For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారెన్ బ‌ఫెట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

ఒక విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌గానే కాకుండా దాతృత్వంలోనూ దిట్ట అని ఆయ‌న నిరూపించుకున్నారు. ఆయ‌న గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం...

|

ప్ర‌పంచ కుబేరుల వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వారెన్ బ‌ఫెట్ పేరు లేనిదే ఆ చ‌ర్చ పరిస‌మాప్తం కాదు. వారెన్ బ‌ఫెట్ పెట్టుబ‌డుల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించారు. ఒక విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌గానే కాకుండా దాతృత్వంలోనూ దిట్ట అని ఆయ‌న నిరూపించుకున్నారు. ఆయ‌న గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం...

1. 11 ఏళ్ల వ‌య‌సులో షేర్ కొనుగోలు

1. 11 ఏళ్ల వ‌య‌సులో షేర్ కొనుగోలు

11 ఏళ్ల‌లో షేర్ కొన్న‌ప్ప‌టి నుంచీ ప్ర‌పంచ కుబేరుల జాబితాలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ ప్ర‌తి అడుగూ చాలా మెల‌కువ‌తో, ముందుచూపుతో వేసిందే. మొట్ట‌మొద‌టిసారి చాలా చిన్న వ‌య‌సు 11 సంవ‌త్స‌రాల‌ప్పుడు ఆయ‌న షేర్ల‌ను కొన‌డం మొద‌లుపెట్టాడు. మామూలుగా ఆ వ‌య‌సులో అంద‌రూ కామిక్స్ బుక్స్ చ‌ద‌వ‌డం, బ‌యట ఇష్ట‌మొచ్చిన ఆట‌లు ఆడుకుంటూ ఉండ‌గా ఆయ‌న విభిన్నంగా ఆలోచించారు.

 2. 16 ఏళ్ల వ‌య‌సుక‌ల్లా 53,000 డాల‌ర్ల సంపాద‌న‌

2. 16 ఏళ్ల వ‌య‌సుక‌ల్లా 53,000 డాల‌ర్ల సంపాద‌న‌

చిన్న వ‌య‌సు నుంచి క‌ష్ట‌ప‌డుతూనే పెరిగాడు బ‌ఫెట్‌. అత‌ని కుటుంబం ఓమాహాకు వెళ్లిన‌ప్ప‌టికీ జీవ‌నాధారం కోసం ఏదో ఒక‌టి చేసే వాడు. అలా వాషింగ్ట‌న్ న్యూస్‌పేపేర్‌ను ఉద‌యాన్నే ఇంటింటా ద‌గ్గ‌రా వేయడం ద్వారా నెల‌కు 175 డాల‌ర్లు సంపాదించాడు. అలా చేసిన సంపాద‌న ఆ స‌మ‌యంలో కొంత మంది ఉపాధ్యాయుల కంటే ఎక్కువ కావడం విశేషం. వారెన్ బ‌ఫెట్ 16 ఏళ్ల వ‌య‌సు నాటికి వివిధ వ్యాపారాల‌ను నెల‌కొల్ప‌డం, పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా 53,000 డాల‌ర్లు సంపాదించారు.

3. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్

3. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్

నెబ్రాస్కా విశ్వ‌విద్యాల‌యంలో మూడేళ్ల చ‌దువు త‌ర్వాత బ‌ఫెట్ హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేశాడు. అయితే హార్వ‌ర్డ్ స్కూల్ ఇంట‌ర్వూ త‌ర్వాత దాని గురించి మ‌ర్చిపోవాల‌ని ఇక్క‌డ సీట్ దొర‌క‌ద‌ని అక్క‌డి సిబ్బంది చెప్పారు. అక్క‌డ నుంచి వెనుదిరిగిన త‌ర్వాత కొలంబియా బిజినెస్ స్కూల్ ప్రొఫెస‌ర్ల‌యిన డేవిడ్ డోడ్, బెంజ‌మిన్ గ్రాహ‌మ్‌ల గురించి తెలుసుకున్నారు. వారి స‌హ‌చ‌ర్యం ద్వారా ఎన్నో పెట్టుబ‌డి పాఠాలు నేర్చుకున్నారు.

4. తిండి ర‌హ‌స్యం

4. తిండి ర‌హ‌స్యం

బ‌ఫెట్ చాలా య‌వ్వ‌నంగా క‌నిపించేందుకు కార‌ణం కోకో-కోలా, ఐస్ క్రీమ్ అట‌.

ఫార్చూన్ ముఖాముఖిలో ఆయ‌న చెప్పిన ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఒక రోజులో 2700 కేల‌రీలు తీసుకుంటే అందులో ఒక క్వార్ట‌ర్ కోకో-కోలా ఉంటుంద‌ట‌. ప్ర‌తి రోజూ 12 ఔన్సుల వారీగా ఐదుసార్లుగా డ్రింక్ తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. ఒక క్యాన్ వుట్జ్ పొటాటో స్టిక్‌ల‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా అప్పుడప్పుడు తీసుకునేందుకై ఆస‌క్తిచూపుతారంట‌. ఇలా తీపి, ఉప్ప ప‌దార్థాలు తింటూ ఎలా ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతున్నారని అడిగితే మ‌ర‌ణ రేటు 6 ఏళ్ల పిల్ల‌లో త‌క్కువ ఉంటుంద‌ని నేను తెలుసుకుని వాళ్ల‌లా తిన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని స‌మాధాన‌మిచ్చారంట‌.

5. 1958 నుంచి ఒకే ఇంటిలో

5. 1958 నుంచి ఒకే ఇంటిలో

బిలియ‌నీర్ అన‌గానే పెద్ద భ‌వంతుల్లో , ఖ‌రీదైన విల్లాల్లో ఉంటారని అనుకుంటారు. బ‌ఫెట్ విష‌యంలో అది నిజం కాదు. ఓమాహా హౌస్‌లో 1958 నుంచి ఇప్ప‌టికీ నివసిస్తున్నారు. దాన్ని మొద‌ట్లో 31,500 డాల‌ర్ల‌కు కొన్నారు. అందులో 5 బెడ్ రూంలు, 2.5 బాత్‌రూం హౌస్ ఉన్నాయి.

6. నువ్వు విఫ‌లం అవుతావ‌ని బ‌ఫెట్ మామ చెప్పారు

6. నువ్వు విఫ‌లం అవుతావ‌ని బ‌ఫెట్ మామ చెప్పారు

1951లో బ‌ఫెట్ అత‌డి కాబోయే భార్య‌కు ప్ర‌పోజ్ చేయ‌గానే బ‌ఫెట్ మామ అత‌నితో మాట్లాడాల‌ని చెప్పి పిలిపించుకున్నారు. అప్పుడు బఫెట్ అత‌డి భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల గురించి వివ‌రించి చెప్పారు. చివ‌ర్లో ఆయ‌న మామ నీ ప్ర‌ణాళిక‌లు విఫ‌లం అవుతాయ‌ని చెప్పారు. నిజానికి ప్ర‌తి దానిలో బ‌ఫెట్ విజ‌యం సాధించుకుంటూ వెళ్లారు.

7. బ‌ఫెట్‌తో లంచ్ కోసం ల‌క్ష‌లు చెల్లిస్తారు

7. బ‌ఫెట్‌తో లంచ్ కోసం ల‌క్ష‌లు చెల్లిస్తారు

ప్ర‌పంచంలోనే అతి సంప‌న్నుల్లో ఒక‌రైన బ‌ఫెట్‌తో లంచ్ అంటే ఎంతో మంది ఎగ‌బ‌డ‌తారు. ఎందుకంటే ఆ స‌మ‌యంలో అత‌డి ప‌రిచ‌యంతో ఎంతో నేర్చుకోవ‌చ్చ‌నేది త‌ప‌న‌. ఒక్కోసారి బ‌ఫెట్‌తో లంచ్‌కు సంబంధించి బిడ్ నిర్వ‌హిస్తే అది 3.4 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. 2000 సంవ‌త్స‌రం నుంచి నిధుల సేక‌ర‌ణ కోసం ఈబేలో ఈ త‌ర‌హా ఈ-లంచ్ బిడ్డింగ్ జ‌రుపుతున్నారు. 2012,2016 సంవ‌త్స‌రాల్లో అత‌డితో క‌లిసి లంచ్ చేసేందుకు 3.4 మిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ స్పంద‌న వ‌చ్చింది.

 8. ఒక రోజుకు 37 మిలియ‌న్ డాల‌ర్లు

8. ఒక రోజుకు 37 మిలియ‌న్ డాల‌ర్లు

2013లో బ‌ఫెట్ రోజు సంపాద‌న తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. అంత‌కుముందు ఏడాదిలో 46 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న బ‌ఫెట్ సంప‌ద 2013 చివ‌రికి 59 బిలిల‌య‌న్ డాల‌ర్ల‌కు చేరింది. అంటే 2013లో స‌గ‌టున రోజుకు 37 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు లెక్క‌.

9. 94% సంప‌ద అత‌డు 60 ఏళ్ల త‌ర్వాత సంపాదించిందే...

9. 94% సంప‌ద అత‌డు 60 ఏళ్ల త‌ర్వాత సంపాదించిందే...

చాలా మంది య‌వ్వ‌నంలోనే బాగా సంపాదించాలంటారు. అది బ‌ఫెట్ విష‌యంలో మాత్రం కాదు. విజ‌యం ఏ వ‌య‌సులోనైనా వ‌రించ‌వ‌చ్చు. చాలా వ‌ర‌కూ 60 కంటే ముందే బ‌ఫెట్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ సంప‌ద మాత్రం 60 త‌ర్వాత కూడా బాగా పెరిగింది. ఆయ‌న‌కు 52 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఉన్న సంప‌ద విలువ 376 మిలియ‌న్ డాల‌ర్లు. 60 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న సంపద విలువ 3.8 బిలియ‌న్ డాల‌ర్లు కాగా ప్ర‌స్తుతం 77.3 బిలియ‌న్ డాల‌ర్లుకు పైగా ఉంది.

10. వారెన్ బ‌ఫెట్ పెద్ద‌గా ట్విట్ట‌ర్ వాడ‌రు

10. వారెన్ బ‌ఫెట్ పెద్ద‌గా ట్విట్ట‌ర్ వాడ‌రు

వారెన్ బ‌ఫెట్ ట్విట్ట‌ర్ ఖాతాను 2013 ఏప్రిల్‌లో తెరిచారు. దాదాపు 1.3 మిలియ‌న్ స‌భ్యులు ఆయ‌న్ను అనుస‌రిస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన ట్వీట్ల సంఖ్య కేవ‌లం 9 మాత్ర‌మే. అయితే అవి ఏవీ కూడా ఆయ‌న రాయ‌లేద‌ట‌. ఆయ‌న ఫ్రెండ్ ఈ ట్వీట్ స‌మాచారాన్ని రాసి పోస్ట్‌ చేశార‌ట‌. స్వ‌త‌హాగా ఆయ‌న ఏదీ ట్వీట‌లేద‌ని సీఎన్‌బీసీ ఇంట‌ర్వూలో చెప్పారు.

11. బ‌ఫెట్ ఒక్క సూట్ కొన‌లేద‌ట‌

11. బ‌ఫెట్ ఒక్క సూట్ కొన‌లేద‌ట‌

వారెన్ బ‌ఫెట్‌కు మొత్తం 20 సూట్లు ఉన్నా, ఒక్క‌టీ డ‌బ్బు పెట్టి కొన‌లేదంట‌. విచిత్రం ఏమిటంటే వాటి తయారీ వెనుక ఉన్న ఒకే ఒక్క డిజైన‌ర్ మేడ‌మ్ లీ. ఒక‌సారి చైనా ట్రిప్‌కు బ‌ఫెట్ వెళ్లిన‌ప్పుడు అరుదైన ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు వ్య‌క్తులు ఆయ‌న గ‌దికి వ‌చ్చి కొల‌త‌లు తీసుకున్నారు. ఒక పుస్త‌కం తీసుకుని సూట్ ర‌కాల‌ను చూపించారు. ఇందులో నుంచి మేడ‌మ్ లీ ఒక సూట్ ఎంపిక చేసుకోమ‌న్నార‌ని చెప్పారు. ఆమెను క‌ల‌వ‌కుండానే బ‌ఫెట్ ఒక సూట్‌ను ఎంచుకున్నారు. త‌ర్వాత మ‌రోటి తీసుకున్నారు. త‌ర్వాత మేడ‌మ్ లీ, బ‌ఫెట్ మ‌ధ్య ఒక విధ‌మైన ప్రొఫెష‌న‌ల్ బాండింగ్ ఏర్ప‌డింది. త‌ర్వాత అప్పుడ‌ప్పుడు ఆమే బ‌ఫెట్‌కు సూట్స్ పంప‌డం జ‌రిగింది. బ‌ఫెట్ కంపెనీ వార్షిక స‌మావేశాల‌కు సైతం లీ హ‌జ‌రయ్యారు. త‌ర్వాత‌ర్వాత బిల్ గేట్స్ లాంటి వారికి సైతం ఆమె సూట్ల‌ను త‌యారుచేసి ఇచ్చారు.

12. రోజులో ఆయ‌న ఎక్కువ సేపు ఏం చేస్తారు?

12. రోజులో ఆయ‌న ఎక్కువ సేపు ఏం చేస్తారు?

విజ‌య‌వంత‌మైన వ్య‌క్తుల్లో ఏ ఏ అలవాట్లు విభిన్నంగా ఉన్నాయి, వారు రోజూ ఏం చేస్తార‌నే విష‌య‌మై చాలా మందికి ఆస‌క్తి ఉంటుంది. వారెన్ బ‌ఫెట్ విష‌యంలో అయితే రోజులో 80% స‌మ‌యం ఆయ‌న చ‌దివేందుకు కేటాయిస్తారు. రోజు ఉద‌యం లేవ‌గానే ప‌త్రిక చ‌ద‌వ‌డంతో మొద‌ల‌వుతుంది. ఇక ఇంట‌ర్వ్యూలో మీ విజ‌యానికి ముఖ్య కార‌ణం ఏంట‌ని అడ‌గ్గా, రోజులో క‌నీసం 500 పేజీలు చ‌దువుతుంటాన‌ని చెప్పారు.

13. బెర్క్‌షైర్ హాత్‌వే

13. బెర్క్‌షైర్ హాత్‌వే

వారెన్ బ‌ఫెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఆయ‌న కంపెనీ గురించి తెలిసింది త‌క్కువ మందికే. ఆ కంపెనీని విఫ‌ల‌మైన వ‌స్త్ర త‌యారీ నుంచి ప్ర‌పంచంలో పెద్ద కంపెనీగా తీర్చిదిద్దడంలో ఆయ‌న ఎంతో శ్ర‌మించారు. ప్ర‌పంచంలో ఈ కంపెనీ 6వ అతిపెద్ద కంపెనీ.

14. ఉప‌యోగించే ఫోన్ - నోకియా

14. ఉప‌యోగించే ఫోన్ - నోకియా

2013 సీఎన్ఎన్ ఇంట‌ర్వ్యూలో బ‌ఫెట్ ప‌లు కొత్త విషయాలు చెప్పారు. పీర్స్ మోర్గాన్ ఇంట‌ర్వ్యూలో బ‌ఫెట్ రాజ‌కీయాల నుంచి టెక్నాల‌జీ వ‌ర‌కూ చాలా విష‌యాల‌పై త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఆ స‌మ‌యంలోనే అప్ప‌టికీ తాను నోకియా ఫ్లిప్ ఫోన్ ఉప‌యోగిస్తున్నాన‌ని చెప్పారు.

 15. ప్ర‌తి ఆదివారం 12 మంది పిల్ల‌ల‌తో

15. ప్ర‌తి ఆదివారం 12 మంది పిల్ల‌ల‌తో

డైరీ క్వీన్ అనే పాలు, పాల ఉత్ప‌త్తుల సంస్థ బ‌ఫెట్ సొంతం. ప్ర‌తి ఆదివారం 12 మంది త‌న మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు, వారి స్నేహితుల‌తో డైరీ క్వీన్‌కు వెళ‌తారు. అప్పుడు వారంతా ఏం చేస్తారో చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తారు. అప్పుడు వారు ఐ-ఫోన్ల‌ను ఎలా వాడుతున్నారో తెలుసుకుంటారు. వారంతా అందులో ఏం చేస్తున్నార‌ని అడుగుతారంట‌.

Read more about: warren buffet billionaires
English summary

వారెన్ బ‌ఫెట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు | Interesting things to know about warren buffet

From buying his first stock at age 11 to having his face on Cherry Coke cans in China, these Warren Buffett facts might surprise you.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X