For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్ఎంఎస్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు చేయనున్న హెచ్‌డీఎఫ్‌సీ

By Nageswara Rao
|

HDFC Bank to charge customers for InstaAlert SMSes
న్యూఢిల్లీ: దేశపు రెండవ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ సోమవారం నుండి తమ వినియోగదారుల నుండి ఇన్‌స్టా అలర్ట్ ఎస్ఎంఎస్ సర్వీసు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఖాతాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అకౌంట్ల లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోళ్ళు, బ్యాలన్స్ వివరాలను ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పంపుతుంది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన ఈ సేవలకు రుసుం చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బ్యాంక్ తెలిపింది.

ఏప్రిల్ 1, 2013 నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ రిజిష్టరు చేసుకున్న ఖాతాదారులు అదనంగా రుసుం చెల్లించాల్సిందిగా కోరింది. ఇన్‌స్టా అలర్ట్ క్రింద రిజిష్టర్ చేసుకున్న పొదుపు ఖాతాదారులు/శాలరీ ఎకౌంట్ కలిగిన వారు మూడు నెలలకు రూ.15, అదే కరెంటు ఖాతాదారులు మూడు నెలలకు రూ. 25 చెల్లించాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. ఐతే బ్యాంకుకు సంబంధించి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్‌కార్డు లావాదేవీల ద్వారా జరిగే వాటికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరని తెలిపింది.

కస్టమర్లు ఇప్పటికే ఈ సర్వీసులో రిజిష్టరు చేసుకున్న వారికి ఉచితంగా అందు బాటులో వస్తాయి. ఈ సేవలు ఇండియాలో హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా కలిగిన వారితో పాటు, విదేశాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎకౌంట్ కలిగిన వారికి వర్తిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్పేర్కొంది.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

ఎస్ఎంఎస్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు చేయనున్న హెచ్‌డీఎఫ్‌సీ | HDFC Bank to charge customers for InstaAlert SMSes | ఎస్ఎంఎస్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు

The country’s second largest private sector lender HDFC Bank will begin charging its customers from Monday for its InstaAlert SMS service, under which the bank provides real-time alerts on account activities.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X