For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త బ్యాంకింగ్ లైసెన్సులకు మరికొంత సమయం: ఆర్‌బీఐ

By Nageswara Rao
|

Reserve Bank of India
ముంబై: కొత్త బ్యాంకులకు లైసెన్సులను ఇచ్చే విషయంలో నిబంధనలు సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న 26 దరఖాస్తులపై ఆర్‌బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అంతర్గత పరశీలన పూర్తైన తర్వాత దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్‌టర్నల్)ని నియమించడం జరుగుతుందని అన్నారు.

జులై 1 నాటికి మొత్తం 26 కంపెనీలు కొత్త బ్యాంకింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిల్లో ముఖ్యంగా జపాన్ బీమా దిగ్గజం నిప్పన్ లైఫ్, సుమిటోమో మిత్సుయి ట్రస్ట్‌తో జత కట్టిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ దరఖాస్తు చేసింది. ఆదిత్య బిర్లా నువో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు సూక్ష్మ రుణ సంస్థలైన బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జనలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బ్యాంకింగ్ బరిలో ఉన్నాయి.

ఈ మార్గదర్శకాల ప్రకారం లైసెన్సు పొందిన కొత్త బ్యాంకులు 18 నెలల్లోగా తమ శాఖలను ప్రారంభించాల్సి ఉంది. గతంలో ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ అన్ని అర్హతలున్నా, దరఖాస్తు చేసుకున్న ప్రతి సంస్థకు లెసైన్సు ఇచ్చే అవకాశాలు తక్కువని అన్నారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికల్లా లెసైన్సులు జారీ అయ్యే అవకాశముందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ టక్రూ గతంలో తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేశంలో 26 ప్రభుత్వరంగ, 22 ప్రైవేట్ బ్యాంకులు, 56 గ్రామీణ బ్యాంకులు ఉన్నా యి. దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది.

అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది.

వన్‌ఇండియా మనీ తెలుగు

English summary

కొత్త బ్యాంకింగ్ లైసెన్సులకు మరికొంత సమయం: ఆర్‌బీఐ | New bank licences will take some time RBI

Reserve Bank of India (RBI) has started scrutiny of applications and Deputy Governor Anand Sinha has said that the whole exercise will take some time to complete, suggested media reports.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X