For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కమొడిటీలో ఆప్ష‌న్స్‌కు తెర‌లేపిన సెబీ

కమొడిటీ మార్కెట్‌ను విస్తృతపర్చేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తాజాగా కీల‌క చ‌ర్య‌ చేపట్టింది. ఈక్విటీల తరహాలో కమోడిటీల్లోనూ ఆప్షన్స్ ట్రే

|

కమొడిటీ మార్కెట్‌ను విస్తృతపర్చేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తాజాగా కీల‌క చ‌ర్య‌ చేపట్టింది. ఈక్విటీల తరహాలో కమోడిటీల్లోనూ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు తెర‌తీసింది. త‌ద్వారా కంపెనీల షేర్ల‌ను ఆప్ష‌న్స్ అందుబాటులో ఉంచిన‌ట్లే వ‌స్తువుల‌ను సైతం ఆప్ష‌న్‌కు అందుబాటులో ఉంచ‌బోతున్నారు.

 కమొడిటీలో ఆప్ష‌న్స్‌కు తెర‌లేపిన సెబీ

అయితే, మొద‌ట‌ ఒక్కో ఎక్స్చేంజ్ ఒక కమోడిటీ ఫ్యూచర్స్‌లో మాత్రమే ఆప్షన్స్ కాంట్రాక్టును ప్రారంభించేందుకు అనుమతించనున్నట్లు నియంత్రణ మండలి ఆదేశించింది. ఆప్షన్స్ ట్రేడింగ్ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో నష్టాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని దేశంలోని ఎక్స్చేంజీల‌ను కోరింది. ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ఎంచుకునే కమోడిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులకు సంబంధించి సెబీ కఠినమైన అర్హతా నిబంధనలను విధించింది. గడిచిన ఏడాదికాలంలో ట్రేడింగ్ ప‌రిమాణం ప్రకారంగా టాప్ ఫైవ్‌లో ఉన్న కమోడిటీలోనే ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతినిచ్చింది. అంతేకాదు, వ్యవసాయ లేదా అగ్రి ప్రాసెసెడ్ కమోడిటీల విషయంలో గడిచిన ఏడాదికాలంలో ఫ్యూచర్స్ కాంట్రాక్టు సరాసరి రోజువారీ టర్నోవర్ కనీసం రూ.200 కోట్లుగా ఉండాలి. ఇతర కమోడిటీల విషయంలో సరాసరి టర్నోవర్‌ను రూ.1,000 కోట్లుగా నిర్ణయించింది.

Read more about: commodities options sebi
English summary

కమొడిటీలో ఆప్ష‌న్స్‌కు తెర‌లేపిన సెబీ | With options commodities traders get a hedging tool

Capital and commodity market regulator Sebi has set a minimum average daily turnover limit of ₹200 crore for agriculture and agriculture-processed commodities to be eligible for options trading, and of ₹1,000 crore for other commodities.To be listed on the options trading platform, both agriculture and non-agriculture commodities should have met the daily turnover criteria for the past 12 months, a Sebi statement said on Tuesday.
Story first published: Wednesday, June 14, 2017, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X