For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్స్ కోసం ఆర్‌బీఐ రూ. 25,000 కోట్ల రుణాలు

By Nageswara Rao
|

Reserve Bank of India
ముంబై: రూపాయి పతనం.. లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 25,000 కోట్ల వరకు రుణాలకు అవకాశాన్ని కల్పించింది. దీంతో బ్యాంకులకు మూడు రోజుల రెపో వేలం ద్వారా సుమారు రూ. 25,000 కోట్ల నిధులు లభించనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని 10.25 శాతం వడ్డీ రేటుతో అందించనుంది. ఈ నిధులను తీసుకున్న తర్వాత బ్యాంకులు వీటిని తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌కు రుణాలిచ్చేందుకు వివియోగించాల్సి ఉంది. తర్వాత నోటీసును జారీ చేసే వరకూ వీటిని స్వల్ప కాలానికి అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

ఇటీవల కాలంలో వివిధ పథకాలను విలీనం చేయడం.. లాభాల స్వీకరణ వంటి అంశాల కారణంగా ఈక్విటీ ఫోలియోలు మురిగిపోతున్న విషయం తెలిసిందే. సెబీ గణాంకాల ప్రకారం గతేడాదిలో ఫండ్స్ నుంచి 36 లక్షల మంది ఇన్వెస్టర్లు వైదొలిగారు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో పరిశ్రమ 10 లక్షల ఫోలియోలను కోల్పోయింది. ఫోలియో అంటే రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాలకు సంబంధించిన వివరాలు.

సెబీకి మరిన్ని అధికారులు:

మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్థ సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. తద్వారా పొంజీ స్కీములు, ఇన్వెస్టర్లను మోసం చేస్తూ అవకతవకలకు పాల్పడేవారి భరతం పట్టనుంది. ఈ అధికారాలు కార్యరూపం దాల్చితే పోన్ కాల్ డేటా రికార్డులను పొందడం, తనిఖీ చేపట్టడం, కార్యకలాపాలను నిలిపివేయడం, ఆస్తులను అటాచ్ చేయడం వంటి అధికారాలను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం సెబీ తనిఖీలు, ఆస్తుల జప్తు వంటివి చేపట్టేందుకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుమతిని పొందాల్సి ఉంటోంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

మ్యూచువల్ ఫండ్స్ కోసం ఆర్‌బీఐ రూ. 25,000 కోట్ల రుణాలు | RBI opens R25,000-crore liquidity window for MFs as redemptions surge

The Reserve Bank of India (RBI) on Wednesday said it would open a special R25,000-crore liquidity window to cater to the needs of mutual funds. Funds have been forced to sell assets after investors withdrew an estimated R30,000-40,000 crore.
Story first published: Thursday, July 18, 2013, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X