For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న్ను రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసేందుకు 6 వెబ్‌సైట్లు

|

జులై నెల వ‌చ్చిందంటే ప‌న్ను చెల్లింపుదారులంతా ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించ‌డంలో త‌ల‌మున‌క‌ల‌వుతారు. రూ. 5 ల‌క్ష‌ల పైబ‌డి ఆదాయం క‌లిగిన వారంతా క‌చ్చితంగా రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందుకు అవ‌కాశం క‌ల్పించే 7 వెబ్‌సైట్ల‌ను ఇక్క‌డ చూద్దాం.

 హెచ్ ఆర్ బ్లాక్‌

హెచ్ ఆర్ బ్లాక్‌

దేశంలో పన్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించేందుకు ప్ర‌ముఖమైన వెబ్‌సైట్ల‌లో హెచ్ఆర్ బ్లాక్ ఒక‌టి. ఈ వైబ్‌సైట్లో ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే మీరు ఫారం 16లో నింపిన వివ‌రాల‌ను తీసుకుని అది ఆటోమేటిక్‌గా వివ‌రాల‌ను నింపి మీ స‌మ‌యాన్ని ఆదా చేస్తుంది. మీకు సంబంధిత టీమ్ నుంచి కాల్ వ‌స్తుంది. మీ స‌మాచారం అంతా సెక్యూర్ ట్యాక్స్‌వాల్ట్‌లో భ‌ద్ర‌ప‌ర‌చ‌బ‌డి 256బిట్ ఎన్‌క్రిప్ష‌న్ జ‌రిగి ఉంటుంది. ఒక‌సారి మీరు ఫైలింగ్ చేయడం పూర్త‌యితే 24x7 ఎప్పుడైనా మీ వివ‌రాల‌ను చూసుకోవచ్చు.

 క్లియ‌ర్ ట్యాక్స్‌

క్లియ‌ర్ ట్యాక్స్‌

మీ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా స‌మ‌ర్పించేందుకు క్లియ‌ర్‌ట్యాక్స్ మీకు దోహ‌దం చేస్తుంది. ఈ ప‌ద్ద‌తిని ప్రారంభించేందుకు మీరు మీ మెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఇది ఒక సుల‌భ‌త‌ర‌మైన సాఫ్ట్‌వేర్‌. ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించేందుకు దేశంలోనే అత్యంత ఆద‌ర‌ణ క‌లిగిన వెబ్‌సైట్ ఇది.

ట్యాక్స్‌స్పాన‌ర్‌

ట్యాక్స్‌స్పాన‌ర్‌

మీ ట్యాక్స్ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించేందుకు ట్యాక్స్‌స్పాన‌ర్ కొంత రుసుమును వ‌సూలు చేస్తుంది. వేత‌న ఉద్యోగులకు ఎలాంటి రుసుము లేదు. ఇత‌ర విభాగాల్లో మ‌నం ఎంచుకునే ప్యాకేజీని బ‌ట్టి రుసుములు ఉంటాయి. 10 నుంచి 15 నిమిషాల్లో ప‌న్ను రిట‌ర్నుల‌ను చేసే ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

 ట్యాక్స్ స్మైల్‌

ట్యాక్స్ స్మైల్‌

ట్యాక్స్‌స్మైల్ రూ. 5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి ఉచిత సేవ‌లందిస్తోంది. ఇది మొత్తం మీరే చేసుకునేలా వీలుండేలా అవ‌కాశం క‌ల్పిస్తుంది. మీరు ఫారం 16ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు కొంత రుసుము ఉంటుంది. త‌ర్వాత మీరు చేయాల్సిందంతా సుల‌భంగానే పూర్త‌వుతుంది.

 విట్టెనా

విట్టెనా

దీనికి ఒక కార్ప‌రేట్ ఆడిట‌ర్ నేతృత్వం వ‌హిస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం చేత అనుమ‌తి పొందిన అధీకృత వెబ్‌సైట్ ఇది. మార్కెట్‌లోకి కొత్త‌గా ప్ర‌వేశించింది. ఇది ఉచితం కాదు. కొంత రుసుము వ‌సూలు చేస్తున్న‌ప్ప‌టికీ అది స‌హేతుకంగానే ఉంది.

భార‌త ప్ర‌భుత్వ వెబ్‌సైట్

భార‌త ప్ర‌భుత్వ వెబ్‌సైట్

http://incometaxindiaefiling.gov.in/ లో లాగిన్ అవ్వ‌డం ద్వారా ప‌న్ను రిట‌ర్నుల‌ను ఉచితంగా ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు. గ‌త కొన్ని నెల‌ల్లో వెబ్‌సైట్‌లో చాలా మార్పులు జ‌రిగాయి. ప‌న్ను చెల్లింపుదార్లు ఉప‌యోగించ‌డానికి సులువుగా ఉంది. మీ ప్ర‌శ్న‌ల‌ను, సందేహాల‌ను ఈమెయిల్ ద్వారా పంపి సైతం స‌మాధానాల‌ను పొంద‌వ‌చ్చు. హెల్ప్‌లైన్ ఏర్పాటు కూడా ఉంది.

English summary

ప‌న్ను రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసేందుకు 6 వెబ్‌సైట్లు | 6 Websites To File Income Tax Online; Some Are Free

It's the time of the year, when readers have already filed or are busy filing their tax returns. If your income is over Rs 5 lakhs, you need to file returns online. Here are 7 websites where you can do so.
Story first published: Wednesday, July 13, 2016, 14:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X