For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రిక్స్ బ్యాంక్ భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకుతో పోటీపడుతుంది..!

By Nageswara Rao
|

BRICS to set up development bank, create $100 billion contingency reserve
బ్రిక్స్ దేశాల ఆర్థికమంత్రులు మంగళవారం సమావేశమై ఐదు దేశాలకు కలిపి బ్రిక్స్‌ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ దేశాల్లో మౌలిక రంగం ప్రాజెక్టులతో పాటు నిధులు సమకూర్చుకోవడానికి ఈ బ్యాంక్ దోహదపడుతుంది. బ్రిక్స్ దేశాల వాణిజ్యాభివృద్ధికి ఈ బ్యాంకు ఎంతో దోహదం చేస్తుందని.. ప్రస్తుతం ఆ దేశాలకు ఉన్న రాజకీయ విజయాల కంటే కూడా ఆర్థిక విజయాలే కీలకమని జిమ్ ఓనీల్ వ్యాఖ్యానించారు. ఐదు దేశాల ప్రభుత్వ చీఫ్‌లకు బ్రిక్స్‌ బ్యాంకు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో వారికి తెలియజేస్తామని భారత ఆర్థికశాఖ మంత్రి పి చిదంబరం చెప్పారు.

దీనికి కావాల్సిన మూలధనం, సభ్యత్వం, గవర్నె న్స్‌పై పూర్తిగా స్పష్టత ఇంకా రాలేదు. బహుశా వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తి కావచ్చునని వారు చెప్పారు. భారత్‌ తరపున బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిక్కీ అధ్యక్షురాలు నైనా లాల్‌ కిద్వాయ్‌ బ్రిక్స్‌ బ్యాంకు ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. ముందుగా బ్రిక్స్‌ బ్యాంకు కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న బ్యాంకులు దేశంలోని పలు ప్రాజెక్టులకు రుణాలు అందించలేకపోతుండడంతో... రుణాలతో పాటు కాలపరిమితి కారణాల వల్ల బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వలేకపోతున్నాయి. బ్రిక్స్‌ బ్యాంకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక రంగాలకు ప్రాజెక్టులతో పాటు, డెవెలెప్‌మెంటు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎలాంటి వ్యాపారాలు చేస్తాయో వాటికి పోటీగా బ్రిక్స్‌ బ్యాంకు పోటీపడాలని ఆమె అన్నారు.

ఇది ఇలా ఉంటే బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేయనున్న బ్యాంక్, రాబోయే కాలంలో ప్రపంచ బ్యాంకుగా రూపొందే అవకాశముందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఇందుకు వర్ధమాన దేశాల ప్రాధాన్యత పెరుగుతుండటం ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ చైర్మన్ జిమ్ ఓనీల్ బుధవారం ఇక్కడ చైనా ప్రభుత్వ రంగ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వ్యక్తం చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల తొలి అక్షరాలను కలుపుతూ 2001లో తొలిసారి ఓనీల్... ‘బ్రిక్' పదాన్ని సృష్టించారు. అయితే 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా మారిపోయింది. దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగిలిన నాలుగు దేశాలూ తన అంచనాకు మించి అభివృద్ధి చెందాయని అన్నారు. గత ఏడాది నుండి ఆర్దిక అభివృద్ది మందగించినా 2011లో బ్రిక్స్ దేశాల మొత్తం జీడీపీ 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అన్నారు. ఇది ఇటలీ జీడీపీకి సమానం. 2015కల్లా బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు అమెరికా స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

బ్రిక్స్ బ్యాంక్ భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకుతో పోటీపడుతుంది..! | BRICS to set up development bank, create $100 billion contingency reserve | బ్రిక్స్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకుగా రూపొందే అవకాశం

In a major achievement for India in its campaign for reforming the international financial architecture, BRICS nations decided on Wednesday to establish a new development bank to finance infrastructure and to create a $100 billion contingency reserve arrangement to tackle any financial crisis in the emerging economies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X