English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

దంప‌తులిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే ఇవి చ‌ద‌వండి

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

 క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అనేది పెద్ద‌లు చెప్పిన సామెత‌. అయితే నేడు అది కుదర‌డం లేదు. ఉమ్మ‌డి కుటుంబాల సంస్కృతి త‌గ్గిపోతోంది. భార్యాభ‌ర్త‌లు, ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌లు అదే కుటుంబం లాగా త‌యార‌యింది. ఇంత‌కుముందు పెద్ద‌ల స‌ల‌హాలుండేవి. అందుకే నిర్ణ‌యం తీసుకునేముందు స‌మీక్ష‌కు తావుండేది. ఇప్పుడు అలా కాదు డ‌బ్బు చెల్లింపుల‌కు కార్డులు వ‌చ్చేశాయి. ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియ‌కుండానే ఒక్కోసారి డబ్బు ఖ‌ర్చు చేసే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఆర్థిక విష‌యాల్లో కలిసి నిర్ణ‌యం తీసుకుంటేనే మంచిది. భార్యా, భ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగం చేయాల్సిన ప‌రిస్థితులుంటే అద‌న‌పు ఆదాయాన్ని ఇత‌ర పెట్టుబ‌డుల్లో ఉంచ‌డం, భ‌విష్య‌త్తులో భ‌ద్ర‌త కోసం పొదుపు చేయడం ముఖ్యం.

ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్న క్ర‌మంలో ప‌నికొచ్చే ఆర్థిక స‌ల‌హాల‌ను ఇక్క‌డ చూద్దాం:

1) ఇంటి బ‌డ్జెట్ ప్ర‌ణాళిక‌

1) ఇంటి బ‌డ్జెట్ ప్ర‌ణాళిక‌

అన‌వ‌స‌ర షాపింగ్ ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు ఇంటి బ‌డ్జెట్ ఉండ‌టం ఎంతైనా ముఖ్యం. ప్ర‌ణాళిక లేక‌పోతే కొన్న‌వే మ‌ళ్లీ కొన‌డం, అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌కు డ‌బ్బు లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ప్ర‌ణాళిక వేసుకుని ఇక చాల‌నుకుంటే పొర‌పాటు. దంప‌తులిద్ద‌రూ దానికి క‌ట్టుబ‌డి ఉండాలి.

 2) పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌

2) పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌

ఆర్థిక నిర్వ‌హ‌ణ‌, న‌ష్ట భ‌యం ఆధారంగా పెట్టుబ‌డుల‌ను నిర్ణ‌యించుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఒక్కొక్క‌రికి ఒక్కో పెట్టుబ‌డి మీద ఆస‌క్తి ఉంటుంది. ఉమ్మ‌డిగా ఆలోచించుకుని స‌రైన పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ను ర‌చించుకోవాలి. అందుకు అనుగుణంగా న‌డుచుకోవాలి.

3) ఉమ్మ‌డి ఖాతా

3) ఉమ్మ‌డి ఖాతా

ఇద్ద‌రూ ఒక ప్ర‌ణాళిక వేసుకున్నా దాన్ని క‌చ్చితంగా పాటించలేక‌పోతున్న క్ర‌మంలో ఉమ్మ‌డి ఖాతా తెర‌వ‌డం మంచి ఆలోచ‌న‌. ఒక వేళ ఊళ్లో ఒక‌రు లేక‌పోయినా మ‌రొక‌రు ఖాతాకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు చేప‌ట్ట‌వ‌చ్చు. జంట‌లు వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంచుకునేందుకు వీలుగా ఉమ్మ‌డి ఖాతాల్లో ర‌కాలున్నాయి. మీకు అనువైన దానిని మొద‌టే స‌రిగా ఎంచుకోండి.

 4) అత్య‌వ‌స‌ర నిధి

4) అత్య‌వ‌స‌ర నిధి

స‌త్వ‌ర‌మే వాడుకునేందుకు వీలుగా ఉండేలా అత్య‌వ‌స‌ర నిధిని స‌మ‌కూర్చుకోండి. హ‌ఠాత్తుగా మీ నెల‌వారీ ఆదాయం ఆగిపోయేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌. కానీ పిల్ల‌ల విద్యావ‌స‌రాలు, మీ వైద్య ఖ‌ర్చులు ఎప్పుడైనా పెర‌గొచ్చు. అందుకే అత్య‌వ‌స‌రాల‌కు కొంచెం డ‌బ్బు పక్క‌న ఉంచండి. ఒక‌రి ఆదాయం లేక‌పోయినా మ‌ధ్య‌లో కొన్ని రోజులు దీంతో స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు.

5) అప్పు చేయ‌కండి

5) అప్పు చేయ‌కండి

ఇద్ద‌రూ క‌లిసి వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌డం అనేది స‌హేతుకం కాదు. ఒక‌రు రుణం తీసుకుని మ‌రొక‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌మ‌ర్థ‌నీయం కాదు. ఒక ఇల్లు, స్థిరాస్తి విష‌యంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అప్పు చేసినా ఫ‌ర్వాలేదు. అంతేకానీ విలాసాల‌కు, వినోదాల‌కు డ‌బ్బు ఖ‌ర్చు చేసేసి క‌చ్చితంగా ఇంట్లో అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌కు వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌డం లాంటి అల‌వాట్ల‌కు దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి.

6) ఉమ్మ‌డి గృహ రుణం

6) ఉమ్మ‌డి గృహ రుణం

ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తుంటే ఆదాయ‌పు ప‌న్ను చాలా చెల్లించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంది. అలాంట‌ప్పుడు ఉమ్మ‌డి గృహ రుణం ఒక మంచి ఆలోచ‌న‌. క‌లిసి రుణం తీసుకుంటే ఇద్ద‌రూ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ప్రాథ‌మిక రుణ గ్ర‌హీత మ‌హిళ అయిన క్ర‌మంలో ఉమ్మ‌డి గృహ రుణం వ‌డ్డీలో సైతం కాస్త త‌గ్గింపు ల‌భిస్తుంది.

7) హెచ్ఆర్ఏ

7) హెచ్ఆర్ఏ

అద్దె ఇళ్ల‌లో నివ‌సిస్తున్న‌ దంప‌తులు ఇంటి అద్దె మిన‌హాయింపును ఇద్ద‌రూ వాడుకోవ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80 సీ ప్రకారం ప‌న్ను మినహాయింపుల‌కు హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు.

8) బీమా

8) బీమా

దంప‌తులిద్ద‌రికీ ప్ర‌త్యేక బీమా పాల‌సీలు ఉండాలి. కుటుంబంలో ప్ర‌ధాన ఆదాయం ఉన్న‌వారికి జీవిత బీమా ఉన్న‌ప్ప‌టికీ, ఆరోగ్య బీమా మాత్రం ఉమ్మ‌డి పాల‌సీ లేదా ప్ర‌త్యేకంగా ఒక్కొక్క‌రికి ఒక్కొక్క‌టి తీసుకోవ‌డం సూచ‌నీయం. భార్యా, భ‌ర్త‌లిద్ద‌రికీ క‌లిపి ట‌ర్మ్ పాల‌సీల‌ను అందిస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి.

9) పిల్ల‌ల విద్యా అవ‌స‌రాల‌కు మొద‌టి నుంచే జ‌మ‌చేయడం

9) పిల్ల‌ల విద్యా అవ‌స‌రాల‌కు మొద‌టి నుంచే జ‌మ‌చేయడం

పిల్ల‌ల చ‌దువు విష‌యంలో ఇప్పుడు త‌రం చాలా ముందుచూపుతో ఆలోచిస్తున్నారు. విద్య రోజురోజుకి ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారిపోయింది. అందుకే పిల్ల‌లు పుట్ట‌గానే వారి చ‌దువు కోసం ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేసి పొదుపు చేయ‌డం మంచిది. ఉన్న‌త విద్య‌కు ఎంతో డబ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. భ‌విష్య‌త్తు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిల్ల‌ల విద్యా నిధి ఏర్పాటు చేసుకోవాలి.

ఇది కూడా చ‌ద‌వండి కార్లు కొంటున్నారంట‌.. ప‌న్ను క‌ట్ట‌డం లేదంట‌...

ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్న‌ప్పుడు ఇద్ద‌రి మ‌ద్య అన్ని విష‌యాల‌పై చ‌ర్చ జ‌ర‌గాలి. అన్ని ఖ‌ర్చుల‌ను ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు తెలిసేలా చేయాలి. ప్ర‌తి కుటుంబాన్ని ఒక‌రే మొత్తం ఆర్థిక వ్య‌వ‌హారాలు చూడ‌టం కుద‌ర‌క‌పోవ‌చ్చు. అన్ని విష‌యాల్లో ఎవ‌రు స‌మ‌ర్థ‌వంతులు అనిపిస్తే వారు బ‌డ్జెట్ బాధ్య‌త తీసుకోవ‌డం మంచిది.

English summary

9 Financial Tips For Smart Working Couples In India

Financial decisions are always better when taken together. Initially, couples may find it difficult to manage their finances due to differences in penchant for risk and priorities. This is common in most households, but, a couple should agree on having a budget and an investment plan to lead a financially stable life in future.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC