For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌కు ఈ-ఫైలింగ్ ఉప‌యోగిస్తున్నారా? స‌ందేహాలా?

|

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌కు ఈ-ఫైలింగ్ ఉప‌యోగిస్తున్నారా? స‌ందేహాలా?
ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌కు ఈ-ఫైలింగ్ ఉప‌యోగిస్తున్నారా? అందులో ఏమైనా సందేహాలున్నాయా? అయితే ఇది చ‌ద‌వండి.
ప‌న్ను చెల్లింపుదార్లు సంవ‌త్స‌రంలో ఈ నెల‌లో బిజీగా ఉంటారు. ప‌న్ను రిట‌ర్నుల‌కు సంబంధించిన ప‌త్రాలు స‌రిచూసుకోవ‌డం, ఈ-ఫైలింగ్ ప్ర‌క్రియ న‌మోదు వంటివ‌న్నీ చేస్తూ ఉంటారు. రూ. 5 ల‌క్ష‌లకు పైగా ఆదాయం ఉన్న‌వారైతే ఎల‌క్ట్రానిక్ రూపంలోనే ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ క్ర‌మంలో ఎన్నో సందేహాలుంటాయి. మీకు ఏవైనా సందేహాలుంటే ఇన్‌క‌మ్ ట్యాక్స్ హెల్ప్‌లైన్ నంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ హెల్ప్ డెస్క్‌: 1800 4250 0025.
ఈ-ఫైలింగ్ ద్వారా రిట‌ర్నుల‌నుదాఖ‌లు చేసేటప్పుడు ఉండే ప‌లు సందేహాలు:
ఫారంల‌న్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత చెల్లింపులు చేయ‌లేదు.
ఆధార్ కార్డు అనుసంధానం చేసే విధానం తెలిసి ఉండ‌దు.
బ్యాంకు ఖాతా నంబ‌రు మార్చుకోవ‌డం తెలియ‌దు.
ఏ ఫారం వాడాలో తెలియ‌దు.
ప‌న్ను బ‌కాయి ఉంటే, ఎలా చెల్లించాలో తెలియ‌దు.

ఇవి సాధార‌ణంగా ఎక్కువ మందికి ఎదుర‌య్యేవి. వ్య‌క్తిని బ‌ట్టి ఇవి మారుతూ ఉంటాయి. హెల్ప్‌లైన్ నంబ‌రుకు ఫోన్ చేయ‌డం ద్వారా ఇందులో చాలా సందేహాల‌కు స‌మాధానాలు ల‌భిస్తాయి. ఈ ఫోన్‌లో హిందీలోనూ, ఇంగ్లీషులోనూ స‌మాధానాలిస్తారు.

 ఈ-ఫైలింగ్‌లో సందేహాలా?

ఈ-ఫైలింగ్ చేసేట‌ప్పుడు ఈ స‌మాచారం ఉండాలి:
అయితే మీకు సందేహం రాగానే ఇన్‌క‌మ్ ట్యాక్స్ హెల్ప్‌లైన్ నంబ‌రుకు ఫోన్ చేయాల్సిన ప‌ని లేదు. దాదాపు మీ సందేహాల‌ను గూగుల్‌లో వెతికితే చాలా వాటికి స‌మాధానాలు ల‌భిస్తాయి. అప్ప‌టికీ మీకు స‌రైన స‌మాధానం రాక‌పోతే ఫోన్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. కొన్ని పోర్ట‌ల్స్ సైతం ప‌న్ను చెల్లింపుదార్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తున్నాయి. ఇందుకోసం మెయిల్ ద్వారా మీ ప్ర‌శ్న‌ల‌ను పంప‌వ‌చ్చు. అయితే ఈ ఫైలింగ్ చేసేముందు మ‌న ద‌గ్గ‌ర ఏమేమి సిద్దంగా ఉంచుకోవాలో చూద్దాం.

ఇన్‌క‌మ్ ట్యాక్స్ పోర్ట‌ల్ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌
రీఫండ్ తొంద‌ర‌గా వచ్చేందుకు ఆధార్ అనుసంధానం
బ్యాంకు ఖాతా స‌రిగా అనుసంధానం చేసి ఉండాలి. మీ పాత ఖాతాను వాడ‌క‌పోతే దాన్ని తొల‌గించి కొత్త దాన్ని అప్‌డేట్ చేయండి లేక‌పోతే ఐటీ అధికారులు మీ పాత ఖాతాకు రీఫండ పంపుతారు.
తాజా చిరునామా లేదా శాశ్వ‌త చిరునామాను అధికారుల‌కు తెల‌పండి
26 ఏఎస్ ఫారం డౌన్‌లోడ్ పూర్తి
ఫారం 16 ఉంచుకోవాలి.

ప్రాథ‌మిక అంశాల కోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల‌కు కాల్ చేయ‌కండి. ఫోన్ చేసేముందు వివ‌రాల‌న్నీ ఒక పేప‌ర్ మీద లేదా డెస్క్‌టాప్ డాక్యుమెంట్ మీద సిద్దంగా ఉంచుకుంటే మంచిది.

Read more about: tax returns efiling
English summary

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌కు ఈ-ఫైలింగ్ ఉప‌యోగిస్తున్నారా? స‌ందేహాలా? | Where Can Tax Assesses Contact For Queries On efiling Tax Returns

It is the time of the year, when Income Tax Assesses are busy filing their tax returns. Remember, if your income is above Rs 5 lakhs, you need to file your tax returns in the electronic form. However, while filing tax returns there are many queries that can arise.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X