For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రోసాఫ్ట్ ఫ్యూచ‌ర్ డీకోడెడ్ సద‌స్సులో చంద్ర‌బాబు కీల‌కోప‌న్యాసం

మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఇందుకోసం ముందుగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేసుకున్నారు. ముంబ‌యిలో జ‌రిగే మైక్రోసాఫ్ట్‌ ‘ఫ్యూచర్‌ డ

|

మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఇందుకోసం ముందుగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేసుకున్నారు. ముంబ‌యిలో జ‌రిగే మైక్రోసాఫ్ట్‌ 'ఫ్యూచర్‌ డీకోడెడ్‌' (భవిష్యత్తు ఛేదన) సాంకేతిక సదస్సులో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి వ‌చ్చిన‌ 1500 మందికి పైగా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. సత్యనాదెళ్లతో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ సాంకేతికత వాడకంలో మైక్రోసాఫ్ట్ స‌హ‌కారం కోర‌తార‌ని స‌మాచారం. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 'ఫిన్‌టెక్‌' రంగంలో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకునే అవ‌కాశం ఉంది. విశాఖ‌ను ఫిన్‌టెక్ వ్యాలీగా అభివృద్ది చేయాల‌నుకుంటున్న ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ఫిన్‌టెక్ సంస్థ‌లైన వీసా,థామ‌స్ రాయిట‌ర్స్‌తో ఎంవోయూల‌ను చేసుకుంటుంది. లింక్‌డ్ ఇన్ సంస్థ‌తోనూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అవగాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.

 మైక్రోసాఫ్ట్ ఫ్యూచ‌ర్ డీకోడెడ్ సద‌స్సులో చంద్ర‌బాబు కీల‌కోప‌న్యాసం

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ప్ర‌సంగం త‌ర్వాత సీబీఎన్ మాట్లాడారు. వీడియోలో 1.05 గం.ల నుంచి ఆయ‌న ప్ర‌సంగాన్ని వినొచ్చు.
ఫ్యూచ‌ర్ డీకోడెడ్ సద‌స్సులో చంద్ర‌బాబు ప్ర‌సంగ పాఠం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=Enw7_7G7IhM

న‌గ‌దు ర‌హిత‌ భారత్ కలను సాకారం చేసేందుకు కేంద్రం కసరత్తును ముమ్మరం చేసింది. కార్డు లావాదేవీలు, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా మరిన్ని రాయితీలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎండీఆర్‌ చార్జీలను తగ్గించడంతో పాటు.. యూపీఐ యాప్‌ భీమ్‌కు మరింత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. యాప్‌లో వినియోగదారులకు రెఫరల్‌ ఆఫర్‌ను, వ్యాపారులకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్ మంగళవారం వెల్లడించారు. అంతే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేతృత్వంలోని ముఖ్య‌మంత్రుల క‌మిటీ ఇప్ప‌టికే న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు అనుస‌రించాల్సిన మార్గ సూచీని కేంద్రానికి అంద‌జేసింది. ఇందులో ఆన్‌లైన్ చెల్లింపుల‌కు సంబంధించిన రుసుముల‌ను త‌గ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు.

 మైక్రోసాఫ్ట్ ఫ్యూచ‌ర్ డీకోడెడ్ సద‌స్సులో చంద్ర‌బాబు కీల‌కోప‌న్యాసం

'ఫ్యూచర్‌ డీకోడెడ్‌'స‌ద‌స్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ప్ర‌సంగం త‌ర్వాత సీబీఎన్ మాట్లాడారు. వీడియోలో 1.05 గం.ల నుంచి ఆయ‌న ప్ర‌సంగాన్ని వినొచ్చు.

Read more about: microsoft ap satya nadella
English summary

మైక్రోసాఫ్ట్ ఫ్యూచ‌ర్ డీకోడెడ్ సద‌స్సులో చంద్ర‌బాబు కీల‌కోప‌న్యాసం | Andhra Pradesh CM CBN speech at Microsoft future decoded

Join business leaders and eminent speakers to understand how businesses can evolve in an environment of digital disruption in the future. Tune into insightful keynotes from the business day of #FutureDecoded. Know more https://www.futuredecoded.in/
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X