For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్నెగి మెలన్ యూనివర్సిటీ బోర్డు ట్రస్టీలో కుశాగ్ర బజాజ్

By Nageswara Rao
|

Kushagra Nayan Bajaj
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన కార్నెగి మెలన్ యూనివర్సిటీ ధర్మకర్తల బోర్డులో బజాజ్ హిందూస్దాన్ వైస్ ఛైర్మన్, సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ కుశాగ్ర నయన్ బజాజ్‌కు స్దానం లభించింది. వివరాల్లోకి వెళితే కార్నెగి మెలన్ యూనివర్సిటీ మెంబర్స్ ఆఫ్ ట్రస్టీలో ఈయన సభ్యుడిగా ఎన్నికయ్యారు. జులై ఒకటి నుండి మూడు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారని బజాజ్ హిందూస్దాన్ తెలిపింది. కార్నెగి మెలన్ యూనివర్సిటీ ట్రస్టీల బోర్డుకు ఎన్నికైన ఏకైక భారతీయుడు కుశాగ్ర బజాజ్ కావడం గర్వించదగ్గ విషయం.

కార్నెగి మెలన్ యూనివర్సిటీ నుండి సైన్స్ ఇన్ ఎకనమిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ అండ్ ఫైనాన్స్‌లో కుశాగ్ర బజాజ్ పట్టా పొందారు. ఆ తర్వాత చికాగోలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీ నుండి మార్కెటింగ్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. అంతర్జాతీయ పరిశోధనలకు కార్నెగి మెలన్ యూనివరిస్టీ పెట్టింది పేరు. బజాజ్ గ్రూప్ $ 1.8 బిలియన్ల ఆదాయంతో పాటు $ 4.5 బిలియన్ సంఘటిత ఆస్తులతో పాటు చక్కెర, ఇథనాల్, రియల్ ఎస్టేట్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కలిగి ఉంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

కార్నెగి మెలన్ యూనివర్సిటీ బోర్డు ట్రస్టీలో కుశాగ్ర బజాజ్ | Kushagra Bajaj elected on Carnegie Mellon University board | కార్నెగి మెలన్ యూనివర్సిటీ బోర్డు ట్రస్టీలో కుశాగ్ర బజాజ్

Vice Chairman of Bajaj Group Kushagra Nayan Bajaj has been elected as a member of the Board of Trustees of the prestigious Carnegie Mellon University, for a three-year term.
Story first published: Thursday, June 20, 2013, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X