ఫార్చూన్ శక్తివంతమైన మహిళల్లో ఏసియా-పసిఫిక్ జాబితాలో 8 మంది భారతీయులు ఉన్నారు. వారి నేపథ్యాలు, వారు నేతృత్వం వహిస్తున్న సంస్థల వివరాలను కింద చూడండి.

చందా కొచ్చర్
భారతదేశ రెండో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐకు సీఈవో,ఎండీగా ఈమె వ్యవహరిస్తున్నారు. 1984లో ఐసీఐసీఐ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. 2001లో సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉన్న చందా కొచ్చర్‌ను ప్రభుత్వం 2010లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

అరుంధతీ భట్టాచార్య
ఎస్‌బీఐకి సారథ్యం వహించిన తొలి మహిళగా అరుంధతీ భట్టాచార్య పేరు గడించారు. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శక్తివంతమైన మహిళల జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. ఆమె నాయకత్వంలో ఎన్నో కీలకమైన మార్పులు ఎస్‌బీఐలో చేపట్టారు. టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్, ఈ-పే తదితర అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసియా-పసిఫిక్‌లో శక్తివంతమైన మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు.

శిఖా శర్మ
56 ఏళ్ల శిఖా శర్మ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఈమె యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రయివేటు రంగంలో కింది స్థాయిలో ఉన్న బ్యాంకును దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా తీర్చిదిద్దారు. పింగ్‌పే అనే యాప్‌ను రూపొందించడం ద్వారా మొదటి సోషియల్ పేమెంట్ యాప్‌ను ప్రవేశపెట్టిన ఘనతను యాక్సిస్ సాధించింది. ఆమె నాయకత్వం కారణంగా యాక్సిస్ బ్యాంకు లాభాల బాట పట్టి 7.9 బిలియన్ డాలర్ల రెవెన్యూ దిశగా సాగింది. యాక్సిస్ బ్యాంకుకు 1800 నగరాల్లో 3000 శాఖలు ఉన్నాయి.

కిరణ్ మజుందార్ షా
బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా 19వ స్థానంలో ఉన్నారు. బెంగుళూరు నగర వాసి అయిన మజుందార్ షా బయోకాన్ లిమిటెడ్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2005లో ఈమెను భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. ఆమెను ఇండియా బయోటెక్ క్వీన్‌గా ది ఎకనమిస్ట్ అండ్ ఫార్చ్యూన్, ఇండియాస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్‌గా న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నాయి.

నిశి వాసుదేవ
నిశి వాసుదేవ పెట్రోలియం రంగంలో 34 ఏళ్ల పైనే అనుభవం కలిగి ఉన్నారు. తన కెరీర్‌ను ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్నారు. ఒక నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థకు సారథ్యం వహించిన తొలి మహిళగా వినుతికెక్కారు. నిశి వాసుదేవ 5వ స్థానంలో ఉన్నారు.

చిత్రా రామకృష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) పగ్గాలు చేపట్టిన మొదటి భారత మహిళగా చిత్రా రామకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఫార్చూన్ శక్తివంతమైన మహిళల్లో ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో 22వ స్థానంలో ఉన్నారు. ఒక సరికొత్త ఎక్స్చేంజీని దేశం కోసం నెలకొల్పే ఆలోచన నుంచి దాన్ని కార్యరూపంలోకి తెచ్చిన వ్యక్తుల్లో ఈమె ఒకరు. ఎన్ఎస్ఈని పూర్తిగా ఆటోమేటెడ్ రూపంలో స్క్రీన్ బేస్‌డ్ ట్రేడింగ్ వ్యవస్థగా నెలకొల్పేందుకు పనిచేసిన టీమ్‌లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. సెబీ లెజిస్లేటివ్ ఫ్రేమ్‌వర్క్‌ను డ్రాఫ్ట్ చేసిన దానిలో చిత్రా భాగస్వామ్యం ఉంది. ఇప్పటికీ సెబీ ఏర్పాటు చేసే చాలా కమిటీల్లో సభ్యురాలిగా ఉంటూ వస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టెర్డ్ అకౌంట్ పూర్తిచేసిన చిత్రా రామకృష్ణను ఎన్ఎస్ఈ పగ్గాలు చేపట్టిన తొలి భారత మహిళ కాగా ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో ఒక దేశ స్టాక్ ఎక్సేంజీకి నేతృత్వం వహించిన 3వ వ్యక్తిగా ఉన్నారు. అంతకు ముందు శ్రీలంక కోలంబో స్టాక్ ఎక్సేంజీ, చైనా షెంజెన్ స్టాక్ ఎక్సేంజీకి మహిళలు నేతృత్వం వహించారు.

నైనా లాల్ కిద్వాయ్
నైనా లాల్ కిద్వాయ్ భారతీయ చార్టెడ్ అకౌంటెంట్. ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. హెచ్‌సీబీఎస్ భారతదేశ విభాగానికి నేతృత్వం వహిస్తూ గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భారత ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ సత్కారాన్ని అందుకున్నారు.
ప్రస్తుతం ఫార్చూన్ జాబితాలో 23వ స్థానంలో నిలిచారు.

మల్లికా శ్రీనివాసన్
టఫే అనే ట్రాక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థను మల్లికా నెలకొల్పారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 96 బిలియన్ రూపాయలు. ఈ సంస్థ వ్యవసాయానికి పనికొచ్చే ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలు, డీజిల్ ఇంజిన్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ పరికరాలు, హైడ్రాలిక్ పంపులు, సిలిండర్లు, బ్యాటరీలు మొదలైనవి తయారు చేస్తుంది. దేశంలో విద్య, ఆరోగ్య రంగాల్లో పురోగతి కోసం మల్లికా కృషిచేస్తున్నారు. వైద్య రంగంలో శంకర్ నేత్రాలయ, చెన్నై క్యాన్సర్ ఆసుపత్రికి ఇతోధిక ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు. 1999లోనే బీబీసీ నుంచి బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మొదటిసారి(దేశంలోనే) అందుకున్నారు. 2014లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. ప్రస్తుతం ఫార్చూన్ శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications