For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన ఆంధ్రాబ్యాంక్ లాభాలు: నష్టాల్లో ర్యాన్‌బాక్సీ

|

హైదరాబాద్: ఆంధ్రా బ్యాంక్ లాభాలు భారీగా తగ్గాయి. ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌కె కల్రా ఈ మేరకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసికం ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికమైన ఈ జనవరి-మార్చి వ్యవధిలో బ్యాంకు 88.08 కోట్ల రూపాయల లాభాలతోనే సరిపెట్టుకుంది. అయతే 2012-13 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మాత్రం 344.58 కోట్ల రూపాయల లాభాలను సాధించింది.

ఇక ఈసారి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం 9.3 శాతం పెరిగి 4,057.89 కోట్ల రూపాయలను తాకింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 3,713.03 కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. కాగా, గత సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొండి బకాయలు 187.86 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి అవి 666.65 కోట్ల రూపాయలకు పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మొత్తం ఆదాయం 12 శాతం పెరిగి 15,630 కోట్లకు చేరింది.

Rising bad loans pull Andhra Bank Q4 net down 75%

రానున్న రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 400 నుంచి 500 వరకు కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది నాటికి 1,500 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌కె కల్రా తెలిపారు.

కార్పొరేషన్ బ్యాంక్

ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభాలు ఈ జనవరి-మార్చి వ్యవధిలో 88.3 శాతం క్షీణించి 41.57 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. లాభాల తగ్గుదలకు పెరిగిన మొండి బకాయిలే కారణమని సంస్థ తెలిపింది. అంతకుముందు 355.53 కోట్ల రూపాయల లాభాలను పొందింది. ఆదాయం 5,032.62 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 4,635.50 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం నికర లాభాలు సైతం 1,434.67 కోట్ల రూపాయల నుంచి రూ. 561.72 కోట్లకు క్షీణించాయి. ఆదాయం మాత్రం 16,942 కోట్ల రూపాయల నుంచి రూ. 19,606.29 కోట్లకు పెరిగింది.

నష్టాల్లో ర్యాన్‌బాక్సీ

న్యూఢిల్లీ/కోల్‌కతా:: ఔషధరంగ దిగ్గజం రాన్‌బాక్సీ లాబొరేటరీస్ ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 73.6 కోట్ల రూపాయల ఏకీకృత నష్టాలను నమోదు చేసింది. ఈ మధ్యే సన్ ఫార్మా కొనుగోలు చేసిన ఈ సంస్థ గత ఏడాది ఇదే వ్యవధిలో 125.75 కోట్ల రూపాయల నికర లాభాలను అందుకుంది. నికర అమ్మకాలు 2,411.1 కోట్ల నుంచి 2,436.1 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

ఎమ్‌పి బిర్లా గ్రూప్‌నకు చెందిన బిర్లా కార్పొరేషన్ నికర లాభాలు ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 64 శాతం క్షీణించి 26.2 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరి-మార్చిలో ఈ సంస్థ 72.63 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించింది. ఆదాయం మాత్రం 17 శాతం పెరిగి 793.5 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు 678 కోట్ల రూపాయలకు పరిమితమైంది.

English summary

భారీగా తగ్గిన ఆంధ్రాబ్యాంక్ లాభాలు: నష్టాల్లో ర్యాన్‌బాక్సీ | Rising bad loans pull Andhra Bank Q4 net down 75%

Rising bad loans and higher provisioning for them dragged down the net profit of Andhra Bank by 74.49 per cent during the quarter ended March 31.
Story first published: Saturday, May 10, 2014, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X