English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఈ ప‌ది అంశాల్లో భార‌త్ దూసుకెళుతోంది...

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

భార‌త్ దూసుకెళుతోంది. కానీ ఏ రంగాల్లో? అభివృద్ది చెందుతున్న దేశాల‌కు ప్ర‌ధాన శ‌త్రువు పేద‌రికం. పేద‌రికాన్ని జ‌యించ‌డంలో కాస్త నెమ్మ‌దిగానే ప‌య‌నిస్తున్నా ఐటీ నుంచి మొద‌లుకొని ఆర్మీ శ‌క్తిని పెంచుకోవ‌డంలో భార‌త‌దేశం సూప‌ర్ ప‌వ‌ర్‌గా ఎదుగుతోంది. ఈ క్ర‌మంలో ఏ ఏ రంగాల్లో భార‌త్ ముందంజ‌లో ఉందో తెలుసుకుందాం.

10. ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద ఐటీ ప‌రిశ్ర‌మ‌

10. ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద ఐటీ ప‌రిశ్ర‌మ‌

దేశంలో ఐటీ(సాఫ్ట్‌వేర్) ప‌రిశ్ర‌మ శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతోంది. దీనివ‌ల్ల ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్దదిగా వెలుగొందుతోంది. వ‌చ్చే ఐదేళ్ల‌లో చైనాను దాటేసి ప్ర‌పంచంలోనే నం. 1 స్థానానికి ఎదుగుతామ‌ని అంచ‌నా. కోటి మందికి పైగా ప్ర‌త్యక్ష ఉపాధిని ఈ రంగం క‌ల్పిస్తుండ‌గా రెవెన్యూ సైతం దేశానికి అదే రీతిన వ‌స్తోంది. దేశంలో ఐటీ-బీపీఎం రంగం విలువ 143 కోట్ల బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని అంచ‌నా. 2015-16లో దీని వార్షిక వృద్ది రేటు(సీఏజీఆర్‌) ప్ర‌స్తుత ఏడాది 12-14% వృద్ది ఉండ‌గ‌ల‌ద‌ని నాస్కామ్ అంచ‌నా వేసింది. 2020 క‌ల్లా 650-700 కోట్ల బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని అధ్య‌య‌నాలు చెపుతున్నాయి.

9. ఎయిర్‌ఫోర్స్‌లో నాలుగో స్థానం

9. ఎయిర్‌ఫోర్స్‌లో నాలుగో స్థానం

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 1820 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 905 కంబాట్ ప్లేన్లు, 595 యుద్ధ విమానాలు, 310 అటాక‌ర్స్ ఉన్నాయి. ప్ర‌పంచంలోనే జ‌ర్మ‌నీ, బ్రిట‌న్‌, చాలా యూరోపియ‌న్ దేశాల కంటే ఇందులో మ‌నం ముందున్నాం. మొత్తానికి ప్ర‌పంచంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ నాలుగో అతి శ‌క్తిమంత‌మైన ప‌వ‌ర్‌.

8. అణ్వాయుధాలు (వెప‌న్స్, రియాక్ట‌ర్స్‌)

8. అణ్వాయుధాలు (వెప‌న్స్, రియాక్ట‌ర్స్‌)

గ‌త 67 ఏళ్ల‌లో దేశ అణు ఇంధ‌న సామ‌ర్థ్యం బాగా పెరిగింది. థోరియం ఆధారంగా రూపొందించే ఫాస్ట్ బ్రీడ‌ర్ రియాక్ట‌ర్ల నిర్మాణంలో ప్రపంచంలోనే భార‌త్ టాప్‌. 7 న్యూక్లియ‌ర్ ప్లాంట్ల‌లో 21 న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్లు ఉన్నాయి. వీటి మొత్తం సామ‌ర్థ్యం 5780 మెగావాట్లు. మ‌రో 6 రియాక్ట‌ర్లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌ల ఫెడ‌రేష‌న్ లెక్క‌ల ప్ర‌కారం ఇండియా వ‌ద్ద 75-110 న్యూక్లియ‌ర్ వెప‌న్లు(అణ్వాయుధాలు) ఉన్నాయి.

7. ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌లో రెండో అతిపెద్ద దేశం

7. ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌లో రెండో అతిపెద్ద దేశం

ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద జ‌నాభా క‌లిగి ఉండ‌టం భార‌త‌దేశానికి ఎన్నో విధాలుగా సానుకూల‌త. ప్ర‌స్తుతం ప్ర‌పంచమంతా సాంకేతిక‌త‌తో ముందుకెళుతోంది. మ‌న భ‌విష్య‌త్తు సైతం టెక్నాల‌జీ(సాంకేతిక‌త‌), ఇంట‌ర్నెట్‌తో ముడిప‌డి ఉంది. చైనా త‌ర్వాత అత్య‌ధిక ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు క‌లిగిన దేశం మ‌న‌ది. అయితే మొత్తం దేశంలో 29% జ‌నాభాకే అంటే 35.4కోట్ల మందికే ఇంట‌ర్నెట్ వాడ‌టం వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ మ‌నం అమెరికా, జ‌పాన్, ర‌ష్యా వంటి దేశాల కంటే ముందున్నాం. అందుకే టెక్నాల‌జీ దిగ్గ‌జాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్‌, ఐబీఎమ్, శ్యాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థ‌లు మ‌న‌కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నాయి. అంతే కాకుండా ప్రాంతీయ భాష‌ల్లో ఎన్నో అప్లికేష‌న్ల‌ను రూపొందిస్తున్నాయి.

6. మూడో అతిపెద్ద ఆర్మీ

6. మూడో అతిపెద్ద ఆర్మీ

ఇటీవ‌ల స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో చాలా మందికి ఇండియ‌న్ ఆర్మీపై ఆస‌క్తి పెరిగింది. అయితే ఇంత పెద్ద జ‌నాభా క‌లిగిన దేశ‌మైన‌ప్ప‌టికీ మ‌నం ఆర్మీలో మొద‌టి రెండు స్థానాల్లో నిల‌వ‌క‌లేక‌పోయాం. 11,29,900 యాక్టివ్ ట్రూప్స్‌తోనూ, 9,60,000 రిజ‌ర్వ్ ట్రూప్స్‌తోనూ మ‌నం ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్మీని నిర్వ‌హిస్తున్నాం. మొత్తం మిలిట‌రీ ప‌వ‌ర్‌లో చూస్తే చైనా 23,35,000 మంది యాక్టివ్ మిలిట‌రీని క‌లిగి ఉండ‌గా మ‌న వ‌ద్ద అంత‌కంటే త‌క్కువ‌గా ఉంది. చైనా, ర‌ష్యాల‌తో పోలిస్తే భార‌త్ నేవీ శ‌క్తి త‌క్కువ‌గా ఉంది. అందుకే భూమ్మీద యుద్దం చేయ‌గ‌ల దేశాల్లో మ‌నం మూడో స్థానంలో ఉండ‌గా; మొత్తం యుద్దం వ‌చ్చేసరికి మ‌నం ప్ర‌పంచంలో అమెరికా, చైనా, ర‌ష్యాల త‌ర్వాత నాలుగో స్థానంలో ఉన్నాం.

5. అంగార‌క యాత్ర‌కు వెళ్లిన నాలుగో దేశం

5. అంగార‌క యాత్ర‌కు వెళ్లిన నాలుగో దేశం

ఆసియా దేశాల్లో మొద‌ట అంగార‌క గ్ర‌హం మీద మొద‌లుపెట్టిన మొద‌టి దేశం భార‌త్‌. అయితే ప్ర‌పంచవ్యాప్తంగా చూస్తే ఈ విధంగా చేసిన నాలుగో దేశం. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అంశం అతి త‌క్కువ ఖ‌ర్చుతో మ‌నం మార్స్‌(అంగార‌క గ్ర‌హం) మిష‌న్‌ను చేప‌ట్టాం. అన్ని దేశాల్లోకి ఇంత త‌క్కువ ఖ‌ర్చుతో అంగార‌క గ్ర‌హం మీద కాలుపెట్టింది మ‌నమే. దాదాపు రూ. 450 కోట్ల‌తో ఈ యాత్ర పూర్త‌యింది.

4. యోగా, ఆయుర్వేద‌

4. యోగా, ఆయుర్వేద‌

యోగా గురించి అంద‌రికీ ఇష్టం లేక‌పోవ‌చ్చు. ఎంతో చ‌ర్చ జ‌రుగుతూ ఉండొచ్చు గాక‌. అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా యోగాను అభినందిస్తోంది. యోగాను చేసేందుకు ఆస‌క్తి చూపుతోంది. యోగానంద యోగా వ‌ల్ల కలిగే భౌతిక‌, మాన‌సిక ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆధునిక వైద్య శాస్త్రంలో సైతం యోగా, ఆయుర్వేద ప్రయోజ‌నాల‌పై విస్తృత ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

3. థోరియంతో న్యూక్లియ‌ర్ ప్లాంట్‌

3. థోరియంతో న్యూక్లియ‌ర్ ప్లాంట్‌

యూరోనియంతో ఏర్పాటు చేసే న్యూక్లియ‌ర్ ప్లాంట్ల‌కు బ‌దులుగా వేరే ఏమి ఏర్పాటు చేయాల‌ని ప్ర‌పంచ‌మంతా మీమాంస‌లో ఉండ‌గా భార‌త్ స‌రికొత్త అణు ఇంధ‌నంతో ముందుకు వెళుతోంది. థోరియంతో న్యూక్లియ‌ర్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయడంలో ఎంతో ముందుంది. ఇండియాలో థోరియం నిల్వ‌లు ఎక్కువ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి మ‌న శాస్త్ర‌వేత్త‌లు ఆ దిశ‌గా ప‌రిశోధ‌న‌లు చేయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యి ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డంలో విజ‌యం సాధించారు. న్యూక్లియ‌ర్ ప్లాంట్ల ఏర్పాటులో భార‌త్ యురేనియం(యురేనియం 238)కు బ‌దులు థోరియంను వాడ‌టం చూసి ప్ర‌పంచ‌మంతా ఆశ్చ‌ర్య‌ప‌డింది.

2. రిమోట్ సెన్సింగ్‌

2. రిమోట్ సెన్సింగ్‌

ఒక ద‌శాబ్దం ముందు వ‌ర‌కూ శాటిలైట్‌(ఉప‌గ్ర‌హ‌) ప్ర‌యోగాల‌కు మ‌నం అమెరికా మీద ఆధార‌ప‌డే వాళ్లం. అయితే ఉప‌గ్ర‌హ స‌మాచారం వేరే దేశం నుంచి అందుకోవ‌డంలో ఆల‌స్యం కార‌ణంగా మ‌నం ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాం. 1999 ఒడిశా సైక్లోన్ స‌మ‌యంలో ఉప‌గ్ర‌హ స‌మాచారం ఇత‌ర దేశాల నుంచి అందుకోవ‌డం ఆల‌స్యం అవ‌డం మూలంగా 20 వేల మందిని కాపాడ‌లేక‌పోయాం. 2015 వ‌చ్చే స‌రికి రిమోట్ సెన్సింగ్ సామ‌ర్థ్యంలో మ‌నం యూ.ఎస్‌ను సైతం దాటేశాం. అయితే దాన్ని ప్ర‌తి రంగంలో ఉప‌యోగించుకోవ‌డంలో ఇంకా ఎంతో క‌స‌ర‌త్తు జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం గ్రౌండ్ వాట‌ర్‌ను అంచ‌నా వేయడంలోనూ, పంట అంచ‌నాలు, ఫిషింగ్ జోన్‌, వెద‌ర్ ఫోర్‌క్యాస్టింగ్‌, స‌ముద్ర త‌లం మీద ఉష్ణోగ్ర‌త‌, బ‌యోడైవ‌ర్సిటీ లెక్కింపు, వాట‌ర్ షెడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులు, స‌హజ వ‌న‌రుల స‌మాచార మదింపు వంటి వాటిలో ఇస్రో కార‌ణంగా మనం ఎంతో ప్ర‌గ‌తి సాధించాం.

1. ఎత్తైన‌ యుద్ద క్షేత్రాల్లో పోరాటం

1. ఎత్తైన‌ యుద్ద క్షేత్రాల్లో పోరాటం

అణ్వాయుధాలు క‌లిగిన చైనా, పాకిస్తాన్‌ల‌తో మ‌న‌కు స‌రిహ‌ద్దులు ఉన్నాయి. రెండు వైపులా ఎత్తైన కొండలు ఉన్నాయి. అంటే మ‌న సైకికుల‌కు మౌంటెన్ వార్‌ఫేర్ ట్రైనింగ్ అవ‌స‌రం. ఈ విష‌యంలో ప్ర‌పంచంలో మ‌న‌మే బెస్ట్‌. కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో శిక్ష‌ణా కేంద్రం(ట్రైనింగ్ సెంట‌ర్‌) ఉంది. అమెరికా, బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ దేశాల ఆర్మీ సైతం ఇక్క‌డకు శిక్ష‌ణ‌కు వ‌స్తూ ఉంటుంది. సియాచిన్ యుద్ద క్షేత్రం మంచుతో కూడుకుని ప్ర‌పంచంలోనే అతి క్లిష్ట‌మైన‌ది.

Read more about: india, superpower, powerful countries
English summary

India is powerful in these areas

India, a land of a billion plus people achieving feats no one ever imagined.That’s how aptly you can concoct present India’s definition in words. While we are still largely a developing country, there are certain areas where we stand far above the developed nations. Here are 10 things that will make you proud
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC