English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

10 ఉత్త‌మ టెక్ కంపెనీలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఎక‌న‌మిక్ టైమ్స్ ఒక అధ్య‌య‌న సంస్థ సాయంతో దేశంలో ప‌నిచేసేందుకు 15 మంచి కంపెనీల జాబితాను రూపొందించింది. కెరీర్ గ్రోత్, మంచి బృంద నిర్వ‌హ‌ణ‌, కంపెనీ ఉద్యోగుల‌ను చూసుకునే తీరు, ఉద్యోగుల‌కు చెల్లించే ప్ర‌యోజ‌నాలు వంటి వాటిని ఆధారంగా తీసుకుని ఉద్యోగుల అభిప్రాయాల‌ను సేక‌రించారు. ప‌ని ప్ర‌దేశంలో వారు ఉద్యోగాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, మిగ‌తా కంపెనీల‌కు దీనికి ఏ విధంగా ప్ర‌త్యేక‌త ఉంది వంటి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఆయా ఉద్యోగుల‌కు సంధించారు. వారు చెప్పిన‌ స‌మాధానాల ఆధారంగా వ‌చ్చిన 10 మంచి టెక్నాల‌జీ కంపెనీల జాబితాను చూడండి.

1. ఇంట్యూట్ ఇండియా

1. ఇంట్యూట్ ఇండియా

ర్యాంకు: 1

స్థాప‌న‌: 2005

ఉద్యోగుల సంఖ్య‌: 948

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1:3.21

దేశంలో లెస్బియ‌న్‌, స్వ‌లింగ సంప‌ర్కులు, లింగ మార్పిడి హక్కుల గురించి చాలా బ‌హిరంగంగా మాట్లాడేందుకు అవ‌కాశ‌మిస్తున్న కంపెనీల్లో ఇది ఒక‌టి. వినియోగ‌దారుల స‌మ‌స్య‌లు, సృజ‌నాత్మ‌క‌త కోసం ఆఫీసు స‌మ‌యంలో 10 శాతం స‌మ‌యాన్ని ప్ర‌త్యేకంగా కేటాయిస్తుంది.

2. గూగుల్ ఇండియా

2. గూగుల్ ఇండియా

ర్యాంకు: 3

స్థాప‌న‌: 2004

ఉద్యోగుల సంఖ్య‌: 1863

మంచి టీమ్ గురించి తెలుసుకునేందుకు గాను గూగుల్ ఈ మ‌ధ్య గూగ్ల‌ర్స్ ఆఫ్ గూగ్ల‌ర్స్ అనే ఒక అధ్య‌యన ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ప్రాజెక్ట్ ఆక్సిజ‌న్‌తో స్పూర్తి పొందిన ఈ టెక్నాల‌జీ సంస్థ మంచి మేనేజ‌ర్లు అవ్వాలంటే ఏం కావాల‌నే దాన్ని తెలుసుకుంది. 200 టీమ్స్ మీద 200 విధాలుగా జ‌ట్టు ప‌నితీరును తెలుసుకునేందుకు 200 ఇంట‌ర్వూల‌ను నిర్వ‌హించారు.

3. శాప్ ల్యాబ్స్ ఇండియా

3. శాప్ ల్యాబ్స్ ఇండియా

ర్యాంకు: 5

స్థాప‌న‌: 1998

ఉద్యోగుల సంఖ్య‌: 6489

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1: 1.93

వ్య‌వస్థాప‌క‌త‌ను నెల‌కొల్పే దిశ‌గా శ్యాప్ ల్యాబ్స్ బాగా కృషి చేస్తోంది.

4. అడోబ్ ఇండియా

4. అడోబ్ ఇండియా

ర్యాంకు: 6

స్థాప‌న‌: 1997

ఉద్యోగుల సంఖ్య‌: 4875

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1: 3.36

సంతానం క‌లిగిన త‌ర్వాత ఉద్యోగం మానేసిన మ‌హిళ‌ల‌ను తిరిగి సంస్థ‌లోకి తెచ్చుకునేందుకు ఈ కంపెనీ ప్ర‌య‌త్నిస్తోంది. మెట‌ర్నిటీ లీవ్ పైన బ‌య‌ట‌కు వెళ్లిన వారికి జ‌త‌గా బ‌డ్డీస్ అనే పేరుతో ఒక్కో ఉద్యోగిని అసైన్ చేశారు. వీరి ప‌నేంటంటే వారిని మ‌ళ్లీ కంపెనీలో చేర్చ‌డం. అంతే కాకుండా ఎక్కువ మంది మ‌హిళ‌ల‌ను కంపెనీలో చేర్చుకునేందుకు కంపెనీ ల‌క్ష్యం పెట్టుకుంది.

5. నెట్‌యాప్ ఇండియా

5. నెట్‌యాప్ ఇండియా

ర్యాంకు: 7

స్థాప‌న‌: 2001

ఉద్యోగుల సంఖ్య‌: 1536

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1: 3.56

ఇదివ‌ర‌కే సంస్థ‌లో ఉద్యోగుల గురించి కేర్ తీసుకోవ‌డ‌మే కాకుండా కొత్త టాలెంట్‌ను తెచ్చుకునే దానిపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఐఐటీ గౌహ‌తి, ఐఐటీ బెంగుళూర్ అధ్యాప‌కుల‌తో క‌లిసి ప‌నిచేస్తోంది. ఆయా సంస్థ‌ల్లో డేటా మేనేజ్‌మెంట్‌, క్లౌడ్ సంబంధిత కంటెంట్‌తో పాటు స్టోరేజీని పెంచేందుకు కృషి చేస్తున్న‌ది.

 6.టెలిప‌ర్‌ఫార్మెన్స్ ఇండియా

6.టెలిప‌ర్‌ఫార్మెన్స్ ఇండియా

ర్యాంకు: 8

స్థాప‌న‌: 2001

ఉద్యోగుల సంఖ్య‌: 8302

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1: 2.56

రెండేళ్ల క్రితం వార్షిక ప‌నితీరు మ‌దింపును టెలిప‌ర్‌ఫార్మెన్స్ వ‌దిలిపెట్టేసింది. ప్ర‌స్తుతం నెల‌వారీ, పార‌ద‌ర్శ‌క స్కోర్‌కార్డ్ విధానాన్ని ప్ర‌వేశపెట్టింది. దీని వ‌ల్ల ప‌నితీరును ఎలా మ‌దింపు చేస్తున్నారో సులువుగా తెలియ‌డ‌మే కాకుండా ఎవ‌రికి వారే త‌మ ప‌నితీరు మెరుగుప‌రుచుకునేందుకు ఏమి చేయాలో తెలుస్తుందనేది కొత్త ప‌ద్ద‌తి ఉద్దేశం.

7. పిట్నీ బొవెస్‌( Pitney Bowes)

7. పిట్నీ బొవెస్‌( Pitney Bowes)

ర్యాంకు: 9

స్థాప‌న‌: 2007

ఉద్యోగుల సంఖ్య‌: 0660

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1:3.93

ఈ కంపెనీలో ఉద్యోగుల హాజ‌రును ప‌ట్టించుకోరట‌. అంతే కాకుండా ఉద్యోగి వృద్ది చెందేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అవ‌కాశాల‌ను క‌ల్పిస్తార‌ట‌. మొద‌టి ఏడాదిలో ఈ కంపెనీలో చేరిన ఉద్యోగులు 70% ఇప్ప‌టికీ ఉన్న‌వారిలో కొన‌సాగుతున్నారు.

8. కాడెన్స్ డిజైన్ సిస్ట‌మ్స్‌- ఇండియా

8. కాడెన్స్ డిజైన్ సిస్ట‌మ్స్‌- ఇండియా

ర్యాంకు: 17

స్థాప‌న‌: 1987

ఉద్యోగుల సంఖ్య‌:1785

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1:4

వివిధ స్థాయిల్లో ర‌క‌ర‌కాల ప‌నిచేసేవారు సీఎఫ్‌వో స‌ల‌హా మండ‌లి కింద త‌మ వృత్తి నిర్వ‌హ‌ణ‌ను చేప‌డుతున్నారు. ఈ కంపెనీ ఎల‌క్ట్రానిక్ డిజైన్ ఆటోమేష‌న్ ప్ర‌ధాన వ్యాప‌కంగా క‌లిగి ఉంది. ఉద్యోగుల మ‌ధ్య క‌మ్యూనికేష‌న్‌ను పెంపొందించ‌డ‌మే ఈ కంపెనీ ప్ర‌ధాన ధ్యేయం.

9. పే పాల్ ఇండియా

9. పే పాల్ ఇండియా

ర్యాంకు: 22

స్థాప‌న‌: 2006

ఉద్యోగుల సంఖ్య‌: 1255

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1:3

ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్నాల‌జీ ఆధారిత సొల్యూష‌న్ల‌ను అందించే సంస్థ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎన్‌జీవోల‌ను, డెవ‌ల‌ప‌ర్ల‌ను ఒక చోట‌కు తీసుకొచ్చే అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మం ఆప‌ర్చునిటీ హ్యాక్‌ను పే పాల్ నిర్వ‌హిస్తుంది. గ‌తేడాది ఈ కంపెనీ నిర్వ‌హించిన హ్యాక‌థాన్‌లో 150 మంది డెవ‌ల‌ప‌ర్లు పాల్గొని, 5400 గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చించి 15 ఎన్‌జీవోలకు టెక్నాల‌జీ ఆధారిత సాయాన్ని చేశారు.

10. బీటీ గ్లోబ‌ల్ బిజినెస్ స‌ర్వీసెస్‌(జీబీఎస్‌)

10. బీటీ గ్లోబ‌ల్ బిజినెస్ స‌ర్వీసెస్‌(జీబీఎస్‌)

ర్యాంకు: 24

స్థాప‌న‌: 1987

ఉద్యోగుల సంఖ్య‌: 4388

మ‌హిళా : పురుష ఉద్యోగుల నిష్ప‌త్తి: 1: 2.13

Read more about: companies, work, salary, it
English summary

10 best tech companies to work for India in 2017

Economic times listed 10 best companies to work for in 2017, Here is the top best technology companies to work for in India
Story first published: Tuesday, July 11, 2017, 14:58 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC