For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాస్కామ్ ప్రెసిడెంట్‌ మాజీ టెలికం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్

By Nageswara Rao
|

Chandrasekhar
పుణె: నాస్కామ్ ప్రెసిడెంట్‌గా మాజీ టెలికం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఆరేళ్లుగా ఈ పదవిలో ఉన్న సోమ్ మిట్టల్ పదవీ కాలం జనవరి 2014తో ముగియనుంది. సోమ్ మిట్టల్ స్దానంలో చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు నాస్కామ్ తెలిపింది. ఇక్కడ జరిగిన నాస్కామ్ సభ్యత్వ కంపెనీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్ సరికొత్త ఐటీ పరిశ్రమ నిర్మాణానికి సహకారం అందించనున్నందుకు సంతోషంగా ఉందని నాస్కామ్ ఛైర్మన్ కృష్ణ కుమార్ నటరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ నాస్కామ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నాస్కామ్‌తో పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందని చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ టెలికం ఛైర్మన్‌గా, టెలికం విభాగం కార్యదర్శిగా 2013, మార్చి వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2020 నాటికి ఐటీ రంగం నుండి రూ. 30,000 కోట్ల (300 బిలియన్ డాలర్లు) రెవెన్యూ సాధించాలన్న నాస్కామ్ లక్ష్యం కోసం కొత్త ప్రెసిడెంట్, చంద్రశేఖర్ కృషి చేయాల్సి ఉంటుంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

నాస్కామ్ ప్రెసిడెంట్‌ మాజీ టెలికం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్ | Chandrasekhar set to head Nasscom | నాస్కామ్ ప్రెసిడెంట్‌ మాజీ టెలికం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్

Former telecom secretary R Chandrasekhar will succeed SomMittal as president of the $100-billion IT industry's apex body Nasscom, sources familiar with the development said.
Story first published: Saturday, July 6, 2013, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X