For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఐపీవో

దాదాపు రూ.7500 కోట్ల నిధుల‌ను సేక‌రించాల‌నేది ప్ర‌ణాళిక. ఈ ఐపీవోలో దాదాపు 9.55% కంపెనీ వాటాకు స‌మాన‌మైన హెఛ్డీఎఫ్‌సీ లిమిటెడ్ నుంచి 19,12,46,050 షేర్ల‌ను ఈక్విటీల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

|

దేశంలో ప్ర‌యివేటు బీమా రంగంలో రెండో అతిపెద్ద సంస్థ‌గా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైప్ ఐపీవోకి వ‌చ్చింది. అంటే మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ కానుంది. మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ సెబీ వ‌ద్ద డ్రాప్ట్ పేపర్స్ ఫైల్ చేసింది. దీని ద్వారా దాదాపు రూ.7500 కోట్ల నిధుల‌ను సేక‌రించాల‌నేది ప్ర‌ణాళిక. ఈ ఐపీవోలో దాదాపు 9.55% కంపెనీ వాటాకు స‌మాన‌మైన హెఛ్డీఎఫ్‌సీ లిమిటెడ్ నుంచి 19,12,46,050 షేర్ల‌ను ఈక్విటీల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంకా మారిష‌స్ చెందిన స్టాండ‌ర్డ్ లైప్ వాటాగా ఉన్న 5.42%కు స‌మానమైన 10,85,81,768 షేర్ల‌ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

 హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఐపీవో

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ అనే బీమా సంస్థ‌లో ఇప్ప‌టికి హెచ్‌డీఎఫ్‌సీ దాదాపు 61.41% వాటాను, స్టాండ‌ర్డ్ లైప్ 35% వాటాను క‌లిగి ఉండ‌గా, మిగిలిన వాటా ఉద్యోగులు, ప్రేమ్‌జీఇన్వెస్ట్ చేతిలో ఉన్నాయి. మార్కెట్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఐపీవో విలువ రూ.7500 కోట్లుగా ఉండొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ సెబీ వ‌ద్ద డ్రాప్ట్ ఐపీవోల‌ను స‌మ‌ర్పించిన మూడో బీమా కంపెనీ ఇది. మిగిలిన రెండూ న్యూఇండియా అస్సూరెన్స్ కంపెనీ, జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా.
ఈ బీమా సంస్థ ఐపీవో ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ బ్రాండ్ పేరును పెంచుకోవ‌డంతో పాటు ఉన్న వాటాదారుల‌కు లిక్విడిటీని పెంచేందుకు అవకాశ‌మిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంత‌ర్జాతీయ కో-ఆర్డినేట‌ర్లుగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, యూకేకు చెందిన స్టాండ‌ర్డ్ లైఫ్‌, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, క్రెడిట్ స్యూజ్ సెక్యూరిటీస్‌(ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్‌, సీఎల్ఎస్ఏ ఇండియా, నోమురా ఫైనాన్సియ‌ల్ అడ్వైజ‌రీ అండ్ సెక్యురిటీస్‌(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఉండ‌గా; ఈ ఇష్యూకు లీడ్ మేనేజ‌ర్లుగా ఎడ్లెవిసిస్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌, హైటాంగ్ సెక్యూరిటీస్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్‌, యూబీఎస్ సెక్యూరిటీస్ ఉన్నాయి.

Read more about: ipo ఐపీవో
English summary

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఐపీవో | HDFC Standard Life Files IPO Papers With Sebi

Currently, HDFC owns 61.41 per cent stake in HDFC Standard Life and Standard Life has about 35 per cent, while the remaining is with employees and PremjiInvest. According to sources, the initial public offer (IPO) is expected to be worth Rs 7,500 crore.
Story first published: Saturday, August 19, 2017, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X