For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ప్రతి ఏటా టైమ్ మ్యాగజైన్ ప్రకటించే ప్రతిష్ఠాత్మక టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గుర్తింపు కోసం ఈసారి దాదాపు 50 మంది అంతర్జాతీయ నేతలు, వ్యాపార దిగ్గజాలు, పాప్ స్టార్లు పోటీపడుతున్నారు.

జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా బరిలో ఉన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వారపత్రిక టైమ్స్ మ్యాగజైన్ ప్రతిఏటా ఒకరికి టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' టైటిల్‌ను ఇస్తుంది.

ఈ ఏడాదిపై అత్యంత ప్రభావాన్ని చూపిన వ్యక్తిని టైమ్ మ్యాగజైన్ గుర్తించి, 'ద టైమ్ పర్సన్ అఫ్ ద ఇయర్ 2015' గా వచ్చే నెల ప్రకటించనుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావిత, కారణమేదైనా అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తికి ఈ గౌరవం దక్కనుంది.

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

భారత్‌లోకి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు, దేశాన్ని నవనాగరిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని టైమ్స్ మ్యాగజైన్ కితాబిచ్చింది.

గత ఏడాది కూడా మోడీ ఈ టైటిల్ కోసం పోటీలో నిలిచినప్పటికీ టైమ్స్ మ్యాగజైన్ ఎడిటర్లు ఆయనను ఎంపిక చేయలేదు. అయితే మోడీ రీడర్స్ పోల్ విజేతగా ఎన్నికయ్యారు. పాఠకుల అభిప్రాయ సేకరణ ప్రక్రియలో గతేడాది దాదాపు 50 లక్షల ఓట్లు పోలవగా.. అందులో 16 శాతం మోడీకే ఓటేయడం గమనార్హం.

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

రిలయన్స్ చైర్మన్ గురించి టైమ్స్ స్పందిస్తూ టెలికం నుంచి చమురు శుద్ధి వరకు పలు రంగాల్లో ముకేశ్ అంబానీ పలు రంగాల్లో తిరుగులేని శక్తిగా ఉన్నారని పేర్కొంది. గూగుల్‌లో 11 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సుందర్ పిచాయ్ సంస్థ సీఈఓగా ఎంపికయ్యారని పేర్కొంది.

 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

గతేడాది లాగే ఈ ఏడాది కూడా పర్సన్ అఫ్ ద ఇయర్‌కు ఎవరు అర్హులో పాఠకులు సైతం ఓట్ల ద్వారా ఎంచుకోవచ్చని టైమ్ తెలిపింది. మోడీకి ఇప్పటిదాకా 1.3 శాతం ఓట్లు దక్కగా అంతే స్థాయిలో పిచాయ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కూ ఓట్లు పడ్డాయి.

 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఐఎస్ఐఎస్ నేత అబు బరక్ అల్ బగ్దాది, హిల్లరీ క్లింటన్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలాలా, టెల్సా అధిపతి ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గతేడాది విజేత పోప్ ఫ్రాన్సిన్‌లూ ఉన్నారు. మహాత్మాగాంధీ, అడాల్ఫ్ హిట్లర్, ఎలిజిబెత్-2 నుంచి ఇప్పటిదాకా ఎంతో మందిని గత తొమ్మిది దశాబ్దాలుగా 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' గా టైమ్ ప్రకటిస్తూ వచ్చింది.

English summary

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: బరిలో మోడీ, అంబానీ, పిచాయ్ | Modi, Mukesh Ambani, Sundar Pichai Contenders For Time Person Of The Year

Prime Minister Narendra Modi, Reliance Industries chairperson Mukesh Ambani and Google chief executive officer Sundar Pichai are among more than 50 contenders for Time Person of the Year 2015.
Story first published: Friday, November 20, 2015, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X