For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త: తగ్గనున్న గృహ, వాహన రుణ వడ్డీరేట్లు

|

ముంబై: గృహ, వాహన రుణాలు తీసుకున్నవారికి శుభవార్త. గృహ, వాహన, ఇతర వినియోగ రుణాలు మరింత చవకగా మారనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి నెలవారీ వాయిదా (ఈఎంఐ) భారం తగ్గనుంది. ఎవరూ ఊహించని విధంగా భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గి స్తూ గురువారం నిర్ణయం తీసుకుంది.

దీంతో రెపో 8 శాతం నుంచి 7.75 శాతానికి, రివర్స్ రెపో 6.75 శాతానికి తగ్గాయి. బ్యాంకుల నగదు నిల్వ నిష్పత్తిని (సీఆర్‌ఆర్) మాత్రం యథాతథంగా 4 శాతం వద్దే ఉంచింది ఆర్‌బీఐ. ఈ 20 నెలల్లో రెపో రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. మున్ముందు మరింత తగ్గించనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది. దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మొదలుపెట్టాయి.

ఆర్‌బీఐ రెపోరేట్లు తగ్గించిన కొన్ని గంటల సమయంలోనే యునైటెడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు రుణాలపైనా వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా వడ్డీరేట్ల తగ్గింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి.

Home Loan EMIs May Fall by Up to Rs 8,000 Soon

ఈ నిర్ణయంతో ఇటు రుణ గ్రహీతలు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. స్టాక్‌మార్కెట్ వర్గాలైతే ఆనంద పరవశంతో పులకరించిపోయారు. గతనెలకు టోకు ధరలతోపాటు రిటైల్ మార్కెట్లోనూ ధరలు ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యంలోపే నమోదయ్యాయి.

సమీప భవిష్యత్‌లో ధరలు భారీగా పెరిగే అవకాశాలైతే కన్పించట్లేదు. దీంతో వచ్చేనెల 3న జరుగబోయే ద్రవ్యవిధాన సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరో పావు శాతం తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ రెపోరేట్లను ఒక శాతం మేర తగ్గించవచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది చివరినాటికి గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు పెద్ద మొత్తంలో తగ్గేందుకు అవకాశాలున్నాయి.

English summary

శుభవార్త: తగ్గనున్న గృహ, వాహన రుణ వడ్డీరేట్లు | Home Loan EMIs May Fall by Up to Rs 8,000 Soon


 Home loan consumers, struggling under the burden of high EMIs, finally have a reason to smile after RBI Governor Raghuram Rajan cut repo rate by 0.25 per cent on Thursday.
Story first published: Saturday, January 17, 2015, 14:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X