For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్ మహీంద్రాలో నకిలీ ఉద్యోగాల రాకెట్ గుట్టురట్టు

|

Tech Mahindra busts fake offer racket
న్యూఢిల్లీ/ముంబై : సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఢిల్లీ, పుణె, ముంబైలలో సాగుతున్న ఈ నకిలీ దందాను ఓ వ్యక్తి గుర్తించి తమ దృష్టికి తీసుకురావటంతో దీన్ని ఛేదించినట్లు టెక్ మహీంద్రా తెలిపింది. ఒక్కో అభ్యర్థి నుంచి 9 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్లను ఇస్తున్నట్లు విచారణలో వెల్లడికావటంతో పోలీసుల సహకారంతో వీరిని పట్టుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఈ నకిలీ రాకెట్ దందా గురించి సదరు వ్యక్తి ఇచ్చిన వివరాల ఆధారంగా వారిని నిందితులను పట్టుకున్నట్లు టెక్ మహీంద్రా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థలో ఏ ఉద్యోగం కావాలన్నా ఏ విధంగానూ డబ్బు చెల్లించనవసరం లేదని అలాంటి మోసపూరిత ప్రకటనలను చూసి నమ్మవద్దని, పనితనం, నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని టెక్ మహీంద్రా చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాఖేష్ సోనీ తెలిపారు.

కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తమకు తెలియజేయటమే కాకుండా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రాకెట్‌కు సంబంధించి పోలీసులు పరిశోధనను కొనసాగిస్తున్నారని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే తెలుస్తుందని టెక్ మహీంద్రా తెలిపింది.

నేడు పరపతి విధానాన్ని సమీక్షించనున్న ఆర్‌బిఐ

ముంబై: రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక రేట్ల పెంపు ఉండొచ్చని ఒక రోజు ముందుగానే రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలిచ్చారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. ఆర్‌బిఐ మంగళవారం పరపతి విధాన సమీక్ష చేయనుంది.

మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనాను రిజర్వ్ బ్యాంకు తగ్గించింది. ఇంతకుముందు 5.7 శాతంగా ఉన్న అంచనాను 4.8 శాతానికి కుదించింది. 2013-14లో స్థూల ఆర్థిక-ద్రవ్యవిధాన అభివృద్ధిపై రెండో త్రైమాసిక సమీక్షను ఆర్‌బిఐ నిర్వహించింది. ఆర్‌బిఐ చేసిన అధ్యయనంలో మందగమన, ప్రతికూల పరిస్థితుల కారణంగా వృద్ధిరేటు దిగజారుతుందని స్పష్టమైంది.

ప్రస్తుతం విస్తృతంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగుమతులు, పారిశ్రామిక ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో వృద్ధిరేటు పుంజుకుంటునే అవకాశాలున్నట్లు తాము భావిస్తున్నట్లు రాజన్ తెలిపారు. కాగా, పెరుగుతున్న రెవిన్యూ లోటు, అధిక పెట్టుబడి వ్యయంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ద్రవ్యలోటు ప్రమాదకరంగా మారనుందని ఆయన హెచ్చరించారు.

English summary

టెక్ మహీంద్రాలో నకిలీ ఉద్యోగాల రాకెట్ గుట్టురట్టు | Tech Mahindra busts fake offer racket

Tech Mahindra in collaboration with the police authorities busted a fake jobs racket that was issuing fake offer letter to aspiring candidates for jobs at Tech Mahindra, while collecting cash amount ranging between Rs 9000 to Rs 2 lakh each.
Story first published: Tuesday, October 29, 2013, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X