For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి: ఏం చేస్తాయి?

By Nageswara Rao
|

బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విసృత పరచాలనే ఉద్దేశ్యంతో 11 కార్పొరేట్ సంస్థలకు చెల్లింపు బ్యాంక్ లైసెన్స్‌కు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం ప్రకటించింది.

ఇలా అనుమతులు పొందిన కంపెనీల్లో కార్పొరేట్‌ దిగ్గజాలు ముకేష్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండ స్ర్టీస్‌, కుమార మంగళం బిర్లా నాయకత్వంలోని ఆదిత్య బిర్లా నువో, ఆనంద్‌ మహీంద్రా నేతృత్వంలోని టెక్‌ మహీంద్రాతో పాటు దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఉన్న తపాలా శాఖ కూడా ఉంది.

అనుమతులు పొందిన ఇతర కంపెనీల్లో టెలికాం దిగ్గజాలు వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌, ఎన్‌ఎస్‌డిఎల్‌, చోళమండలం డిస్ర్టిబ్యూషన్‌ సర్వీసెస్‌, ఫినోపేటెక్‌ ఉన్నాయి. వీటితోపాటు సన్ ఫార్మా ప్రమోటర్ దిలీప్ శాంతిలాల్ షాంఘ్వీ, విజయ్ శేఖర్ శర్మకు చెందిన పేటీఎంలకు వ్యక్తిగత హోదాలో అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది.

ఈ లైసెన్స్‌కోసం 41 సంస్థలు దరఖాస్తు చేసుకోగా, దీంట్లో 11 కంపెనీలకు మాత్రమే లైసెన్స్ జారీ చేసినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ బ్యాంకులు ఏమేమి చేస్తాయంటే ...

 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

ఈ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన సూత్రప్రాయ అనుమతికి గడువు 18 నెలలు. ఈ కాలపరిమితిలోగా వారందరూ ఆర్‌ బిఐ నిర్దేశించిన షరతులు, నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిఉంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉన్న ట్టు భావిస్తే బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిర్వహణకు ఆయా సంస్థలు, వ్యక్తులకు ఆర్‌బిఐ తుది అనుమతులు మంజూరు చేస్తుంది.

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

ఈ అనుభవాన్ని ఆధారం చేసుకుని ఆర్‌బీఐ మరింతగా మార్గదర్శకాలకు భవిష్యత్తులో మరింత తరచుగా ఇలాంటి లైసెన్సులు జారీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లైసెన్సు లభించే వరకు సూత్రప్రాయ అనుమతికి లోబడి ఎలాంటి బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించకూడదు.

 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

ప్రస్తుతం దేశంలో 27 పిఎస్‌యు బ్యాంకులు, 20 ప్రైవేటు బ్యాంకులు, 44 విదేశీ బ్యాంకులు, 4 లోకల్‌ ఏరియా బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పని చేస్తున్నాయి. కాగా పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐడిఎఫ్‌సి, బంధన్‌ సంస్థలకు గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్‌బీఐ లైసెన్సులు మంజూరు చేసింది.

 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

ఆ రెండు సంస్థలు ఇంకా ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. వారికి బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు అక్టోబర్‌ వరకు గడువు ఉంది. ఈ విడతలో లైసెన్సులు పొందలేకపోయిన కంపెనీలు మలివిడతల్లో అర్హత సాధించవచ్చునని ఆర్‌బీఐ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోకి తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే లక్ష్యంతో ఉన్న బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఇలాంటి బ్యాంకులతో అవగాహన ఒప్పందాల ద్వారా పరిధి విస్తరించుకునే వీలుంది.

 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

ఆర్‌ఐఎల్ ఏర్పాటు చేయనున్న పేమెంట్ బ్యాంకులో ఎస్‌బీఐకి 30 శాతం వాటా ఉండనుండగా, భారతీ ఎయిర్‌టెల్ ప్రారంభించనున్న సంస్థలో కొటక్ మహీంద్రా బ్యాంకుకు 19.9 శాతం కేటాయించనున్నది. ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్ ఐడియాతో కలిసి పనిచేయనున్నది. ఈ యూనిట్‌లో ఐడియా 49 శాతం వాటా కలిగివుండనున్నది.

 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం

పేమెంట్ బ్యాంకులు లైసెన్స్‌లు పొందిన సంస్థలు 18 నెలల్లో సర్వీసులు అందించకపోతే ఈ లైసెన్స్ రద్దు అవుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తపాలాశాఖకు పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రావడం సంతోషంగా ఉందని, ఇకనుంచి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

* ఇవి సాధారణ బ్యాంకలతో పోలిస్తే పూర్తిగా భిన్నం.
* చిన్న మొత్తాల్లో డిమాండ్‌ డిపాజిట్ల సమీకరణ, చెల్లింపు సేవలు అందిస్తాయి.
* మొదట్లో ఈ బ్యాంకులు లక్ష రూపాయల వరకు డిమాండ్‌ డిపాజిట్లు సేకరించవచ్చు.
* రుణాలు మంజూరు చేసే అర్హత లేదు.
* ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, నగదు బదిలీ, ఎటిఎం/డెబిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ కార్డులు జారీ చేయవచ్చు.
* క్రెడిట్‌ కార్డులు జారీ చేసే అర్హత లేదు.
* ఇలాంటి బ్యాంకుల్లో ప్రవాస భారతీయులు ఖాతాలు తెరవకూడదు.
* మ్యూచువల్‌ ఫండ్‌లు, బీమా ఉత్పత్తులు కూడా విక్రయించవచ్చు.
* ఒక్కో కస్టమర్‌ ఖాతాలో గరిష్ఠంగా లక్ష రూపాయలకు మించి నిల్వను అనుమతించరు.

English summary

పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి: ఏం చేస్తాయి? | Banking revolution on cards: RBI clears 11 payments banks

Banking, as we have known it, appears headed for an upheaval. The Reserve Bank of India on Wednesday 'in principle' cleared 11 entities - including department of posts, top conglomerates such as Reliance Industries and Aditya Birla Group, telecom giants like Airtel and Vodafone, and a number of tech and finance companies - to set up 'payments banks'.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X