For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రజారాలా.. దయచేసి బంగారానికి దూరంగా ఉండండి: చిదంబరం

By Nageswara Rao
|

Chidambaram
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒక్కసారిగా పతనమవ్వడంతో బోగ్గు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ ధరలు పెరుగుతుండటంతో జూన్ నెలఖారులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రివ్యూ మీటింగ్‌కి ప్లాన్ చేసినట్లు కేంద్ర ఆర్దిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వీటితో పాటు గత సెప్టెంబర్ రూపాయి మారకపు విలువని గమనించినట్లైతే ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బంగారం మదుపు మరియు విక్రయాలపై మేము చేస్తున్న విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకోని దేశ ప్రజలు బంగారం కోనుగోలు తగ్గించుకోవాలని సూచించారు. ఒక వైపు కరెంట్ లోటు పెరిగి.. దేశ ఆర్ధిక వ్యవస్దకు పెనుభారం అవుతుండటంతో బంగారం దిగుమతులను కూడా ఆర్‌బీఐ తగ్గించిన విషయాన్ని ప్రస్తావించారు.

మనదేశంలో 30 గ్రాముల బంగారు కూడా ఉత్పత్తి కావడం లేదని, సాధ్యమైనంత వరకూ ప్రజలు బంగారానికి దూరుంగా ఉండాలని పి. చిదంబరం మరోసారి ప్రజలకు తెలిపారు. మే మొదటి వారంలో బంగారం దిగుమతులు $135 మిలియన్ నుండి మే చివరి వారం వచ్చేసరికి $36 మిలియన్లకు తగ్గాయని అన్నారు. రూపాయి పతనం కావడంతో క్రూడ్ ఆయిల్, సహాయ వాయువులు, ఎరువులు ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారాయన్నారు. మనం దిగుమతి చేసుకునే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో అదే స్దాయిలో ఉన్నప్పటికీ.. రూపాయి పతనం కావడంతో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మే ప్రారంభం నుండి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే క్షీణించింది. మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58.39 వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది.

రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయిం

తెలుగు వన్ఇండియా

English summary

ప్రజారాలా.. దయచేసి బంగారానికి దూరంగా ఉండండి: చిదంబరం | Chidambaram to Indians Please, don't buy gold | ప్రజారాలా.. దయచేసి బంగారానికి దూరంగా ఉండండి: చిదంబరం

The finance minister made an appeal to Indians to stop buying gold. "India does not produce an ounce of gold. You pay in rupee, but the government has to spend dollars to buy gold," Chidambaram said.
Story first published: Thursday, June 13, 2013, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X