For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమ‌వారం ప్రారంభం కానున్న‌ హ‌డ్కో ఐపీవో

సోమ‌వారం(ఈ నెల 8న‌)మొద‌ల‌వుతుంది.ఈ ఐపీవో ద్వారా రూ.1224 కోట్ల వ‌ర‌కూ స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా హ‌డ్కోలో 10.19% వాటాకు స‌మాన‌మైన 2,04,058,747 షేర్ల‌ను ప్ర‌భుత్వ

|

హ‌డ్కో ఐపీవో సోమ‌వారం(ఈ నెల 8న‌) మొద‌ల‌వుతుంది. ఈ ఐపీవో ద్వారా రూ.1224 కోట్ల వ‌ర‌కూ స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా హ‌డ్కోలో 10.19% వాటాకు స‌మాన‌మైన 2,04,058,747 షేర్ల‌ను ప్ర‌భుత్వం విక్ర‌యించ‌నుంది. ఒక్కో షేరుకు రూ.56 నుంచి రూ.60 వ‌రకూ ధ‌ర‌ల శ్రేణిని నిర్ణ‌యించారు.

 సోమ‌వారం ప్రారంభం కానున్న‌ హ‌డ్కో ఐపీవో

గ‌రిష్ట ధ‌ర ప్ర‌కారం రూ. 1200 కోట్ల‌ను స‌మీక‌రించే య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రుణ వ‌సూళ్ల‌కు సంబంధించి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ ఎన్‌పీఏలు త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు హ‌డ్కో సీఎండీ ర‌వికాంత్ వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా గృహ రుణాల‌ను అందించ‌డంలో హ‌డ్కో త‌న కార్య‌క‌లాపాల‌ను క‌లిగి ఉంది. కొత్త స్థిరాస్తి చ‌ట్టం వ‌ల్ల హ‌డ్కో స‌హా స్థిరాస్తి రంగానికి మేలు చేకూరుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీంతో ప్ర‌ధానంగా మేము సైతం గృహ రుణాల‌పై దృష్టి సారిస్తామ‌ని ఆయ‌న అన్నారు. 2012 త‌ర్వాత పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా నిర్వ‌హిస్తోన్న తొలి ఐపీవో ఇదేన‌ని హ‌డ్కో డైరెక్ట‌ర్ రాకేశ్ కుమార్ అరోరా తెలిపారు. ఈ సంస్థ ఐపీవోకు లీడ్ మేనేజ‌ర్లుగా ఐడీబీఐ క్యాపిట‌ల్ మార్కెట్స్‌, ఎస్‌బీఐ క్యాపిట‌ల్ మార్కెట్స్‌, నోమురా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఐపీవో అనంత‌రం దేశీయ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ కంపెనీ షేర్లు న‌మోద‌వుతాయి. హ‌డ్కో ఐపీవో 11న ముగుస్తుంది

Read more about: ipo hudco
English summary

సోమ‌వారం ప్రారంభం కానున్న‌ హ‌డ్కో ఐపీవో | HUDCO IPO opens on Monday, May 08, 2017

The government plans to raise up to Rs 1,224 crore by selling equity shares in the Hudco's initial public offer (IPO) that will hit the capital market on Monday.State-owned Housing and Urban Development Corporation (Hudco), a ‘Miniratna’ firm which provides loans for housing and urban infrastructure projects, will launch the IPO on May 8 where the government is offering 204,058,747 shares for sale.
Story first published: Saturday, May 6, 2017, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X