For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీయులను ఆకర్షిస్తున్న మోడీ-రాజన్-కమోడిటీస్

|

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్-కమోడిటీ అంశాల త్రయమే ఇండియాలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణ అని అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటీ గూపు తాజా నివేదికలో వెల్లడించింది.

పారిశ్రాశామిక రంగానికి అనుకూలమైన మోడీ ప్రభుత్వం.. ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేపట్టిన చర్యలు.. తగ్గుతున్న కమోడిటీ ధరలు భారత్‌ను అమెరికా కంపెనీల హాట్ ఫేవరేట్‌గా నిలబెట్టాయని పేర్కొంది. ‘ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతోపాటు రష్యా సంక్షోభ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడుతున్న ప్రతికూల సంకేతాల నుంచి భారత్ పూర్తిగా సురక్షితం అని చెప్పలేమని, కానీ మిగతా దేశాలతో పోలిస్తే మేల అని సిటీ గ్రూపు ఆర్థికవేత్తలంటున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు జూన్‌లో నమోదైన స్థాయి నుంచి దాదాపు సగానికి పడిపోయాయి. దేశీయ ఇంధన అవసరాల్లో 0 శాతం దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఈ పరిణామం బాగా కలిసిరానుందని, దేశ స్థూల ఆర్థికాంశాలు మెరుగవుతున్నాయని, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పుంజుకుంటున్నాయని సిటీక్షిగూపు రిపోర్టు పేర్కొంది.

Modi-Rajan-Commodities trinity keeping India a favourite: Citi

ఈ ఏడాదిలో భారత మార్కెట్లు అత్యంత ఆశాజనక పనితీరును కనబర్చాయని, దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ బాటలో పయనిస్తున్నందున వచ్చే సంవత్సరంలోనూ మార్కెట్ మరింత పుంజుకోనుందని నివేదిక అంచనా వేసింది. ఇండియా ప్రగతిపై భారీ అంచనాలున్నప్పటికీ.. 2013 తరహా పరిణామాలు మళ్లీ అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లకు నష్టాలబాటలో నడిపింవచ్చని ఇన్వెస్టర్లు ఒకింత ఆందోళన చెందుతున్నారని నివేదిక వెల్లడించింది.

నిరుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనాలను వెనక్కి తీసుకోనుందన్న భయాలతో భారత్‌తోపాటు ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి సంస్థాగత పెట్టుబడిదారులు పెద్దఎత్తున పెట్టుబడలను ఉపసంహరించుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాదిలో వడ్డీరేట్లు పెంచనున్న నేపథ్యంలో మళ్లీ పెట్టుబడిదారులు ఆందోళనకు లోనై భారీగా ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంది.

అలాగే బ్యాంకుల్లో పెరుగుతున్న మొండిబకాయిల సమస్య, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అడ్డంకితో నిలిచిపోయిన సంస్కరణలతోపాటు ద్రవ్యలోటు అంశాలు కూడా ఇన్వెస్టర్లకు ఆందోళన కల్గిస్తున్నాయని సిటీక్షిగూపు నివేదిక పేర్కొంది. అయితే 2015లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మున్ముందు దేశ ఆర్థిక వృద్ధిరేటు 7 శాతానికి చేరుకోగలదని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండనుందని నివేదికలో వెల్లడించింది.

English summary

విదేశీయులను ఆకర్షిస్తున్న మోడీ-రాజన్-కమోడిటీస్ | Modi-Rajan-Commodities trinity keeping India a favourite: Citi

India remains a consensus favourite investment destination for US companies, largely on the back of a 'Modi-Rajan-Commodities trinity', global financial major Citigroup said in a report today.
Story first published: Tuesday, December 23, 2014, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X