For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Q1 2013లో ఏయే స్టాక్స్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అమ్మింది..!

By Nageswara Rao
|

దేశీయ అతి పెద్ద పెట్టుబడిదారుల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), విదేశీ నిధులు భారీగా కొనుగోళ్లు చేసినప్పటికీ, 2013 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో స్టాక్ మార్కెట్ ఎంపిక స్టాక్స్‌‌లో బహిర్గతం తగ్గించింది. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ తగ్గించిన కొన్ని స్టాక్స్‌ను పరిశీలిద్దాం.

ఎల్ఐసీ 2012-13వ తొలి త్రైమాసికానికి గాను (Q1 April-June) 200 కోట్ల డాలర్లు (దాదాపు రూ.11,000 కోట్లు) పెట్టుబడుల మేరకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఇంధనం, సాప్ట్‌వేర్ రంగాల స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు జరిపినట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్‌లించ్ తన తాజా నివేదికలో తెలిపింది.

నివేదిక ప్రకారం ఎన్‌టీపీసీలో 53.1 కోట్ల డాలర్లు, ఇన్పోసిస్ 35.6 కోట్ల డాలర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 26.9 కోట్ల డాలర్లు, కెయిర్న్ ఇండియా 22.1 కోట్ల డాలర్లు, బజాజ్ ఆటో 19.9 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. ఇది ఇలా ఉంటే మీడియా, హోటళ్లు, కన్సూమర్ గూడ్స్ సంస్దలకు చెందిన 11.5 డాలర్లు (దాదాపు రూ. 638 కోట్లు) విలువ కలిగిన స్టాక్స్ అమ్మేసింది.

ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్

ఫైనాన్షియల్ ఇయర్ Q3, 2013లో ఇన్పోసిస్ కంపెనీ స్టాక్ మార్కెట్లో మంచి లాభాలను నమోదు చేసినప్పటికీ.. ఎల్ఐసీ సంస్ద 2013 మొదటి త్రైమాసికంలో 80 లక్షల మేరకు వాటాలు కంపెనీ వాటాలను అమ్మింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

బ్యాంకింగ్ ఫేవరేట్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవల కాలంలో మనీ లాండరింగ్ చేస్తున్న అపవాదు ఎదుర్కొంది. దీంతో ఎల్‌ఐసీ మార్చి 31, 2013 మొదటి త్రైమాసికానికి గాను సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే షేర్లను అమ్మింది.

హిందుస్దాన్ లీవర్

హిందుస్దాన్ లీవర్

హిందూస్తాన్ లీవర్ మాతృ సంస్ద రాయల్టీ చెందిన Q3 స్టాక్స్.. స్టాక్ మార్కెట్లో పెరుగుదల తరువాత ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో 2013 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఎల్ఐసీ 1.3 కోట్ల షేర్లను బహిర్గతంగా తగ్గించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన రూ. 20 లక్షల విలువైన షేర్లను అమ్మింది.

Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X