For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 నెల‌ల వేత‌నంతో ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్న కాగ్నిజెంట్

అసోసియేట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్‌ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ

|

భార‌త్‌లో ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌ను క‌లిగిన అమెరిక‌న్ టెక్ దిగ్గ‌జం కాగ్నిజెంట్ చాలా మందికి ఉద్వాస‌న ప‌లికే క్ర‌మంలో చ‌ల్ల‌టి క‌బురు చెప్పింది. ఈ ఏడాది ఆ సంస్థ ప‌లు ఉన్న‌త స్థాయి ఉద్యోగుల‌ను తొలగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. డిజిటల్‌ టెక్నాలజీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య‌ను కుదించుకోవాలని ఆ కంపెనీ చూస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్‌ పద్ధతుల్లోకి మారేందుకు, నాణ్యత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు పరిహారం చెల్లించనుంది.

 9 నెల‌ల వేత‌నంతో ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్న కాగ్నిజెంట్

కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తోంది. అసోసియేట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్‌ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గత మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కనీసం రూ.40లక్షలను వేతనంగా అందుకుంటున్న వారు 'స్వచ్ఛంద ఉద్యోగ విరమణ' కిందకు రానున్నారు.

Read more about: cts cognizant lay offs
English summary

9 నెల‌ల వేత‌నంతో ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్న కాగ్నిజెంట్ | Cognizant top execs get voluntary separation option will get 9 months salary as compensation

Sources in the company have said that the option has been given to top executives, from the associate director to the top level, including board members and vice-presidents. They added that the compensation would depend on the rank and it would be minimum nine months salary. Further, the sources said that talks were going on for nearly three months now and that people who were receiving a minimum of around Rs 40 lakh as salary were the ones who would come under this programme.
Story first published: Wednesday, May 3, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X