For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైజాగ్‌లో 8 కంపెనీల‌ను ప్రారంభించిన ఐటీ మంత్రి లోకేశ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ మంత్రి, ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా లోకేశ్ గురువారం టెక్ మ‌హీంద్రా ప్రాంగ‌ణంలో 8 ఐటీ కంపెనీల‌ను ప్రారంభించారు. ఇక్క‌డ ఐటీ కంపెనీల‌ను ప్రారంభించేందుకు వీలుగా టెక్ మ‌హీంద్రా నుంచి టెక్

|

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ మంత్రి, ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా లోకేశ్ గురువారం టెక్ మ‌హీంద్రా ప్రాంగ‌ణంలో 8 ఐటీ కంపెనీల‌ను ప్రారంభించారు. ఇక్క‌డ ఐటీ కంపెనీల‌ను ప్రారంభించేందుకు వీలుగా టెక్ మ‌హీంద్రా నుంచి టెక్ హ‌బ్ భ‌వ‌నాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం లీజ్‌కు తీసుకుంది. 900 ఉద్యోగాల‌ను క‌ల్పించే విధంగా అజ్మూర్‌, డిజిప‌బ్ అపెక్స్‌, ఐటీ అన‌లిటిక్స్‌, ఇన్సూరెన్స్ బాక్స్‌, ఇన్వెంట్రాక్స్, వీజీఎస్‌-ప్రోగ్విల్‌, వ‌ర్చువ‌ల్ ఆఫ్‌షోర్‌, విస్మ‌యా ప్రీమీడియా కంపెనీలు ప్రారంభ‌మ‌య్యాయి.

 ఈ భ‌వ‌నంలో 8 ఐటీ కంపెనీలు

ప్రారంభ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ వ‌చ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో 1 ల‌క్ష ఐటీ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని అన్నారు. అందులో 70 వేల ఉద్యోగాలు విశాఖ‌ప‌ట్నంలో వ‌స్తాయ‌న్నారు. ప్ర‌స్తుతం రూ.2వేల కోట్ల వ‌ద్ద ఉన్న ఐటీ ఎగుమ‌తుల‌ను 10 రెట్లు పెంచేందుకు ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న్నారు. 2019 నాటికి ఇక్క‌డ ఉన్న క‌పులఉప్పాడ ప్రాంతాన్ని ఐటీ ఉద్యోగాల‌కు అనువుగా తీర్చిదిద్దుతామ‌ని, ఐటీ ఉద్యోగుల నివాస ప్రాంతాలు సైతం ఇక్క‌డే ఉండేలా చూస్తామ‌ని అన్నారు. ఐటీ కంపెనీల‌ను ప్రారంభించేందుకు అనువైన భ‌వనాల‌ను నిర్మించేలా డెవ‌ల‌ప‌ర్ల కోసం, ఐటీ కంపెనీల కోసం టెక్నాల‌జీ పాలసీ తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు.

Read more about: vizag it companies
English summary

వైజాగ్‌లో 8 కంపెనీల‌ను ప్రారంభించిన ఐటీ మంత్రి లోకేశ్‌ | 8 IT companies started in Visakhapatnam

: Andhra Pradesh IT Minister and the son of Chief Minister N. Chandrababu Naidu, N. Lokesh, inaugurated eight IT companies here on Thursday in a building on the premises of TechMahindra.
Story first published: Thursday, August 24, 2017, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X