 భాషల్లో చాన‌ళ్లను రిల‌య‌న్స్ సంస్థ‌కు చెందిన టీవీ18 క‌లిగి ఉంది.

ఇంకా క‌ల‌ర్స్ త‌మిళ్‌, క‌ల‌ర్స్ త‌మిళ్ హెచ్‌డీ18 పేర్ల‌తో రెండు త‌మిళ చాన‌ళ్ల‌ను తెస్తారు.

నెట్వ‌ర్క్ 18

నెట్వ‌ర్క్ 18

నెట్‌వ‌ర్క్ 18 డిజిట‌ల్ కంటెంట్లో సైతం త‌న‌దైన విస్త‌ర‌ణ‌ను క‌లిగి ఉంది. ఇందులో వివిధ న్యూస్‌, వినోదం, మార్కెట్‌, ఫైనాన్స్, ఆన్‌లైన్ షాపింగ్, టిక్కెట్ల కొనుగోలు, మొబైల్ ఫోన్ సేవ‌లు, అప్లికేష‌న్లు వంటివి ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేరుగా మొబైల్‌లోనే బిజినెస్ న్యూస్, వినోదం, టెక్నాల‌జీ, స్పోర్ట్స్‌, రిటైలేత‌ర షాపింగ్‌, టిక్కెట్ల‌కు త‌దిత‌ర సేవ‌ల‌ను వ్యాపారంగా చేస్తున్నారు.

దానికి ఉద్దేశించిన వెబ్‌సైట్లు నాలుగు ఉన్నాయి.

moneycontrol.com

firstpost.com

news18.com

commoditiescontrol.com

డిజిట‌ల్ కామ‌ర్స్ రంగంలో రిల‌య‌న్స్ ఏం చేస్తోంది...

డిజిట‌ల్ కామ‌ర్స్ రంగంలో రిల‌య‌న్స్ ఏం చేస్తోంది...

బుక్‌మైషో.కామ్ - 240 న‌గ‌రాల్లో, 2800 స్క్రీన్లు

హోంషాప్ 18- టీవీ, మొబైల్ ద్వారా హోంషాప్‌18.కామ్ షాపింగ్ స‌మాచారాన్ని అంద‌జేస్తున్న‌ది.

బ‌ర్ప్ పేరిట ఫుడ్‌, రెస్టారెంట్ల‌ను సూచించే ఒక వెబ్‌సైట్ ఉంది. బార్లు, లాంజ్‌లు వంటివీ ఉంటాయి.

ఆన్‌లైన్ ట్రావెల్ పోర్ట‌ల్ యాత్రా సైతం నెట్‌వ‌ర్క్ 18 ఆధ్వ‌ర్యంలో రిల‌య‌న్స్ కిందే ప‌నిచేస్తోంది.

టాప‌ర్ లెర్నింగ్ పేరిట క వెబ్‌సైట్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ప‌లు రాష్ట్ర సిల‌బ‌స్‌ల‌కు చెందిన విద్యా స‌మాచారాన్ని అందిస్తున్నారు.

సీఏప్రిప్‌18 పేరిట మ‌రో వెబ్సైట్ సీఏ చ‌దువుతున్న వారి కోసం ఉప‌యోగ‌ప‌డేలా ఉంది.

నెట్‌వ‌ర్క్ 18 గురించి స‌మ‌గ్రంగా

నెట్‌వ‌ర్క్ 18 గురించి స‌మ‌గ్రంగా

ప్ర‌ధాన కార్యాల‌యం- నోయిడా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,ఇండియా

ముఖ్య‌మైన వ్య‌క్తి(చైర్మ‌న్)- ఆదిల్ జైనుల్ భాయ్‌

సంస్థ రెవెన్యూ(2016లో)- రూ. 3403 కోట్లు

ఉద్యోగుల సంఖ్య‌-7500

English summary

అమ్మో! -రిల‌య‌న్స్ మీడియా రంగంలో సైతం ఇంతలా ఉందా! | How mukesh ambani owned Media by Network 18 group

Network 18 is an Indian mass media company which is owned and operated by Reliance Industries. Headquartered in Noida, India, it has interests in television, print, internet, film, mobile content and allied businesses.
Story first published: Friday, September 1, 2017, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X