For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ఫోన్ బీటా టెస్టింగ్‌: ప‌్రీ బుకింగ్ ఎలా?

జియో ఫోన్ అతి త‌క్కువ ధ‌ర‌లో మంచి 4జీ ఫీచ‌ర్ ఫోన్‌. రూ1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో దీన్ని వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నారు. దీనిని మొద‌ట బుకింగ్ చేసుకున్న వారికి మాత్ర‌మే ఇస్తారు. దీని బుకింగ్ ఎలా చేయ

|

జియో ఓరిజిన‌ల్ ఫోన్ బుకింగ్ ఆగ‌స్టు 24నుంచి మొద‌లవుతున్న‌ప్ప‌టికీ ఆగ‌స్టు 15 నుంచి బీటా టెస్టింగ్ ప్రారంభ‌మ‌వుతోంది. మార్కెట్లో అందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్ అతి త‌క్కువ ధ‌ర‌లో మంచి 4జీ ఫీచ‌ర్ ఫోన్‌. రూ1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో దీన్ని వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నారు. దీనిని మొద‌ట బుకింగ్ చేసుకున్న వారికి మాత్ర‌మే ఇస్తారు. దీని బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

రిటైల్ స్టోర్‌లో అయితే

రిటైల్ స్టోర్‌లో అయితే

జియో రిటైల్ స్టోర్‌లో ఎవ‌రైనా ఆధార్ సాయంతో ఫోన్ బుక్ చేసుకోవ‌చ్చు. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు న‌క‌లు ఇవ్వాలి. మీ ఆధార్ నంబ‌రుతో వారు ఫోన్ బుక్ చేస్తారు.వినియోగదారుడు ఆధార్ నంబర్ చెప్పి ఫోన్ బుక్ చేసుకోగానే ఒక టోకెన్ జారీ అవుతుంది. దాన్ని ఉపయోగించి తన ఫోన్ డెలివరీ స్టేటస్ ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇక ఆ తరువాత యూజర్ తన ఆధార్ నంబర్‌తో మళ్లీ జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆర్డర్ చేయలేడు.

జియో వెబ్‌సైట్

జియో వెబ్‌సైట్

జియో వెబ్‌సైట్‌లో Keep me posted అనే లింక్ పైన క్లిక్ చేయాలి. త‌ర్వాత ఒక లింక్ ఓప‌న్ అవుతుంది. అక్క‌డ పేరు, మెయిల్ ఐడీ, ఫోన్‌ నంబ‌రు, పిన్ కోడ్ వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. కావాల్సిన వివ‌రాలు న‌మోదు చేసి స‌బ్ మిట్ చేయాలి. మీ ఫోన్ బుకింగ్ అభ్య‌ర్థ‌న పూర్త‌వుతుంది.

ఎస్ఎంఎస్ ద్వారా జియో ఫోన్ బుకింగ్

ఎస్ఎంఎస్ ద్వారా జియో ఫోన్ బుకింగ్

"JP<>your area PIN code<>Jio Store code near your locality ఈ విధ‌మైన మెసేజ్‌ను 7021170211 నంబరుకు మెసేజ్ పంపాలి. త‌ర్వాత రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. డెలివ‌రీ సంబంధించిన వివ‌రాలు సైతం మీ మెయిల్‌కు వ‌స్తాయి.

ఫోన్ బుకింగ్‌-డెలివ‌రీ

ఫోన్ బుకింగ్‌-డెలివ‌రీ

ముంద‌స్తు బుకింగ్స్ ఎంపిక చేసిన రిల‌య‌న్స్ స్టోర్ల‌లో దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభ‌మ‌వుతాయి.

ఇప్పుడు ఫోన్ కోసం ఆర్డ‌ర్ చేసిన వారికి సెప్టెంబ‌రు 1 నుంచి సెప్టెంబ‌రు 4 మ‌ధ్య డెలివ‌రీ అందుతుంద‌ని జియో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే జియో ఫీచ‌ర్ ఫోన్లో వేరే కంపెనీ సిమ్ ప‌నిచేయ‌దు.

డిపాజిట్

డిపాజిట్

జియో ఫోన్ ఉచితం అని చెబుతున్న‌ప్ప‌టికీ మీరు మాత్రం రూ.1500 రీఫండ‌బుల్ డిపాజిట్ క‌ట్టాల్సిందే. అయితే జియో రిటైల్ స్టోర్‌లో ఫోన్ తీసుకునేట‌ప్పుడు ఈ డిపాజిట్ ఇవ్వాలి. ఆన్లైన్ వ‌స్తువులు కొనుగోలు స‌మ‌యంలో క్యాష్ ఆన్ డెలివ‌రీ లాగా మీరు డ‌బ్బిచ్చి ఫీచ‌ర్ పోన్ తీసుకోవాలి. మొద‌ట బుక్ చేసేట‌ప్పుడే సొమ్ము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

Read more about: jio jio phone reliance jio
English summary

జియో ఫోన్ బీటా టెస్టింగ్‌: ప‌్రీ బుకింగ్ ఎలా? | JIO phone booking started how to pre-book 4g jio feature phone

The much-awaited JioPhone was made available for beta testing from August 15, although the actual bookings will commence from August 24. The widely anticipated JioPhone is a 4G feature that comes with an "effective zero price". JioPhone will be given to users at a security deposit of Rs. 1,500
Story first published: Wednesday, August 16, 2017, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X