For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ఎస్ఈ కొత్త సీఈవో ఎవ‌రు?

దేశంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ. అటు వాల్యూమ్స్‌లోనూ టర్నోవర్‌లోనూ తిరుగులేని నేషనల్ స్టాక్‌ఎక్స్ఛేంజ్ కి సీఈవో,మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా విక్రమ్ లిమాయే ఎంపికయ్యారు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ

|

దేశంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ. అటు వాల్యూమ్స్‌లోనూ టర్నోవర్‌లోనూ తిరుగులేని నేషనల్ స్టాక్‌ఎక్స్ఛేంజ్ కి సీఈవో,మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా విక్రమ్ లిమాయే ఎంపికయ్యారు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సెబీకి తెలిపింది. ప్రస్తుత నియమాకం నిబంధనలకు లోబడి షేర్ హోల్డర్ల అనుమతితో ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎన్ఎస్ఈ, నూత‌న సీఈవో గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

 నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) గురించి

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) గురించి

ఎన్ఎస్ఈ 1992లో స్థాపించ‌బ‌డింది. 1992 నవంబరులో పన్ను చెల్లింపు కంపెనీగా ఇది ఏర్పాటైంది. 1993 ఏప్రిల్‌లో దీన్ని షేర్ల ఒప్పందాలు(సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌) (నియంత్రణ) చట్టం, 1956 ప్రక్రారం వాటా విపణిగా గుర్తించారు. టోకు వికలన విపణి (డెబిట్‌ మార్కెట్‌) (డబ్ల్యూడీఎం) లో 1994 జూన్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఎన్‌ఎస్‌ఈ మూలధన విపణి (ఈక్విటీలు) విభాగం 1994 నవంబరులో కార్యకలాపాలు మొదలు పెట్టింది. వ్యుత్పన్నముల (డెరివేటివ్) ‌ విభాగంలో కార్యకలాపాలు 2000 జూన్‌లో మొదలయ్యాయి.ఇంత చ‌రిత్ర ఉన్న దీని నిర్వ‌హ‌ణ ఎవ‌రికైనా కొత్త సీఈవో ఎవ‌ర‌నే అంశంపై అంద‌రికీ ఆస‌క్తి ఉంటుంది.

కొత్త సీఈవో గురించి

కొత్త సీఈవో గురించి

విక్రమ్ లిమాయే ప్రొఫైల్ చూస్తే ఇటీవలివరకూ ఆయన ఐడిఎఫ్‌సి బ్యాంక్‌కి ఎండిగానూ..సిఈఓగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో యూఎస్‌లో ఎంబిఏ చేసిన విక్రమ్, సిఎ చదువుతుండగానే ముంబై ఆర్ధూర్ అండర్సన్ ఇన్సిట్యూట్‌లో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ యంగ్, సిటి బ్యాంక్‌కి సంబంధించిన కన్జ్యూమర్ బ్యాంకింగ్ రంగంలోనూ పనిచేశారు. అమెరికాలో ఎంబిఏ పూర్తైన తర్వాత వాల్‌స్ట్రీట్‌లో 8ఏళ్లు క్రెడిట్ సూయీలో వివిధ పాత్రల్లో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రంగంలోనివే కావడం విశేషం. 2004లో ఇండియా తిరిగి వచ్చిన విక్రమ్ లిమాయే ప్రభుత్వానికి చెందిన అనేక కమిటీల్లో విశేషపాత్ర పోషించారు.

ఎంపిక చేసేందుకు కార‌ణాలివే...

ఎంపిక చేసేందుకు కార‌ణాలివే...

పాలసీల రూపకల్పన, వాణిజ్యవిధానాల తయారీ, పెట్టుబడుల సాధన వంటి అనేక అంశాల్లో కేంద్రప్రభుత్వంతో కలిసి పని చేశారు. అనేక దేశీయ, అంతర్జాతీయ వేదికలపై భారత పారిశ్రామికరంగానికి పెట్టుబడుల అవకాశాలపై ప్రసంగించేవారు. ఇప్పుడు తాజాగా ఎన్ఎస్ఈ టాప్ అధికారిగా ఎంపికైన విక్రమ్ లిమాయే ఇటీవలే బిసిసిఐ పానెల్ మెంబర్లుగా సుప్రీంకోర్టు నామినేట్ చేసిన కమిటీలోనూ ఒకరుగా ఉండటం విశేషం.

చిత్రా రామ‌కృష్ణ వైదొల‌గ‌డం ఊహించ‌నిదే...

చిత్రా రామ‌కృష్ణ వైదొల‌గ‌డం ఊహించ‌నిదే...

ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ప‌ద‌వుల నుంచి చిత్రా రామ‌కృష్ణ అనూహ్యంగా వైదొల‌గారు. నిజానికి ఆమె ప‌ద‌వీ కాలం మార్చి, 2018తో ముగియాల్సింది. ఎన్ఎస్ఈ ప‌బ్లిక్ ఇష్యూ(ఐపీవో) విష‌యంలో బోర్డు స‌భ్యుల‌తో ఏర్పడిన బేదాభిప్రాయాల కార‌ణంగానే ఆమె త‌న ప‌ద‌వి నుంచి వైదొలగార‌ని మార్కెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గ్లోబల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సారథ్యం వహించిన అతికొద్దిమంది మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో చిత్రా రామకృష్ణ ఒకరు. ఇటీవ‌లే ఆమె వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్సేంజెస్(డబ్ల్యూఎఫ్‌ఈ) చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఇది కూడా చ‌ద‌వండి ఫార్చూన్ జాబితాలోని భార‌త మ‌హిళ‌లు

English summary

ఎన్ఎస్ఈ కొత్త సీఈవో ఎవ‌రు? | National Stock Exchange names IDFC Vikram Limaye as CEO

India's National Stock Exchange (NSE) named Vikram Limaye, the CEO of infrastructure lender IDFC Ltd, as its new chief executive as the country's largest bourse gears up for a much-awaited initial public offering this year.The appointment, which will have to be approved by the market regulator, the Securities and Exchange Board of India (SEBI), and NSE's shareholders, is for five years, the exchange said in a statement.
Story first published: Friday, February 10, 2017, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X